అన్వేషించండి

Tips To Control Diabetes : మధుమేహాన్ని డైట్​తోనే కాదు.. ఈ 3 మార్పులతో బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయండి

Diabetes Management : బ్లడ్ షుగర్ నియంత్రణలో డైట్ కీలకమైనప్పటికీ.. దానితో పాటు రోజువారీ జీవనశైలిని కూడా మార్చుకోవాలి. అయితే మూడు మార్పులతో మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చని నిపుణులు చెప్తున్నారు. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • తరచూ శారీరక శ్రమ, భోజనం తర్వాత నడవడం అవశ్యం.
  • సరైన నిద్ర లేకపోవడం రక్తంలో చక్కెరను పెంచుతుంది.
  • ఒత్తిడి తగ్గించుకుంటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు మెరుగుపడతాయి.

Blood Sugar Management : మధుమేహం నియంత్రించి.. అదుపులో ఉంచుకోవాలంటే కేవలం ఆహారంపై మాత్రమే దృష్టి పెడితే సరిపోదని చెప్తున్నారు నిపుణులు. ఏం తింటున్నారనేది ఎంత ముఖ్యమో.. రోజువారీ జీవనశైలి, శారీరక చలనం, నిద్ర, ఒత్తిడిని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారనేది కూడా అంతే ముఖ్యమని అంటున్నారు. ముఖ్యంగా ప్రీడయాబెటిస్ లేదా డయాబెటిస్ ఉన్నవారు చిన్న చిన్న జీవనశైలి మార్పులు చేసుకోవడం ద్వారా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను మెరుగ్గా నిర్వహించుకోవచ్చని సూచిస్తున్నారు. మరి డైట్​తో పాటు నిపుణులు సూచిస్తున్న మూడు ముఖ్యమైన మార్పులు ఏంటో చూసేద్దాం. 

ఒకేచోట ఎక్కువసేపు కూర్చోకండి..

శారీరక శ్రమ ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో, శరీరం గ్లూకోజ్‌ను సమర్థంగా ఉపయోగించుకోవడంలో సహాయపడుతుంది. కాబట్టి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల బ్లడ్ షుగర్ నియంత్రణకు మేలు జరుగుతుంది. ఏరోబిక్ వ్యాయామాలతో పాటు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కూడా ఉపయోగకరంగా ఉంటుంది.

Also Read : మధుమేహం(Type 2 Diabetes) ఉన్నవారికి డెంగ్యూ వస్తే ప్రమాదమా? ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి

దీనికోసం ప్రతిరోజూ గంటల తరబడి జిమ్‌లో గడపాల్సిన అవసరం లేదు. కానీ భోజనం తర్వాత కొద్దిసేపు నడవడం వంటి చిన్న మార్పులు కూడా ఉపయోగపడతాయి. ఎక్కువసేపు ఒకే చోట కూర్చోకుండా తరచూ లేచి కొద్దిసేపు నడవడం.. వీలైనప్పుడు లిఫ్ట్‌కు బదులు మెట్లు ఉపయోగించడం.. ఉదయం లేదా సాయంత్రం పార్క్‌లో, ఇంటి పరిసరాల్లో నడవడం.. ఇంట్లోనే సులభమైన వ్యాయామాలు చేయడం.. ప్రయాణంలో కొంత దూరం నడవడానికి ప్రయత్నించడం.. భోజనం తర్వాత కొద్దిసేపు నడిచే అలవాటు చేసుకోవాలని సూచిస్తున్నారు.

నిద్రకు ప్రాధాన్యత

బ్లడ్ షుగర్ నియంత్రణలో నిద్రను చాలామంది నిర్లక్ష్యం చేస్తారు. కానీ సరైన నిద్ర లేకపోతే ఆకలి, ఆహార కోరికలు, ఒత్తిడికి సంబంధించిన హార్మోన్లలో మార్పులు రావచ్చు. ఫలితంగా రాత్రిపూట తినడం, అధిక కేలరీల ఆహారం తీసుకోవడం వంటి అలవాట్లు పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నిద్రలేమి కార్టిసాల్ వంటి హార్మోన్లపై ప్రభావం చూపి రక్తంలో చక్కెర స్థాయిలను ప్రభావితం చేయవచ్చు.

Also Read : మధుమేహం, బీపీ, గుండె సమస్యలున్నవారికి 5 బెస్ట్ వ్యాయామాలు ఇవే.. నిపుణుల సూచనలతో

ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోవడానికి ప్రయత్నించండి. పడుకునే ముందు స్క్రీన్ వినియోగాన్ని తగ్గించుకోండి. బెడ్‌రూమ్‌ను ప్రశాంతంగా, చీకటిగా, సౌకర్యవంతంగా ఉంచుకోండి. గది మరీ వేడిగా లేకుండా.. మీకు సరిపడేంత గాలి ఉండేలా చూసుకోండి. తగినంత నిద్రపోయినా రోజంతా తీవ్రమైన అలసటగా అనిపిస్తుంటే కచ్చితంగా వైద్యుడిని సంప్రదించండి. 

ఒత్తిడిని తగ్గించుకోవడం

దీర్ఘకాలిక ఒత్తిడి కూడా బ్లడ్ షుగర్‌పై ప్రభావం చూపవచ్చు. ఒత్తిడి సమయంలో శరీరంలో కార్టిసాల్ వంటి హార్మోన్లు పెరుగుతాయి. ఇవి శరీరానికి అవసరమైన శక్తిని అందించేందుకు కాలేయం నుంచి గ్లూకోజ్ విడుదలను పెంచుతాయి. ఒత్తిడి నిరంతరం కొనసాగితే రక్తంలో గ్లూకోజ్ నియంత్రణ మరింత కష్టమయ్యే అవకాశం ఉంది. అందుకే డయాబెటిస్ ఉన్నవారు స్ట్రెస్​ని లైట్​గా తీసుకోకూడదు. 

Also Read : ప్రీ-డయాబెటిస్ ఉందా? ఈ ఫుడ్స్ మానేసి.. ఇవి తింటే మధుమేహం రాదట, ఫాలో అయిపోండి

ఒత్తిడి తగ్గించుకోవడానికి కొన్ని నిమిషాలు నెమ్మదిగా, లోతుగా శ్వాస తీసుకునే వ్యాయామాలు చేయండి. ధ్యానం లేదా మైండ్‌ఫుల్‌నెస్ సాధన చేయండి. రోజులో జరిగిన మంచి విషయాలను రాసుకునే అలవాటు చేసుకోండి. కుటుంబ సభ్యులు, స్నేహితులతో మాట్లాడటానికి సమయం కేటాయించండి. మీకు నచ్చిన సంగీతం వినడం, బయట నడవడం వంటి రిలాక్సింగ్ కార్యకలాపాలు చేయండి. పని మధ్యలో చిన్న విరామాలు తీసుకోండి.

మధుమేహం గురించిన మరింత సమాచారం, ఇంట్రెస్టింగ్ వార్తల కోసం దీనిని క్లిక్ చేయండి. 

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tips To Control Diabetes : మధుమేహాన్ని డైట్​తోనే కాదు.. ఈ 3 మార్పులతో బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయండి
మధుమేహాన్ని డైట్​తోనే కాదు.. ఈ 3 మార్పులతో బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయండి
Castor Oil for Hair : ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి
ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి
Korean Glass Skin Drink : కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం ఈ మ్యాజిక్ డ్రింక్ తాగాలా? నిమ్మ-కీరదోసకాయ జ్యూస్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం ఈ మ్యాజిక్ డ్రింక్ తాగాలా? నిమ్మ-కీరదోసకాయ జ్యూస్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
Independence Day Quiz Questions : ఆగస్టు 15పై పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన GK ప్రశ్నలు.. సమాధానాలు ఇవే
ఆగస్టు 15పై పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన GK ప్రశ్నలు.. సమాధానాలు ఇవే
Advertisement

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Andhra Pradesh Assembly Sessions: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
Embed widget