అల్లం తాజాగా, ఎండిపోకుండా ఉండాలంటే ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవే

Published by: Geddam Vijaya Madhuri

అల్లాన్ని గాలి తగలకుండా ప్లాస్టిక్ ర్యాప్ లేదా జిప్‌లాక్ బ్యాగ్‌లో పెట్టి ఫ్రిజ్‌లో ఉంచితే ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది.

అల్లంపై తేమ ఉంటే త్వరగా పాడవుతుంది. కాబట్టి పూర్తిగా తుడిచి ఆరబెట్టి స్టోర్ చేయాలి.

గాలి లోపలికి వెళ్లకుండా ఉండే డబ్బాలో ఉంచితే అల్లం ఎండిపోకుండా ఉంటుంది.

ఎక్కువ రోజులు ఉపయోగించాలనుకుంటే ఫ్రీజర్‌లో పెట్టండి. అవసరమైనప్పుడు నేరుగా తురుముకుని వాడుకోవచ్చు.

అల్లాన్ని పూర్తిగా ఉంచితే తేమ నిల్వ ఉంటుంది. కట్ చేస్తే త్వరగా ఎండిపోతుంది.

ఫ్రిజ్‌లో పెట్టకపోతే చల్లగా, పొడిగా ఉండే ప్రదేశంలో ఉంచాలి.

కొన్ని రోజుల పాటు తాజాగా ఉంచాలంటే వెనిగర్‌లో నానబెట్టి ఫ్రిజ్‌లో ఉంచవచ్చు.

తొక్క తీసేస్తే అల్లం త్వరగా ఎండిపోతుంది. వాడేటప్పుడు మాత్రమే తొక్క తీసేయండి.

ఒక ముక్క పాడైతే మిగతావి కూడా త్వరగా పాడవుతాయి. వెంటనే తీసేయాలి.

ముడతలు పడిన అల్లం త్వరగా ఎండిపోతుంది. తాజా, గట్టిగా ఉన్న అల్లం ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది.