అన్వేషించండి

Health Drinks : మధుమేహం, కొలెస్ట్రాల్ తగ్గించే 5 హెల్తీ డ్రింక్స్ ఇవే.. వేటితో ఏ లాభాలున్నాయంటే

Herbal Drinks : మధుమేహం, కొలెస్ట్రాల్ ఈ మధ్యకాలంలో ఎక్కువమందిని ఇబ్బంది పెడుతున్న ఆరోగ్య సమస్యలు. వీటిని కంట్రోల్ చేయడానికి తీసుకోవాల్సిన డ్రింక్స్ ఏంటో చూసేద్దాం. 

Herbal Drinks for Better Health : ఈ మధ్యకాలంలో ఎక్కువమందిని ఇబ్బంది పెడుతున్న ఆరోగ్య సమస్యల్లో మధుమేహం, కొలెస్ట్రాల్ ప్రధానంగా ఉన్నాయి. అయితే వీటిని బ్యాలెన్స్ చేయడంలో వైద్యుల సూచనలతో పాటు.. ఆహారం కూడా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. అయితే ఈ డైట్​లో భాగంగా కొన్ని సహజమైన డ్రింక్స్​ని రెగ్యులర్​గా తీసుకుంటే మంచిదని చెప్తున్నారు. వంటగదిలో లభించే పసుపు, మెంతులు, జీలకర్ర వంటి వాటితో చేసుకునే పానీయాలు ఎన్నో వ్యాధులను దూరం చేస్తాయంటున్నారు. ఇంతకీ అవేంటో.. వాటివల్ల కలిగే లాభాలు ఏంటో చూసేద్దాం. 

పసుపు నీళ్లు

పసుపు నీరు రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. ఇది శరీర నొప్పి, వాపును తగ్గిస్తుంది. దీనికోసం గ్లాసు గోరువెచ్చని నీటిలో 1 టీస్పూన్ పసుపు వేయాలి. దానిలో చిటికెడు నల్ల మిరియాలు పొడిని కలిపి.. ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగాలి. ఇది ఇమ్యూనిటీని పెంచుతుంది. 

మెంతి నీళ్లు

మెంతి నీరు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది జీవక్రియను వేగవంతం చేస్తుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. 1 టీస్పూన్ మెంతి గింజలను రాత్రిపూట నానబెట్టి.. ఉదయం ఆ నీటిని వడకట్టి ఖాళీ కడుపుతో తాగాలి. మెరుగైన ఫలితాల కోసం మెంతి గింజలు కూడా తినవచ్చు. 

నిమ్మకాయ నీళ్లు

నిమ్మకాయ నీరు అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది బరువును తగ్గిస్తుంది. చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. యూరిక్ యాసిడ్‌ను నియంత్రిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. 1 నిమ్మకాయ రసం, కొద్దిగా తేనెను వేడి నీటిలో కలిపి ప్రతిరోజూ ఉదయం తాగితే.. రోజంతా మీరు యాక్టివ్​గా ఉంటారు. 

జీలకర్ర నీళ్లు

జీలకర్ర నీరు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. శ్వాసకోశ సమస్యలను కూడా దూరం చేస్తుంది. 1 టీస్పూన్ జీలకర్రను 2 కప్పుల నీటిలో మరిగించి.. ఆపై ఆ నీటిని వడకట్టి ఉదయం ఖాళీ కడుపుతో తాగాలి.

సోంపు నీళ్లు

సోంపు నీళ్లు రక్తంలో చక్కెరను కంట్రోల్ చేయడమే కాకుండా.. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. సోంపు నీటిలో వేసి 15 నిమిషాలు మరిగించి.. వడకట్టి తాగాల్సి ఉంటుంది. 

ఇవేకాకుండా వామ్ము, అల్లం వంటి హెర్బల్ డ్రింక్స్ కూడా ఆరోగ్యానికి మంచి ప్రయోజనాలు అందిస్తాయి. ఈ హెర్బల్ డ్రింక్స్ రెగ్యులర్​గా తీసుకుంటే కొన్ని వారాల్లోనే మంచి ఫలితాలు చూడవచ్చు. పైగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అయితే వీటిని తీసుకునే ముందు వైద్యుల సూచనలు కచ్చితంగా తీసుకోండి. అప్పుడే బెస్ట్ రిజల్ట్స్ మీ సొంతమవుతాయి.

గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mumbai Indians Major Record: ఓడినా రికార్డులు సృష్టించిన ముంబై ఇండియన్స్‌.. టీ20 చరిత్రలో తొలిసారి..
ఓడినా రికార్డులు సృష్టించిన ముంబై ఇండియన్స్‌.. టీ20 చరిత్రలో తొలిసారి..
Srisailam News: శ్రీశైలంలో ఇష్టకామేశ్వరి దేవి ఆలయ సందర్శన తాత్కాలికంగా నిలిపివేత
శ్రీశైలంలో ఇష్టకామేశ్వరి దేవి ఆలయ సందర్శన తాత్కాలికంగా నిలిపివేత
Chandrababu Naidu meets Pawan Kalyan: డిప్యూటీ సీఎంకు చంద్రబాబు పరామర్శ - ఆత్మీయ స్వాగతం పలికిన పవన్ దంపతులు
డిప్యూటీ సీఎంకు చంద్రబాబు పరామర్శ - ఆత్మీయ స్వాగతం పలికిన పవన్ దంపతులు
CM Revanth Reddy: వంద రోజుల్లో రిటైర్మెంట్ బకాయిలకు 6000 కోట్లు, జూన్ 1 లోగా హెల్త్ కార్డులు: రేవంత్ రెడ్డి
వంద రోజుల్లో రిటైర్మెంట్ బకాయిలకు 6000 కోట్లు, జూన్ 1 లోగా హెల్త్ కార్డులు: రేవంత్ రెడ్డి
Advertisement

వీడియోలు

RR vs DC IPL 2026 Highlights | ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ రికార్డ్ ఛేజ్
Kyle Jamieson vs Vaibhav IPL 2026 RR vd DC | జేమిసన్‌పై నెటిజన్ల ఫైర్.. అసలేం జరిగిందంటే ?
RS Ambarish in Sunrisers Hyderabad Team | SRH టీమ్ లోకి అండర్-19 వరల్డ్ కప్ హీరో
Riyan Parag talks about Smoking Controversy | విమర్శకులకు రియాన్ పరాగ్ ఘాటు వార్నింగ్
Starc vs Yashasvi Jaiswal IPL 2026 | 6 ఇన్నింగ్స్.. 4 సార్లు అవుట్ అయిన జైస్వాల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mumbai Indians Major Record: ఓడినా రికార్డులు సృష్టించిన ముంబై ఇండియన్స్‌.. టీ20 చరిత్రలో తొలిసారి..
ఓడినా రికార్డులు సృష్టించిన ముంబై ఇండియన్స్‌.. టీ20 చరిత్రలో తొలిసారి..
Srisailam News: శ్రీశైలంలో ఇష్టకామేశ్వరి దేవి ఆలయ సందర్శన తాత్కాలికంగా నిలిపివేత
శ్రీశైలంలో ఇష్టకామేశ్వరి దేవి ఆలయ సందర్శన తాత్కాలికంగా నిలిపివేత
Chandrababu Naidu meets Pawan Kalyan: డిప్యూటీ సీఎంకు చంద్రబాబు పరామర్శ - ఆత్మీయ స్వాగతం పలికిన పవన్ దంపతులు
డిప్యూటీ సీఎంకు చంద్రబాబు పరామర్శ - ఆత్మీయ స్వాగతం పలికిన పవన్ దంపతులు
CM Revanth Reddy: వంద రోజుల్లో రిటైర్మెంట్ బకాయిలకు 6000 కోట్లు, జూన్ 1 లోగా హెల్త్ కార్డులు: రేవంత్ రెడ్డి
వంద రోజుల్లో రిటైర్మెంట్ బకాయిలకు 6000 కోట్లు, జూన్ 1 లోగా హెల్త్ కార్డులు: రేవంత్ రెడ్డి
Vijayawada Crime News: కాలేజీలో విద్యార్థినికి లైంగిక వేధింపులు.. ప్రొఫెసర్‌, ల్యాబ్‌ టెక్నీషియన్‌పై వేటు
కాలేజీలో విద్యార్థినికి లైంగిక వేధింపులు.. ప్రొఫెసర్‌, ల్యాబ్‌ టెక్నీషియన్‌పై వేటు
Viral Video: సీజ్ ఫైర్ సమయంలో ఇరాన్‌లో పరిస్థితి ఎలా ఉంది? వీడియో చూసి నెటిజన్లు షాక్
సీజ్ ఫైర్ సమయంలో ఇరాన్‌లో పరిస్థితి ఎలా ఉంది? వీడియో చూసి నెటిజన్లు షాక్
Kavitha Meet the Press: కేసీఆర్‌ను వ్యక్తిగతంగా విమర్శించలేదు - రాజకీయంగానే - మీట్ ది ప్రెస్‌లో కవిత కీలక వ్యాఖ్యలు
కేసీఆర్‌ను వ్యక్తిగతంగా విమర్శించలేదు - రాజకీయంగానే - మీట్ ది ప్రెస్‌లో కవిత కీలక వ్యాఖ్యలు
CSK తరఫున IPL అరంగేట్రం చేసిన రామకృష్ణ ఘోష్.. అతడి బ్యాగ్రౌండ్ ఏంటీ ?
CSK తరఫున IPL అరంగేట్రం చేసిన రామకృష్ణ ఘోష్.. అతడి బ్యాగ్రౌండ్ ఏంటీ ?
Embed widget