Daily Shower in Summer : వేసవిలో స్నానం చేయడం మానేయకండి.. రోజూ చల్లటి నీటితో ఉదయం, సాయంత్రం చేస్తే కలిగే లాభాలివే
Daily Shower in Summer : బద్ధకంతోనో లేదా ఇతర కారణాలతోనో కొందరు స్నానం చేయడం మానేస్తారు. సమ్మర్లో ఇలా స్నానం చేయకుండా ఉంటే ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అవేంటంటే..

- వేసవిలో స్నానం చర్మం శుభ్రతకు, ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
- రోజూ స్నానం చేయడం వల్ల చెమట, బ్యాక్టీరియా, దుర్వాసన తగ్గుతాయి.
- శరీర ఉష్ణోగ్రత నియంత్రణతో పాటు మనసుకు తాజాదనాన్ని ఇస్తుంది.
- చర్మ సమస్యలు, ఒత్తిడి తగ్గి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
Skipping a Bath in Summer : వేసవికాలంలో వేడి వల్ల చెమట ఎక్కువగా వస్తుంది. దీనివల్ల శరీరం త్వరగా అలసిపోతుంది. ఇలాంటి సమయంలో కచ్చితంగా రోజూ స్నానం చేయాలని అంటున్నారు నిపుణులు. వేసవిలో స్నానం కేవలం పరిశుభ్రత కోసమే కాదని.. ఆరోగ్యానికి కూడా చాలా అవసరం అని అంటున్నారు. చల్లని నీటితో స్నానం చేయడం వల్ల శరీరం కూల్‌గా ఉండటమే కాకుండా.. మానసికంగా కూడా రిలీఫ్ లభిస్తుందని అంటున్నారు. మరి వేసవిలో రోజూ స్నానం చేయడం వల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసుకుందాం.
చర్మ ఆరోగ్యానికై..
రోజూ స్నానం చేయడం వల్ల చర్మంపై ఉండే దుమ్ము, మురికి తొలగిపోతాయి. చెమట వల్ల జిడ్డుగా మారిన చర్మం క్లియర్ అవుతుంది. లేకుంటే జిడ్డు, డస్ట్ కలిసి.. పోర్స్‌ను బ్లాక్ చేసి మొటిమలు పెరిగేలా చేస్తాయి. కాబట్టి స్కిన్ క్లియర్‌గా ఉండేందుకు స్నానం చేయడం ముఖ్యం.
చెమట, బ్యాక్టీరియా దూరం..
వేసవిలో ఎక్కువగా చెమట పడుతుంది. దీనివల్ల బ్యాక్టీరియా పెరిగి దుర్వాసన, ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. రోజూ స్నానం చేయడం వల్ల ఇవి తగ్గుతాయి. అంతేకాకుండా శరీరం నుంచి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది.
శరీర ఉష్ణోగ్రత
వేసవిలో స్నానం చేయడం వల్ల బాడీ టెంపరేచర్ బ్యాలెన్స్ అవుతుంది. ఇది వేడి నుంచి ఉపశమనం ఇస్తూ.. కూల్‌గా ఫీల్ అయ్యేందుకు సహాయం చేస్తుంది.
తాజా అనుభూతి..
రోజూ స్నానం చేస్తే శరీరం మాత్రమే కాదు.. మనసు కూడా ఫ్రెష్గా మారుతుంది. ఇది పనిపై ఫోకస్ చేయడంలో, ప్రొడక్టివిటీ పెంచడంలో సహాయపడుతుంది.
చర్మ సమస్యలు
వేసవిలో హీట్ రాషెస్, రెడ్‌నెస్, ప్రిక్లీ హీట్ వంటి సమస్యలు రావడం సహజం. రోజూ స్నానం చేయడం వల్ల ఇవి రాకుండా నివారించవచ్చు.
మానసిక ఆరోగ్యం
స్నానం చేయడం వల్ల స్ట్రెస్, ఆందోళన తగ్గుతాయి. చికాకు దూరమవుతుంది. రోజంతా రిఫ్రెష్‌గా, రిలాక్స్‌గా ఉండేందుకు ఇది మంచి అలవాటు.
కాబట్టి వేసవిలో రోజుకు ఒకసారి కాదు.. కుదిరితే రెండు సార్లు స్నానం చేయడం మంచిదని చెప్తున్నారు నిపుణులు. ఇంటి నుంచి బయటకు వెళ్లినప్పుడు.. అలాగే బయటి నుంచి ఇంటికి వచ్చినప్పుడు చేయడం వల్ల హెల్తీగా, ఫ్రెష్గా ఉండగలుగుతారు. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా.. దుర్వాసనతో పాటు చర్మ సమస్యలు పెరిగి.. ఇబ్బంది పడాల్సి వస్తుంది.
గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు























