అన్వేషించండి

Stress Increase Diabetes : ఒత్తిడి వల్ల డయాబెటిస్ పెరుగుతుందా? మగవారిలో పెరుగుతున్న సైలెంట్ సమస్య

Stress and Diabetes : మగవారిలో స్ట్రెస్ పెరిగితే షుగర్ కూడా పెరుగుతుందఅని అంటున్నారు నిపుణులు. వీటి మధ్య సంబంధం ఏంటి? ఒత్తిడి, మధుమేహం పెరగడానికి కారణాలు ఏంటో చూసేద్దాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మధుమేహం శారీరకంగానే కాదు, మానసికంగానూ ఒత్తిడిని కలిగిస్తుంది.
  • పురుషులు తమ మానసిక సమస్యలను పంచుకోకపోవడం వలన వ్యాధి తీవ్రమవుతుంది.
  • మధుమేహం నియంత్రణకు మందులతో పాటు కౌన్సిలింగ్, కుటుంబ మద్దతు అవసరం.
  • వ్యాయామం, సమతుల్య ఆహారం, ధ్యానం, తగినంత నిద్ర ఒత్తిడిని తగ్గిస్తాయి.

Hidden Link Between Stress and Diabetes in Men : డయాబెటిస్ అనేది శారీరక సమస్య అనే అనుకుంటారు. కానీ నిపుణులు అది మానసికంగా కూడా చాలా పెద్ద ప్రభావం చూపించే వ్యాధి అని అంటున్నారు. ముఖ్యంగా మగవారిలో ఈ సమస్య మరింత సైలెంట్‌గా, బయటపడకుండా ఎక్కువకాలం కొనసాగుతుందని చెప్తున్నారు. ఎందుకంటే మగవారు తమ మానసిక సమస్యలను బయట డిస్కషన్ చేయకపోవడం వల్లే ఈ దీర్ఘకాలిక సమస్యలు పెరుగుతున్నాయంటున్నారు. 

మధుమేహానికి, మానసిక ఆరోగ్యానికి ఇదే సంబంధం  

డయాబెటిస్ ఉన్నవారు ప్రతిరోజూ బ్లడ్ షుగర్ లెవల్స్ చెక్ చేయడం, డైట్ కంట్రోల్, ఎక్సర్సైజ్ వంటి క్రమశిక్షణ పాటించాలి. ఇది శారీరకంగా మాత్రమే కాదు. మానసికంగా కూడా ఒత్తిడిని కలిగిస్తుంది. అంతర్జాతీయ అధ్యయనాల ప్రకారం.. డయాబెటిస్ ఉన్నవారిలో డిప్రెషన్ వచ్చే అవకాశం 2 రెట్లు ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. ఈ ఒత్తిడి వల్ల బాడీ, మైండ్ రెండూ ప్రభావితం అవుతాయట.

మగవారిలో మానసిక సమస్యలు 

మగవారు మానసికంగా ఇబ్బంది పడుతున్నా.. వారు బయట పడకుండా ఉండడానికి కొన్ని కారణాలు ఉన్నాయట.  సామాజిక ఒత్తిడి వల్ల తాము బలహీనులమని ఒప్పుకోలేక స్ట్రగుల్ అవుతున్నారు. అలాగే ఎమోషన్స్, ఫీలింగ్స్ షేర్ చేసుకుంటే.. అపార్థం చేసుకుంటారనే భయంతో పాటు.. వైద్య సహాయం తీసుకోవాలన్నా సంకోచించడం వల్లే ఇలా జరుగుతుంది అంటున్నారు. ఈ మౌనం సమస్యను మరింత తీవ్రమయ్యేలా చేస్తుందని నిపుణులు అంటున్నారు

డయాబెటిస్ స్ట్రెస్

డయాబెటిస్ ఉన్నప్పుడు మానసిక సమస్యలు పెరగడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. వైద్యులు సూచించిన మందులు సమయానికి తీసుకోకపోవడం, డైట్ ఫాలో కాకపోవడం, వ్యాయామం చేయకపోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో ఉండవు. అప్పుడే శారీరక సమస్యలు పెరిగితే.. మానసికంగా మరింత కృంగిపోతారని చెప్తున్నారు. 

నిపుణుల సూచనలు..

ఎండోక్రైనాలజిస్టులు, సైకాలజిస్టులు డయాబెటిస్ ఉన్నవారు.. మానసిక ఆరోగ్య స్క్రీనింగ్ చేయించుకోవాలని అంటున్నారు. మధుమేహాన్ని కంట్రోల్ చేయాలంటే.. కేవలం మందులు సరిపోవని.. కౌన్సిలింగ్ కూడా అవసరమని అంటున్నారు. అలాగే ఫ్యామిలీ సపోర్ట్ ఇంపార్టెంట్ అంటున్నారు. 

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

రెగ్యులర్​గా వ్యాయామం చేయడంతో పాటు.. సమతుల్య ఆహారం తీసుకోవాలి. అలాగే మెడిటేషన్ అలవాటు చేసుకుంటే మంచిది. ఒత్తిడి, మధుమేహాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి నిద్ర చాలా ముఖ్యం. అలాగే రెగ్యులర్​గా మధుమేహాన్ని చెక్​ చేసుకుంటూ.. వైద్యులు సూచించిన మందులు తీసుకోవాలి. అలాగే ఏదైనా స్ట్రెస్ ఉంటే నచ్చినవాళ్లతో షేర్ చేసుకోవాలని సూచిస్తున్నారు. కెఫిన్, ఆల్కహాల్​కు దూరంగా ఉండాలి.

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Curry Leaves and Hair Oil : జుట్టు ఒత్తుగా, బలంగా కనిపించాలంటే.. కరివేపాకుతో ఈ 5 రకాల నూనెలను కలిపి ట్రై చేయండి
జుట్టు ఒత్తుగా, బలంగా కనిపించాలంటే.. కరివేపాకుతో ఈ 5 రకాల నూనెలను కలిపి ట్రై చేయండి
Best Foods for Dinner : రాత్రి భోజనం ఇలా ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిదట.. ఏం తినాలి? ఏం తినకూడదు?
రాత్రి భోజనం ఇలా ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిదట.. ఏం తినాలి? ఏం తినకూడదు?
IRCTC Japan Tour Package : IRCTC జపాన్ టూర్ ప్యాకేజీ.. తక్కువ బడ్జెట్‌లో 10 రోజుల ప్రత్యేక ప్యాకేజీని పొందండి, పూర్తి వివరాలివే
IRCTC జపాన్ టూర్ ప్యాకేజీ.. తక్కువ బడ్జెట్‌లో 10 రోజుల ప్రత్యేక ప్యాకేజీని పొందండి, పూర్తి వివరాలివే
32 Kg Weight Loss Journey : ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Job Notifications Politics: ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
Colombia Earthquake: కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
Fact Check: చైనా సైన్యం అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించిందా? వైరల్ వీడియోలో నిజమెంత? 
చైనా సైన్యం అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించిందా? వైరల్ వీడియోలో నిజమెంత? 
VIP Mobile Number:విఐపి మొబైల్ నంబర్‌ ఎలా తీసుకోవచ్చు? దాని ప్రక్రియ, ఖర్చు గురించి తెలుసా? 
విఐపి మొబైల్ నంబర్‌ ఎలా తీసుకోవచ్చు? దాని ప్రక్రియ, ఖర్చు గురించి తెలుసా? 
ఆగష్టు 12వ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు! కానీ..ఈ 4 రాశులవారు జాగ్రత్తగా ఉండాలి?
ఆగష్టు 12వ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు! కానీ..ఈ 4 రాశులవారు జాగ్రత్తగా ఉండాలి?
2026 ఆగష్టు 15 తర్వాత ప్రధాని మోదీకి చంద్రబాబు, నితీష్ సెగ? Gen Z , ప్రతిపక్షం దూకుడు!
2026 ఆగష్టు 15 తర్వాత ప్రధాని మోదీకి చంద్రబాబు, నితీష్ సెగ? Gen Z , ప్రతిపక్షం దూకుడు!
రూ.1 లక్ష బెనిఫిట్ అందిస్తున్న Hyundai Creta.. కొనేముందు ఈ విషయాలు తెలుసుకోండి
రూ.1 లక్ష బెనిఫిట్ అందిస్తున్న Hyundai Creta.. కొనేముందు ఈ విషయాలు తెలుసుకోండి
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Embed widget