అమ్మ ఆరోగ్యంగా ఉండాలంటే.. ఫాలో అవ్వాల్సిన హెల్త్ టిప్స్

Published by: Geddam Vijaya Madhuri

సమయానికి ఫుడ్ తీసికోవాలి. లేకపోతే గ్యాస్, అలసట, బీపీ వంటి సమస్యలు రావచ్చు.

రోజూ కనీసం 30 నిమిషాలు నడవాలి. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచి.. బీపీ, షుగర్, బరువు కంట్రోల్ చేస్తుంది.

ఇంటిపనుల్లో బిజీగా ఉండి నీళ్లు తాగడం మరిచిపోకండి. శరీరానికి సరిపడా నీరు తాగడం చాలా ముఖ్యం.

వయసు పెరిగేకొద్దీ ఎముకలు వీక్ అవుతాయి. పాలు, పెరుగు, ఆకుకూరలు, ఖర్జూరం వంటి ఫుడ్స్ తీసుకుంటే మంచిది.

కుటుంబ బాధ్యతలతో మానసిక ఒత్తిడికి గురవుతుంటే.. మెడిటేషన్, యోగా, ఇష్టమైన పనులు చేయడం ద్వారా స్ట్రెస్ తగ్గించుకోవచ్చు.

రాత్రిళ్లు ఆలస్యంగా పడుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. రోజుకు 7–8 గంటలు నిద్రపోతే శరీరం, మెదడు రిలాక్స్ అవుతాయి.

బీపీ, షుగర్, థైరాయిడ్, హిమోగ్లోబిన్ వంటి టెస్టులు చేయించుకోవాలి. సమస్యలను ముందుగానే గుర్తించడం చాలా ముఖ్యం.

ఆయిల్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ తరచూ తినడం వల్ల కొలెస్ట్రాల్, బరువు పెరిగే ప్రమాదం ఉంటుంది. కాబట్టి హెల్తీ ఫుడ్ తీసుకోవాలి.

అమ్మలు తమ ఆరోగ్యాన్ని పట్టించుకోరు. రోజులో కొంతసేపు రిలాక్స్ అవ్వడానికి, ఇష్టమైన పనులు చేయడానికి సమయం కేటాయించాలి.

నవ్వుతూ, పాజిటివ్‌గా ఉండటం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. కాబట్టి అమ్మను సంతోషంగా ఉంచడానికి ప్రయత్నించాలి.

కాబట్టి అమ్మ ఆరోగ్యానికి మీరు హెల్ప్ చేయండి. వారితో ఈ అలవాట్లు ఫాలో అయ్యేలా చూసుకోండి.