అన్వేషించండి

Republic Day : స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం మధ్య వ్యత్యాసాలివే.. జెండా నియమాల్లో ఈ తేడాలు గుర్తించారా?

Flag Hoisting Traditions : దేశవ్యాప్తంగా ఆగస్టు 15, జనవరి 26 తేదీలలో జాతీయ జెండాను ఎగురవేస్తారు. అయితే ఈ రెండు సందర్భాలలోనూ జెండాను ఎగురవేయడానికి నియమాలు భిన్నంగా ఉంటాయి. అవేంటో ఇప్పుడు చూసేద్దాం. 

August 15 or January 26 Flag Ceremony : దేశవ్యాప్తంగా ఆగస్టు 15 (స్వాతంత్య్ర దినోత్సవం), జనవరి 26 (గణతంత్ర దినోత్సవం) తేదీలలో జాతీయ జెండాను ఎగురవేస్తారు. అయితే ఈ రెండు సందర్భాలలోనూ జెండాను ఎగురవేసే నియమాలు భిన్నంగా ఉంటాయి. ఈ వ్యత్యాసమే భారతదేశ స్వాతంత్ర్య, దాని రాజ్యాంగ కథను చెబుతుంది. ఇంతకీ జెండా ఎగురవేసే విధానంలోని నియమాలు ఏంటో చూసేద్దాం.

2026 లో ఇండియా తన 77వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది. రాజధాని ఢిల్లీలోని జాతీయ రహదారి వద్ద జరగనున్న గ్రాండ్ పరేడ్ కోసం సన్నాహాలు చివరి దశకు వచ్చేశాయి. జనవరి 26వ తేదీన దేశ రాష్ట్రపతి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడంతో ఈవెంట్ ప్రారంభమవుతుంది. ఆగస్టు 15, జనవరి 26 తేదీలలో దేశవ్యాప్తంగా జాతీయ జెండాను ఎగురవేస్తారు. అయితే ఈ రెండు సందర్భాలలో జెండాను ఎగురవేయడానికి కొన్ని నియమాలు భిన్నంగా ఉంటాయి. అవేంటంటే..

స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవం ప్రాముఖ్యత

ఆగస్టు 15, జనవరి 26 తేదీలు భారతదేశ చరిత్రలో ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. ఆగస్టు 15, 1947న దేశం బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్ర్యం పొందిన రోజు. ఈ రోజును భారతదేశం బ్రిటిష్ వారి పరిపాలనుంచి నుంచి స్వాతంత్ర్యం పొందింది. జనవరి 26, 1950న భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది. దీంతో భారతదేశం గణతంత్ర రాజ్యంగా మారింది. అందువల్ల ప్రతి సంవత్సరం జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటారు.

జెండా ఎగురవేడంలో వ్యత్యాసాలు ఇవే

చాలా మంది ఈ రెండు రోజులూ కూడా ఒకే విధంగా జెండా ఎగురవేస్తారని నమ్ముతారు. కానీ అది నిజం కాదు. ఆగస్టు 15న అనుసరించే జెండా ఎగురవేసే ప్రక్రియ భిన్నంగా ఉంటుంది. దీనిలో త్రివర్ణ పతాకాన్ని జెండా స్తంభం కింది నుంచి తాడుతో పైకి లేపి.. ఆపై హుక్‌ను విప్పుతారు. ఇది బ్రిటిష్ జెండాను కిందకి దించి.. భారత త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడాన్ని సూచిస్తుంది.

గణతంత్ర దినోత్సవం రోజు జెండా ఎలా ఎగురేస్తారంటే..

గణతంత్ర దినోత్సవం నాడు జెండాను ఎగురవేయరు. ఆవిష్కరిస్తారు. దీనిని జెండా ఆవిష్కరణ అంటారు. ఈ రోజున త్రివర్ణ పతాకాన్ని జెండా స్తంభం పైభాగానికి కట్టి ఉంచుతారు. తాడును లాగడం ద్వారా జెండా విచ్చుకుంటుంది. ఇది భారత రాజ్యాంగాన్ని స్వీకరించడాన్ని, కొత్త రాజ్యాంగ యుగం ప్రారంభాన్ని సూచిస్తుంది.

ఆగస్టు 15న దేశ ప్రధానమంత్రి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తారు. ఎందుకంటే 1947లో స్వాతంత్ర్యం వచ్చే సమయానికి భారత రాజ్యాంగం అమలు కాలేదు. రాష్ట్రపతి పదవి ఉనికిలో లేదు. ఆ సమయంలో ప్రధానమంత్రి దేశ పరిపాలనా అధిపతి. జనవరి 26వ తేదీన.. దేశ రాష్ట్రపతి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తారు. ఎందుకంటే రాష్ట్రపతి భారతదేశ రాజ్యాంగ అధిపతి. ఈ రోజున భారతదేశ మొదటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ప్రమాణ స్వీకారం చేశారు.

 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Monsoon Mold : ఇంట్లో పెరిగే బూజుతో జాగ్రత్త, ముఖ్యంగా వర్షాకాలంలో.. ఊపిరితిత్తులపై ప్రభావం చూపొచ్చంటున్న వైద్యులు
ఇంట్లో పెరిగే బూజుతో జాగ్రత్త, ముఖ్యంగా వర్షాకాలంలో.. ఊపిరితిత్తులపై ప్రభావం చూపొచ్చంటున్న వైద్యులు
Fenugreek Growing Tips : ఇంట్లోనే మెంతి కూర చాలా ఈజీగా పెంచుకోవచ్చు తెలుసా? చిన్న కుండీలో పెంచగలిగే టిప్స్ ఇవే
ఇంట్లోనే మెంతి కూర చాలా ఈజీగా పెంచుకోవచ్చు తెలుసా? చిన్న కుండీలో పెంచగలిగే టిప్స్ ఇవే
Tips To Control Diabetes : మధుమేహాన్ని డైట్​తోనే కాదు.. ఈ 3 మార్పులతో బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయండి
మధుమేహాన్ని డైట్​తోనే కాదు.. ఈ 3 మార్పులతో బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయండి
Castor Oil for Hair : ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి
ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Donald Trump: అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Hyderabad Traffic Diversion: నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Embed widget