అన్వేషించండి

Independence Day Speech : స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి

Independence Day 2026 Speech Tips : స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో గెలవాలి అనుకుంటున్నారా? అయితే మీ స్పీచ్​లో ఈ మార్పులు చేయండి. అలాగే ఈ టిప్స్ ఫాలో అయితే కచ్చితంగా మీరు ప్రత్యేక స్థానంలో నిలుస్తారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • సమయపాలన పాటిస్తూ, ఆకర్షణీయ ప్రారంభంతో ప్రసంగం సిద్ధం చేయాలి.
  • స్వాతంత్ర్య విలువ, బాధ్యతలతో పాటు స్థానిక చరిత్రను వివరించాలి.
  • స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు, వారి గుణపాఠాలను ప్రస్తావించాలి.
  • వేదికపై ఆత్మవిశ్వాసంతో, బలమైన ముగింపును అందించడం ముఖ్యం.

Independence Day Speech in Telugu : ఆగస్టు 15 వచ్చిందంటే పాఠశాలల్లో సందడి మొదలవుతుంది. జెండా ఆవిష్కరణ, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ప్రసంగ పోటీలు కూడా నిర్వహిస్తారు. వేదికపైకి వెళ్లి అందరి దృష్టిని ఆకర్షించేలా మాట్లాడాలని ప్రతి విద్యార్థి కోరుకుంటాడు. అయితే మంచి ప్రసంగం అంటే కేవలం స్వాతంత్ర్య సమరయోధుల పేర్లు, చరిత్రను కంఠస్థం చేసి అప్పగించడం కాదు. ఏం మాట్లాడాలి? ఎలా ప్రారంభించాలి? ఎంతసేపు మాట్లాడాలి? ఎక్కడ గొంతు పెంచాలి? ఎక్కడ భావోద్వేగాన్ని చూపించాలి? అనే విషయాలు కూడా చాలా ముఖ్యం.

ఈసారి స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండిదినోత్సవం 2026 సందర్భంగా.. మీరు కూడా స్కూల్లో స్పీచ్ ఇవ్వాలనుకుంటే కొన్ని చిట్కాలు ఫాలో అవ్వండి. ఇవి మిమ్మల్ని, మీ స్పీచ్​ను ప్రత్యేకస్థానంలో ఉంచడంలో హెల్ప్ చేస్తాయి. అవేంటో చూసేద్దాం.

సమయాన్ని దృష్టిలో పెట్టుకోండి..

ప్రసంగ పోటీలో మొదట గుర్తుంచుకోవాల్సిన విషయం సమయం. మీకు రెండు నిమిషాలు మాత్రమే ఇచ్చి ఉంటే.. ఐదు నిమిషాల ప్రసంగాన్ని సిద్ధం చేసుకుని మధ్యలో ఆపేయడం సరైన పద్ధతి కాదు. ఇచ్చిన సమయానికి అనుగుణంగా ప్రసంగాన్ని ముందుగానే సిద్ధం చేసుకోవాలి.

Also Read : మన జెండా ముందు కూడా ఇలాగే ఉండేదా? స్వాతంత్య్రానికి ముందు త్రివర్ణ పతాకం ఎలా ఉండేదంటే

2 నిమిషాల ప్రసంగం అయితే..

మొదటి 20–30 సెకన్లలో ఆసక్తికరమైన ప్రారంభం ఉండేలా చూసుకోవాలి. ఆ తర్వాత మీ ప్రధాన విషయాన్ని సూటిగా చెప్పాలి. చివర్లో 15–20 సెకన్లలో బలమైన సందేశంతో ముగించేలా స్క్రిప్ట్ రెడీ చేసుకోవాలి.

5 నిమిషాల ప్రసంగం అయితే..

ప్రారంభం, ప్రధాన అంశం, ముగింపు అంటూ ప్రసంగాన్ని మూడు భాగాలుగా డివైడ్ చేసుకోండి. స్వాతంత్ర్య పోరాటానికి సంబంధించిన ఒక చారిత్రక సంఘటన, స్వాతంత్ర్య సమరయోధుడి త్యాగం లేదా నేటి యువత బాధ్యత గురించి చిన్న ఉదాహరణను మీ స్పీచ్​లో చేర్చుకోవచ్చు. ఎంత సమయం ఇచ్చినా.. అవసరానికి మించి విషయాలను నింపకండి. చిన్నదైనా స్పష్టంగా, గుర్తుండిపోయేలా ఉండే ప్రసంగమే మంచి ఎఫెక్టివ్గా ఉంటుంది. 

ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాలి..

ప్రసంగంలో మొదటి కొన్ని సెకన్లు చాలా కీలకం. ‘అందరికీ నమస్కారం.. ఈరోజు నేను స్వాతంత్ర్య దినోత్సవం గురించి మాట్లాడబోతున్నాను’ అంటూ సాధారణంగా ప్రారంభిస్తే ప్రేక్షకుల ఆసక్తి వెంటనే పెరగకపోవచ్చు. దానికి బదులుగా మీకు ఒక ప్రశ్న లేదా చిన్న సంఘటన గురించి ప్రస్తావిస్తూ.. దేశభక్తి భావాన్ని కలిగించే వాక్యం లేదా ఆలోచింపజేసే మాటతో స్టార్ట్ చేస్తే మంచిది.

Also Read : స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు బెస్ట్ మేకప్ లుక్స్.. త్రివర్ణ రంగులతో దేశభక్తిని చాటండిలా

చరిత్ర ఒక్కటే చెప్పకండి..

స్వాతంత్య్ర దినోత్సవం అంటే 1947 ఆగస్టు 15న భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చిన విషయాన్ని చెప్పడం మాత్రమే కాదు. ఆ స్వాతంత్ర్యం మనకు ఎందుకు వచ్చింది? దాని విలువ ఏంటి? ఇప్పుడు మన బాధ్యత ఏమిటి? అనే విషయాలు మీ స్పీచ్​లో ఉండేలా చూసుకోవాలి. 
మహాత్మా గాంధీ, భగత్‌సింగ్, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు వంటి స్వాతంత్ర్య సమరయోధుల గురించి ప్రస్తావించవచ్చు. అయితే వారి పేర్లను వరుసగా చెప్పడం కంటే.. వారి చేసిన త్యాగం నుంచి నేటి విద్యార్థులు నేర్చుకోవాల్సిన విషయం ఏమిటో చెప్పడం మరింత ప్రభావవంతంగా ఉంటుంది.

మీ ప్రాంతానికి రిలేట్ అయ్యేలా..

తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులు ప్రసంగిస్తున్నప్పుడు స్థానిక చరిత్రకు సంబంధించిన అంశాలను చేర్చడం మంచి ప్రభావాన్ని చూపుతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లో స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న నాయకులు, స్థానిక పోరాటాలు లేదా స్వాతంత్ర్య సమరయోధుల గురించి సందర్భానుసారం ప్రస్తావించవచ్చు. ఇలా చేస్తే ప్రసంగం కేవలం పుస్తకంలో చదివిన విషయంలా కాకుండా.. మన నేల, మన చరిత్రకు సంబంధించిన విషయంలా అనిపిస్తుంది.

స్టేజ్ ఫియర్ ఇలా దూరం చేసుకోండి

చాలామంది విద్యార్థులు ప్రసంగం బాగా సిద్ధం చేసుకుంటారు. కానీ వేదికపైకి వెళ్లగానే భయపడతారు. దీనికి ప్రధాన కారణం ప్రాక్టీస్ లేకపోవడం. ప్రసంగాన్ని ఇంట్లో ఒకసారి చదివితే సరిపోదు. అద్దం ముందు నిలబడి మాట్లాడండి. ఆ తర్వాత కుటుంబ సభ్యులు లేదా స్నేహితుల ముందు చెప్పండి. వీలైతే మొబైల్‌లో మీ ప్రసంగాన్ని రికార్డు చేసి వినండి. ఎక్కడ వేగంగా మాట్లాడుతున్నారో.. ఎక్కడ ఆగాలో, ఎక్కడ గొంతు పెంచాలో గుర్తించండి.

ప్రసంగాన్ని పదేపదే కంఠస్థం చేయడానికి ప్రయత్నించకండి. ఒక్క పదం మర్చిపోతే మొత్తం ప్రసంగం ఆగిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ప్రధాన పాయింట్లను గుర్తుపెట్టుకుని.. మీ మాటల్లో చెప్పడం నేర్చుకోండి.

Also Read : స్వాతంత్య్ర దినోత్సవం స్పెషల్ ట్రెడీషనల్ డ్రెస్​లు.. ఇన్​స్టాలో పోస్ట్ చేసేందుకు ఈ లుక్స్ బెస్ట్

నేలవైపు చూడకండి..

ప్రసంగం చేస్తున్నప్పుడు మొత్తం సమయం నేలవైపు చూస్తూ మాట్లాడటం ఆత్మవిశ్వాసం లేనట్టుగా కనిపిస్తుంది. అదే సమయంలో ఒకే వ్యక్తి లేదా న్యాయనిర్ణేతలను మాత్రమే చూస్తూ ఉండటం కూడా సహజంగా అనిపించదు. కాబట్టి హాల్లోని వివిధ ప్రాంతాల వైపు మీ చూపును మెల్లగా తిప్పుతూ మాట్లాడండి. దీంతో మీరు అందరితో మాట్లాడుతున్న అనుభూతి ప్రేక్షకులకు కలుగుతుంది.

బాడీ లాంగ్వేజ్‌ను మర్చిపోవద్దు

వేదికపై నిటారుగా నిలబడండి. భుజాలు వంచి నిలబడటం, పదేపదే కాళ్లు కదపడం, మైక్‌ను గట్టిగా పట్టుకోవడం వంటి అలవాట్లను తగ్గించండి. అవసరమైన చోట చేతితో సంజ్ఞలు చేయవచ్చు. కానీ అతిగా చేతులు ఊపడం లేదా నిరంతరం కదులుతూ ఉండటం ప్రసంగం కంటే ఎక్కువగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంది.

ప్రసంగం చివర కూడా మొదటిలాగానే స్ట్రాంగ్​గా ఉండాలి. స్వాతంత్ర్యం మనకు వారసత్వంగా వచ్చింది.. కానీ దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయులను గుర్తు చేసుకోవడం మాత్రమే కాదు.. వారు కలలుగన్న భారతదేశాన్ని నిర్మించడంలో మన వంతు బాధ్యతను నిర్వర్తిద్దాం. జైహింద్ అంటూ స్ట్రాంగ్​గా ముగించవచ్చు. 

Also Read : స్వాతంత్య్ర దినోత్సవం స్పెషల్.. ఇండియాలో స్వతంత్య్ర పోరాటానికి సాక్ష్యంగా నిలిచిన చారిత్రక ప్రదేశాలివే

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Independence Day Speech : స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి
స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి
Habits To Quit Before 40 : 40 ఏళ్లు వచ్చేలోపు మానేయాల్సిన 7 అలవాట్లు.. లేదంటే ఆరోగ్యంపై ఈ ప్రభావాలు తప్పవు
40 ఏళ్లు వచ్చేలోపు మానేయాల్సిన 7 అలవాట్లు.. లేదంటే ఆరోగ్యంపై ఈ ప్రభావాలు తప్పవు
Independence Day 2026 : స్వాతంత్య్ర దినోత్సవం 2026 చరిత్ర, ప్రాముఖ్యత.. ఆగస్టు 15నే ఎందుకు జరుపుకుంటామంటే
స్వాతంత్య్ర దినోత్సవం 2026 చరిత్ర, ప్రాముఖ్యత.. ఆగస్టు 15నే ఎందుకు జరుపుకుంటామంటే
Korean Beauty Secrets : కొరియన్ గ్లాస్ స్కిన్ వెనుక సీక్రెట్ ఇదే.. రోజూ ఫాలో అవ్వగలిగే స్కిన్‌కేర్ టిప్స్ ఇవే
కొరియన్ గ్లాస్ స్కిన్ వెనుక సీక్రెట్ ఇదే.. రోజూ ఫాలో అవ్వగలిగే స్కిన్‌కేర్ టిప్స్ ఇవే
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
AP Group 1 SIT Report: డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
జెన్ Z...సోషల్ మీడియా లైక్‌, షేర్ అనే ఉచ్చులో చిక్కుకున్నారా? బయటపడాలంటే ఇది తెలుసుకోండి!
జెన్ Z...సోషల్ మీడియా లైక్‌, షేర్ అనే ఉచ్చులో చిక్కుకున్నారా? బయటపడాలంటే ఇది తెలుసుకోండి!
Friday OTT Movies : ఓటీటీలో ఒక్క రోజే 14 సినిమాలు - ఫ్రైడే ఓటీటీ మూవీస్ లిస్ట్... ఈ సినిమాలు డోంట్ మిస్
ఓటీటీలో ఒక్క రోజే 14 సినిమాలు - ఫ్రైడే ఓటీటీ మూవీస్ లిస్ట్... ఈ సినిమాలు డోంట్ మిస్
CJI-NALSAR వివాదం: బార్ కౌన్సిల్ బ్యాన్ నిర్ణయం వెనక్కి, మనన్ మిశ్రాకు వ్యతిరేకంగా నిరసన తప్పదా?
CJI-NALSAR వివాదం: బార్ కౌన్సిల్ బ్యాన్ నిర్ణయం వెనక్కి, మనన్ మిశ్రాకు వ్యతిరేకంగా నిరసన తప్పదా?
YS Jagan Kurnool Tour: జగన్‌ చేస్తున్న ఆరోపణలు తోసిపుచ్చిన అధికారులు- అవమానించలేదని వివరణ!
జగన్‌ చేస్తున్న ఆరోపణలు తోసిపుచ్చిన అధికారులు- అవమానించలేదని వివరణ!
Embed widget