అన్వేషించండి

Dengue Cases : పెరుగుతున్న డెంగ్యూ, మలేరియా కేసులు.. పిల్లలు, పెద్దలు తప్పనిసరిగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే

Dengue and Malaria : తెలుగు రాష్ట్రాల్లో సీజనల్ వ్యాధులతో పాటు డెంగ్యూ, మలేరియా కేసులు పెరుగుతున్నాయి. ఈ సమయంలో పెద్దలు, పిల్లలు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటన్నారు. అవేంటంటే..

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • తెలుగు రాష్ట్రాల్లో దోమల బెడద, సీజనల్ వ్యాధుల ముప్పు పెరిగింది.
  • డెంగ్యూ, మలేరియా వైరస్, పరాన్నజీవి ద్వారా వ్యాపిస్తాయి.
  • జ్వరం, తలనొప్పి, కీళ్ల నొప్పులు డెంగ్యూ లక్షణాలు.
  • దోమల నివారణకు నిల్వ నీటిని తొలగించండి, జాగ్రత్తలు పాటించండి.

Dengue and Malaria Cases Rising in Telugu States : తెలుగు రాష్ట్రాల్లో దోమల బెడద రోజురోజుకీ పెరుగుతోంది. దీంతో డెంగ్యూ, మలేరియా కేసులు పెరుగుతున్నాయి. ఎండలు, వర్షాలు, నిల్వ నీరు, పరిశుభ్రత లోపం వల్ల దోమల వ్యాప్తి మరింత పెరుగుతుంది. దీంతో సీజనల్ వ్యాధులతో పాటు.. డెంగ్యూ, మలేరియా కూడా ఇబ్బంది పెడుతుంది. వీటిని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయం తప్పదని.. కాబట్టి ముందుగానే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. 

డెంగ్యూ, మలేరియా 

డెంగ్యూ అనేది వైరస్ ద్వారా వ్యాపించే వ్యాధి. ఇది ప్రధానంగా Aedes దోమల ద్వారా వ్యాపిస్తుంది. మలేరియా ప్లాస్మోడియం పరాన్నజీవి వల్ల వస్తుంది. ఇది Anopheles దోమల ద్వారా వ్యాపిస్తుంది. ఈ రెండు కాస్త భిన్న లక్షణాలు కలిగి ఉంటాయి. 

డెంగ్యూ లక్షణాలు

డెంగ్యూ సోకితే అధిక జ్వరంతో పాటు తీవ్రమైన తలనొప్పి వస్తుంది. దీనివల్ల కంటి వెనక కూడా నొప్పి వస్తుంది. కీళ్ల, కండరాల నొప్పులు.. చర్మంపై ఎర్రటి మచ్చలు వస్తాయి. 

మలేరియా లక్షణాలు

మలేరియా వల్ల చలి జ్వరం వస్తుంది. చెమటలు ఎక్కువగా పడటంతో పాటు.. వాంతులు, అలసట వంటి లక్షణాలు ఉంటాయి. 
ఈ లక్షణాలు మీకు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోండి. ఆలస్యం చేస్తే ఆరోగ్యానికి తీవ్రమైన నష్టం వాటిల్లుతుంది. ప్రాణాపాయం కూడా కావచ్చు. ఒకవేళ డెంగ్యూ, మలేరియా రాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అవేంటంటే.. 

తీసుకోవాల్సిన జాగ్రత్తలు 

ఇంటి చుట్టూ మొక్కలు, కుండీలు, టైర్లు, ట్యాంకులు వంటి చోట్ల నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. దోమల నుంచి రక్షణ కోసం నెట్స్ వాడాలి. చేతులు, కాళ్లు కప్పుకునేలా దుస్తులు వేసుకుంటే మంచిది. క్రీములు, లిక్విడ్స్, కాయిల్స్ వంటివి ఉపయోగించండి. ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు.. పిల్లల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండండి. అలాగే ఇమ్యూనిటీని పెంచే ఫుడ్స్ తీసుకోవాలి. అలాగే నీటిని కూడా మరిగించి తీసుకుంటే మంచిది.

జ్వరం లక్షణాలు ఉంటే సొంతంగా మెడిసన్ తీసుకోకుండా.. వైద్య సహాయం తీసుకుంటే మంచిది. ఎందుకంటే మీకు కాస్త రిలీఫ్ అనిపించినా నిర్లక్ష్యం చేస్తారు. దీనివల్ల సమస్య తీవ్రత పెరిగిపోతుంది. డెంగ్యూ, మలేరియా వంటి వాటిని ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటే నివారించవచ్చు. కాబట్టి నిర్లక్ష్యం చేయకండి.

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Monsoon Mold : ఇంట్లో పెరిగే బూజుతో జాగ్రత్త, ముఖ్యంగా వర్షాకాలంలో.. ఊపిరితిత్తులపై ప్రభావం చూపొచ్చంటున్న వైద్యులు
ఇంట్లో పెరిగే బూజుతో జాగ్రత్త, ముఖ్యంగా వర్షాకాలంలో.. ఊపిరితిత్తులపై ప్రభావం చూపొచ్చంటున్న వైద్యులు
Fenugreek Growing Tips : ఇంట్లోనే మెంతి కూర చాలా ఈజీగా పెంచుకోవచ్చు తెలుసా? చిన్న కుండీలో పెంచగలిగే టిప్స్ ఇవే
ఇంట్లోనే మెంతి కూర చాలా ఈజీగా పెంచుకోవచ్చు తెలుసా? చిన్న కుండీలో పెంచగలిగే టిప్స్ ఇవే
Tips To Control Diabetes : మధుమేహాన్ని డైట్​తోనే కాదు.. ఈ 3 మార్పులతో బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయండి
మధుమేహాన్ని డైట్​తోనే కాదు.. ఈ 3 మార్పులతో బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయండి
Castor Oil for Hair : ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి
ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget