మొదటిసారి సిగరెట్ కాల్చడానికి ఇవే ప్రధాన కారణాలు

Published by: Geddam Vijaya Madhuri

చాలామంది మొదటిసారి స్మోకింగ్ చేయడానికి ప్రధాన కారణం ఫ్రెండ్స్. వారితో పాటు స్మోకింగ్ ట్రై చేయాలనిపించడం సాధారణం.

పని ఒత్తిడి, చదువు టెన్షన్, వ్యక్తిగత సమస్యల వల్ల చాలామంది సిగరెట్ తాగితే రిలాక్స్ అవుతామని భావిస్తారు.

సినిమాలు, సోషల్ మీడియా ప్రభావం వల్ల కొందరు స్మోకింగ్ చేస్తే స్టైలిష్‌గా, కూల్‌గా కనిపిస్తామని అనుకుంటారు.

ఒక్కసారి ట్రై చేస్తే ఏమవుతుంది? అనే ఆలోచనతో చాలామంది మొదలు పెడతారు.

ఆందోళన, డిప్రెషన్, ఒంటరితనం వంటి మానసిక పరిస్థితుల నుంచి బయటపడేందుకు కొందరు స్మోకింగ్ స్టార్ట్ చేస్తారు.

ఫ్యామిలీలో ఎవరైనా స్మోకింగ్ చేస్తే పిల్లల్లో కూడా అదే అలవాటు వచ్చే అవకాశం ఉంటుంది.

ఫ్రెండ్స్ గ్రూప్‌లో కలిసిపోవాలనే ఉద్దేశంతో కొందరు ఇష్టంలేకపోయినా స్మోకింగ్ ప్రారంభిస్తారు.

సినిమాల్లో హీరోలు స్మోకింగ్ చేయడం, సోషల్ మీడియాలో కనిపించే కంటెంట్ యువతపై ప్రభావం చూపుతుంది.

కొంతమంది నిద్ర పోకుండా ఉండటానికి లేదా అలసట తగ్గించుకోవడానికి స్మోకింగ్ చేస్తారు. నికోటిన్ తాత్కాలికంగా అలర్ట్‌గా ఫీల్ అయ్యేలా చేస్తుంది.

ఒక్కసారి అలవాటు పడితే నికోటిన్‌పై ఆధారపడే పరిస్థితి వస్తుంది. తర్వాత మానేయాలని అనుకున్నా కష్టంగా మారుతుంది.