అన్వేషించండి

Moringa Seeds : మునగ గింజలు 30 రోజులు తింటే శరీరంలో కలిగే మార్పులు ఇవే.. ఎలా తీసుకోవాలంటే

Moringa Seeds for a Month : మునగ ఆకులు, మునగ కాయలే కాదు.. మునగ గింజలు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయని అంటున్నారు. మరి ఈ మునగ గింజలను నెల రోజులు తింటే కలిగే లాభాలు ఏంటో చూసేద్దాం.  

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మునగ గింజల్లో పోషకాలు అధికం, క్రమం తప్పక తింటే మేలు.
  • విష పదార్థాలను తొలగించి, లివర్ పనితీరును మెరుగుపరుస్తాయి.
  • రక్తంలో చక్కెర, బీపీ స్థాయిలను నియంత్రణలో ఉంచుతాయి.
  • బరువు తగ్గడానికి, చర్మ-జుట్టు ఆరోగ్యానికి దోహదం చేస్తాయి.

Moringa Seeds Benefits : మునగ కాయలను సూపర్ ఫుడ్స్ అంటారు. మునగ ఆకులు కూడా ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఇస్తాయి. అయితే మునగ గింజలు కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తాయని నిపుణులు చెప్తున్నారు. వీటిని నెలరోజులు తీసుకుంటే శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయి? వీటిని ఎలా తీసుకుంటే మంచిది? సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో లేదో ఇప్పుడు చూసేద్దాం. 

ఎలా తీసుకోవాలంటే.. 

రోజుకు 2 నుంచి 3 గింజలు తీసుకోవచ్చు. దానిని 5 నుంచి 6 వరకు పెంచుకోవచ్చు. పొట్టు తీసేసి పచ్చిగా తినొచ్చు. లేదా వేయించి తీసుకోవచ్చు. పొడి చేసి స్మూతీస్, సూప్స్‌లో తీసుకోవచ్చు. ఉదయాన్నే ఖాళీ కడుపుతో లేదా భోజనం తర్వాత తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. 

మునగ గింజల్లోని పోషకాలు..

మునగ గింజలు చిన్నవే అయినా పోషకాలతో నిండి ఉంటాయి. వీటిలో విటమిన్ సి, కాల్షియం, ఐరన్, పొటాషియం, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఎమినో యాసిడ్స్, యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి శరీరానికి మంచి పోషకాలు అందిస్తాయి. అయితే వీటిని 30 రోజులు వరుసగా తింటే కలిగే లాభాలు ఏంటో చూసేద్దాం. 

డీటాక్స్ 

మునగలోని యాంటీబ్యాక్టీరియల్ గుణాలు శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపడంలో సహాయపడతాయి. దీనివల్ల లివర్ పనితీరు మెరుగుపడుతుంది. జీర్ణక్రియ బాగుంటుంది. మలబద్ధకం తగ్గుతుంది. 

షుగర్, బీపీ కంట్రోల్

మునగ గింజలు రక్తంలో గ్లూకోజ్ రిలీజ్‌ను చేస్తాయి. డయాబెటిస్ ఉన్నవారికి ఉపయోగకరం కావచ్చు. పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల రక్తనాళాలు రిలాక్స్ అవుతాయి. ఇది హై బీపీ నియంత్రణకు హెల్ప్ చేస్తుంది.

బరువు తగ్గేందుకు

మునగ గింజల్లో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల.. ఎక్కువసేపు ఆకలి అనిపించదు. మెటబాలిజం పెరుగుతుంది. ఇది బరువు తగ్గడానికి హెల్ప్ చేస్తుంది. 

చర్మం, జుట్టు ఆరోగ్యం

మునగలోని యాంటీఆక్సిడెంట్స్ వల్ల.. చర్మం క్లియర్‌గా ఉంటుంది. మొటిమలు తగ్గడంతో పాటు జుట్టు బలంగా పెరుగుతుంది. 

లైంగిక ఆరోగ్యం

పురాతన వైద్యంలో మునగను సహజ ఆఫ్రొడిసియాక్‌గా ఉపయోగించేవారు. దీనివల్ల రక్త ప్రసరణ, హార్మోన్ బ్యాలెన్స్ మెరుగుపడి స్టామినా పెరుగుతుంది.

సైడ్ ఎఫెక్ట్స్ కూడా

మునగ గింజలు ఎక్కువగా తీసుకుంటే కూడా కొన్ని సమస్యలు రావచ్చు. వాంతులు, డయేరియా, పొట్ట ఉబ్బరం, లివర్‌పై ఒత్తిడి పడడంతో పాటు.. బీపీ లేదా షుగర్ చాలా తగ్గిపోవడం జరగవచ్చు. గర్భిణీలు కూడా తీసుకోకపోవడమే మంచిది. కానీ వీటిని డైట్లో చేర్చుకునే ముందు కచ్చితంగా వైద్యుల సూచనలు తీసుకోవడం మంచిది. 

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Wall Cleaning Tips: గోడలపై జిడ్డు మరకలు పడ్డాయా? మీ ఇంట్లో ఉండే 3 వస్తువులతో నిమిషాల్లో శుభ్రం చేసే చిట్కా! 
గోడలపై జిడ్డు మరకలు పడ్డాయా? మీ ఇంట్లో ఉండే 3 వస్తువులతో నిమిషాల్లో శుభ్రం చేసే చిట్కా! 
పాములు పాలు తాగవు కదా, మరి ఈ సామెత ఎందుకు పుట్టింది? శాస్త్రీయ వాస్తవాలు తెలుసుకోండి!
పాములు పాలు తాగవు కదా, మరి ఈ సామెత ఎందుకు పుట్టింది? శాస్త్రీయ వాస్తవాలు తెలుసుకోండి!
Testosterone Screening After 30: టెస్టోస్టెరాన్‌ ప్రభావం 30 ఏళ్ల తర్వాత తగ్గుతుందా? అమెరికా ఆర్మీ సైనికులకు ఎందుకు స్క్రీనింగ్ పరీక్షలు చేస్తోంది?
టెస్టోస్టెరాన్‌ ప్రభావం 30 ఏళ్ల తర్వాత తగ్గుతుందా? అమెరికా ఆర్మీ సైనికులకు ఎందుకు స్క్రీనింగ్ పరీక్షలు చేస్తోంది?
WHO Global Cancer Report 2026:ప్రతి ఐదుగురిలో ఒకరికి క్యాన్సర్‌ ముప్పు! ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన రిపోర్ట్‌!
ప్రతి ఐదుగురిలో ఒకరికి క్యాన్సర్‌ ముప్పు! ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన రిపోర్ట్‌!

వీడియోలు

PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Shreyas Iyer about IND vs ZIM T20 | జింబాబ్వేపై గెలుపుపై శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
India vs Zimbabwe 1st T20 Highlights | జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Karthika Deepam Tejaswini Prakash as Malini | తెలుగు బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న మాలిని

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP TET 2026 Hall Tickets Download:ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
AP Govt Employees PRC IR Demands: ఏపీలో ఉద్యోగుల పీఆర్‌సీ రాజకీయం - చంద్రబాబు మార్క్ ఐఆర్ వ్యూహం.. ఆశల్లో ఉద్యోగ లోకం!
ఏపీలో ఉద్యోగుల పీఆర్‌సీ రాజకీయం - చంద్రబాబు మార్క్ ఐఆర్ వ్యూహం.. ఆశల్లో ఉద్యోగ లోకం!
Thanuja Puttaswamy: మాకు లేని బాధ మీకెందుకు? - ట్రోలర్స్‌పై తనూజ ఫైర్... పవన్ సాయి వర్సెస్ ముద్ద మందారం - అసలు ఏమైందంటే?
మాకు లేని బాధ మీకెందుకు? - ట్రోలర్స్‌పై తనూజ ఫైర్... పవన్ సాయి వర్సెస్ ముద్ద మందారం - అసలు ఏమైందంటే?
మీ చిన్నారులకు విష్ణుమూర్తి పేరు పెట్టండి! అందమైన అర్థవంతమైన పేర్లు ఇక్కడున్నాయి!
మీ చిన్నారులకు విష్ణుమూర్తి పేరు పెట్టండి! అందమైన అర్థవంతమైన పేర్లు ఇక్కడున్నాయి!
Naga Chaitanya Sobhita: పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైమ్ వంట చేసింది... శోభితను నాగ చైతన్య ట్రోల్ చేశాడా?
పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైమ్ వంట చేసింది... శోభితను నాగ చైతన్య ట్రోల్ చేశాడా?
Jhandu Kumar In Commonwealth Games: కూరగాయలు అమ్మాడు, రిక్షా నడిపాడు, ఇప్పుడు కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు తొలి పతకాన్ని తీసుకొచ్చాడు!
కూరగాయలు అమ్మాడు, రిక్షా నడిపాడు, ఇప్పుడు కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు తొలి పతకాన్ని తీసుకొచ్చాడు!
Prime Minister Modi:
"రీల్స్ చేయండి, ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉండండి" కేబినెట్ మంత్రులకు మరోసారి ప్రధాని మోదీ సలహా 
Modi video:
"స్పందించి సలహాలు ఇచ్చిన వారికి ధన్యవాదాలు" మరో సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన ప్రధానమంత్రి
Embed widget