కిడ్నీ ఫెయిల్యూర్ లక్షణాలు.. ఈ మార్పులు కనిపిస్తే జాగ్రత్త

Published by: Geddam Vijaya Madhuri

కిడ్నీలు సరిగా పనిచేయకపోతే శరీరంలో వ్యర్థాలు పేరుకుపోతాయి. దీంతో ఎప్పుడూ నీరసం, అలసట, బలహీనతగా అనిపిస్తుంది.

మూత్రం ఎక్కువగా రావడం, చాలా తక్కువగా రావడం, ఫోమ్‌లా కనిపించడం లేదా రంగు మారడం కిడ్నీ సమస్యల ప్రారంభ సంకేతాలు కావచ్చు.

కిడ్నీలు అదనపు ద్రవాన్ని బయటకు పంపలేకపోతే కాళ్లు, చేతులు, ముఖం చుట్టూ వాపులు కనిపిస్తాయి.

ఖనిజాల అసమతుల్యత వల్ల చర్మం పొడిగా మారి ఎక్కువగా దురద రావచ్చు.

కిడ్నీలు బలహీనపడితే జీర్ణక్రియపై ప్రభావం పడుతుంది. దీంతో ఆకలి తగ్గడం, వాంతుల భావన రావచ్చు.

శరీరంలో ద్రవాలు పేరుకుపోవడం వల్ల ఊపిరి తీసుకోవడం కష్టంగా అనిపించవచ్చు.

ప్రత్యేకంగా రాత్రి సమయంలో పదే పదే యూరిన్ రావడం కూడా కిడ్నీ సమస్యల ప్రారంభ లక్షణంగా భావిస్తారు.

ఎలక్ట్రోలైట్ అసమతుల్యత వల్ల కాళ్లలో క్రాంప్స్, కండరాలు పట్టేయడం జరగవచ్చు.

ఉదయం లేవగానే కళ్ల చుట్టూ వాపు కనిపిస్తే అది కిడ్నీలు ప్రోటీన్‌ను సరిగా ఫిల్టర్ చేయకపోవడం వల్ల కావచ్చు.

బీపీ ఎక్కువగా ఉండటం లేదా నియంత్రణలో లేకపోవడం కిడ్నీ డ్యామేజ్‌కు సంకేతం కావచ్చు.