అన్వేషించండి

Summer Drinks : ఎండ వల్ల అలసటగా ఉందా? హీట్ స్ట్రోక్ రాకూడదంటే.. ఈ డ్రింక్స్ తాగండి, బెస్ట్

Beat the Heat with Juices సమ్మర్‌లో డీహైడ్రేషన్‌కి గుడ్‌బై చెప్పాలనుకుంటే కొన్ని ఫ్రూట్ జ్యూసులు, హైడ్రేషన్ డ్రింక్స్ తీసుకోవచ్చు. వాటిని తీసుకునేప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే హెల్తీగా ఉంటారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • వేసవి వేడిని తట్టుకోవడానికి పుచ్చకాయ, పైనాపిల్ జ్యూస్‌లు ఉత్తమం.
  • లిచీ, చెరకు రసం శరీరానికి శక్తిని, తాజాదనాన్ని అందిస్తాయి.
  • నిమ్మరసం, ఆమ్ పన్నా, కొబ్బరి నీరు శరీరానికి చల్లదనాన్ని ఇస్తాయి.
  • మజ్జిగ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, తాజా జ్యూస్‌లు ఆరోగ్యానికి మంచివి.

Best Fruit Juices to Beat Summer Heat : ఎండ వేడి రోజు రోజుకి పెరిగిపోతుంది. దీనివల్ల శరీరం త్వరగా అలసిపోవడం, డీహైడ్రేషన్​కి గురవ్వడం జరుగుతుంది. అందుకే ఈ సమయంలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవాలని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇలాంటి సమయంలో చాలామంది డ్రింక్స్ తాగాలని చూస్తారు. కానీ వాటి కంటే ఫ్రూట్ జ్యూసులు మంచివి. ఎందుకంటే ఇవి కేవలం దాహాన్ని తీర్చడమే కాకుండా.. శరీరానికి అవసరమైన పోషకాలు, ఎనర్జీని కూడా అందిస్తాయి. అయితే సమ్మర్​లో ఎలాంటి జ్యూస్​లు తాగితే శరీరానికి మంచిదో చూసేద్దాం. 

పుచ్చకాయ జ్యూస్

పుచ్చకాయలో సుమారు 92% నీరు ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. ఇందులో ఉన్న లైకోపీన్ చర్మాన్ని సూర్యకిరణాల వల్ల కలిగే నష్టాల నుంచి కాపాడుతుంది. వేడి వాతావరణంలో లేదా ఎండలో తిరిగినప్పుడు పుచ్చకాయ జ్యూస్ తాగితే వెంటనే ఫ్రెష్‌గా ఫీల్ అవుతారు.

పైనాపిల్ జ్యూస్

పైనాపిల్ జ్యూస్ శరీరానికి తక్షణమే తాజాదనాన్ని అందిస్తుంది. ఇందులో ఉండే విటమిన్ C, పొటాషియం శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేయడంలో సహాయపడతాయి. అలాగే సమ్మర్లో వచ్చే జీర్ణ సమస్యలను దూరం చేసి.. జీర్ణశక్తిని మెరుగుపరచడంలో హెల్ప్ చేస్తుంది.

లిచీ జ్యూస్

వేసవిలో లిచీ జ్యూస్ మంచి కూలింగ్ డ్రింక్‌గా చెప్తారు. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని రక్షించడంలో సహాయపడతాయి. ఇది అలసిపోయిన బాడీకి తక్షణమే శక్తిని అందించి.. జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది.

చెరకు రసం

చెరకు రసం సమ్మర్లో కొందరు ఎక్కువగా తాగుతారు. ఇది సహజమైన ఎనర్జీ డ్రింక్‌లా పనిచేస్తుంది. ఇది డీహైడ్రేషన్‌ను తగ్గించి.. శరీరానికి వెంటనే ఎనర్జీ ఇస్తుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది.

నిమ్మరసం

తక్కువ ఖర్చులో ఆరోగ్యానికి మేలు చేసే పానీయాల్లో నిమ్మరసం ముందు ఉంటుంది. ఇది జీర్ణశక్తిని పెంచి.. రోగనిరోధక శక్తిని బలపరిచడంతో పాటు.. శరీరాన్ని డిటాక్స్ చేయడంలో కూడా సహాయపడుతుంది.

ఆమ్ పన్నా 

మామిడితో మ్యాంగో జ్యూస్ కాకుండా.. ఆమ్ పన్నా కూడా తయారు చేసుకుంటారు. ఇది శరీరాన్ని చల్లబరచడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుంది. అలాగే హీట్ స్ట్రోక్ నుంచి కాపాడుతుంది.

కొబ్బరి నీరు

కొబ్బరి నీరు సహజమైన ఎలక్ట్రోలైట్ డ్రింక్. ఇది శరీరంలో నీటి లోపాన్ని త్వరగా భర్తీ చేస్తుంది. వేసవిలో రోజూ ఒక గ్లాస్ తాగితే చాలా మంచిది.

మజ్జిగ

మజ్జిగ శరీరానికి చల్లదనం ఇవ్వడమే కాకుండా.. జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. వేసవిలో తాగేందుకు అనువైన డ్రింక్స్​లో ఇది కూడా ఒకటి. దీనిలోని ప్రోబయోటిక్స్ గట్ హెల్త్​కి మేలు చేస్తాయి. 

జ్యూస్​లు తాగాలనుకుంటే.. 

వేసవిలో జ్యూస్​లు మంచి ఆప్షనే. కానీ ఆరోగ్యంగా ఉండాలనుకుంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. జ్యూస్​లో షుగర్ లేకుండా లేదా తక్కువ షుగర్ వేసుకుని తాగండి. ప్యాక్డ్ జ్యూస్​ల కంటే.. తాజా పండ్లతో తయారు చేసినవి బెస్ట్. అలాగే రోజుకు 1 లేదా 2 గ్లాసులు తాగితే సరిపోతుంది. ఇలా తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ తగ్గి.. ఆరోగ్యంగా కూడా ఉండగలుగుతారు. 

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Monsoon Mold : ఇంట్లో పెరిగే బూజుతో జాగ్రత్త, ముఖ్యంగా వర్షాకాలంలో.. ఊపిరితిత్తులపై ప్రభావం చూపొచ్చంటున్న వైద్యులు
ఇంట్లో పెరిగే బూజుతో జాగ్రత్త, ముఖ్యంగా వర్షాకాలంలో.. ఊపిరితిత్తులపై ప్రభావం చూపొచ్చంటున్న వైద్యులు
Fenugreek Growing Tips : ఇంట్లోనే మెంతి కూర చాలా ఈజీగా పెంచుకోవచ్చు తెలుసా? చిన్న కుండీలో పెంచగలిగే టిప్స్ ఇవే
ఇంట్లోనే మెంతి కూర చాలా ఈజీగా పెంచుకోవచ్చు తెలుసా? చిన్న కుండీలో పెంచగలిగే టిప్స్ ఇవే
Tips To Control Diabetes : మధుమేహాన్ని డైట్​తోనే కాదు.. ఈ 3 మార్పులతో బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయండి
మధుమేహాన్ని డైట్​తోనే కాదు.. ఈ 3 మార్పులతో బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయండి
Castor Oil for Hair : ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి
ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Embed widget