రోజూ కనిపించే హై బ్లడ్ షుగర్ లక్షణాలు

Published by: Geddam Vijaya Madhuri

నీళ్లు ఎంత తాగినా మళ్లీ మళ్లీ దాహం వేయడం హై బ్లడ్ షుగర్ ప్రధాన లక్షణాల్లో ఒకటి.

తరచూ మూత్రానికి వెళ్లడం కూడా సంకేతమే. రాత్రిళ్లు కూడా పలుమార్లు మూత్రానికి వెళ్లాల్సి వస్తే అది షుగర్ సంకేతం కావచ్చు.

తిన్న వెంటనే మళ్లీ ఆకలి వేయడం కూడా హై బ్లడ్ షుగర్ లక్షణం కావచ్చు.

రోజంతా బలహీనంగా, అలసటగా అనిపించడం కూడా షుగర్ లక్షణంగా ఉండొచ్చు.

రక్తంలో చక్కెర ఎక్కువగా ఉంటే కళ్లపై ప్రభావం పడుతుంది. దీంతో చూపు మసకగా కనిపించడం, ఫోకస్ సమస్యలు రావచ్చు.

చిన్న గాయాలు కూడా త్వరగా మానకపోతే జాగ్రత్త. హై బ్లడ్ షుగర్ వల్ల రక్తప్రసరణ ప్రభావితమై గాయాలు నెమ్మదిగా మానుతాయి.

షుగర్ ఎక్కువకాలం నియంత్రణలో లేకపోతే నరాలపై ప్రభావం పడుతుంది. దీంతో చేతులు, కాళ్లలో తిమ్మిర్లు, మొద్దుబారిన ఫీలింగ్ రావచ్చు.

చర్మం పొడిబారడం, దురద, ఇన్‌ఫెక్షన్లు తరచూ రావడం కూడా హై బ్లడ్ షుగర్ సంకేతాలు కావచ్చు.

ఎక్కువగా తింటున్నా అకస్మాత్తుగా బరువు తగ్గిపోతే అది డయాబెటిస్ లక్షణం కావచ్చు.

యూరిన్ ఇన్ఫెక్షన్లు, చర్మ ఇన్ఫెక్షన్లు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు తరచూ వస్తే రక్తంలో చక్కెర స్థాయిలు చెక్ చేయించుకోవాలి.

ఈ లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించండి.