మగవారు నువ్వులు తింటే కలిగే లాభాలు ఇవే

Published by: Geddam Vijaya Madhuri

నువ్వులలో జింక్, సెలీనియమ్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మగవారిలో టెస్టోస్టెరాన్ పెంచి.. శక్తి, స్టామినా మెరుగు చేస్తాయి.

నువ్వులలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, జింక్ శుక్రాణువుల సంఖ్య, చలనశక్తిని పెంచుతాయి.

నువ్వులలో సెసమిన్, సెసమోలిన్ అనే సమ్మేళనాలు చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి. ఇది గుండె జబ్బుల రిస్క్ తగ్గిస్తుంది.

నువ్వులలో ప్రొటీన్, కాల్షియమ్, మెగ్నీషియమ్ అధికంగా ఉంటాయి. జిమ్ చేసేవారికి చాలా మేలు జరుగుతుంది.

వయసు పెరిగే కొద్దీ ఎముకలు బలహీనపడతాయి. నువ్వులలో కాల్షియమ్, మెగ్నీషియమ్, జింక్ కలిసి ఎముకల సాంద్రతను పెంచుతాయి.

నువ్వులలో మెగ్నీషియమ్, ట్రిప్టోఫాన్ ఉంటాయి. ఇవి స్ట్రెస్, ఆందోళన తగ్గిస్తాయి.

నువ్వులలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది పేగు పనితీరును మెరుగుపరచి మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది.

నువ్వులలో మెగ్నీషియం బీపీని నియంత్రించడంలో సహాయపడుతుంది. రక్తనాళాలను సడలించి బ్లడ్ ప్రెషర్ తగ్గిస్తుంది.

నువ్వులలో విటమిన్ E, హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి చర్మాన్ని తేమగా ఉంచి ముడతలు రాకుండా చేస్తాయి.

నువ్వులలో సెసమిన్ లివర్‌ను డిటాక్స్ చేయడంలో, ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి రక్షించడంలో సహాయపడుతుంది.

వైద్యులు, నిపుణుల సూచనల మేరకు లిమిటెడ్గా తీసుకుంటే ఆరోగ్యానికి మంచి ఫలితాలు అందుతాయి.