అన్వేషించండి

Independence Day 2026 : స్వాతంత్య్ర దినోత్సవం 2026 చరిత్ర, ప్రాముఖ్యత.. ఆగస్టు 15నే ఎందుకు జరుపుకుంటామంటే

Independence Day : స్వాతంత్య్ర దినోత్సవం చరిత్ర, ప్రాముఖ్యత, వాస్తవాలు గురించిన చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు అందరికీ తెలియవు. మీరు కూడా అలాంటివారిలో ఒకరు అయితే ఇది మీకోసమే..

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • భారతదేశం 2026లో 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోనుంది.
  • గాంధీ, బోస్ వంటి నాయకుల పోరాటాలు స్వాతంత్ర్యం తెచ్చాయి.
  • 1947 భారత స్వాతంత్య్ర చట్టం ఆగస్టు 15న అమలులోకి వచ్చింది.
  • ప్రధాని ఎర్రకోటపై జెండా ఎగురవేసి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు.

Happy Independence Day 2026 : బ్రిటీష్ పాలన నుంచి 1947లో భారతదేశానికి స్వాతంత్య్ర వచ్చి 79 సంవత్సరాలు పూర్తైంది. ఈ ఏడాది 2026 ఆగస్టు 15తో భారతదేశం తన 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోనుంది. ప్రతి సంవత్సరం భారతదేశ స్వాతంత్య్ర పోరాటాన్ని స్మరించుకుంటూ.. దేశం స్వయం పరిపాలన దిశగా సాగించిన ప్రయాణానికి దోహదపడిన వారిని గౌరవిస్తారు. జాతీయ పతాకం ఎగురవేయడం నుంచి దేశభక్తి కార్యక్రమాలు, ఎర్రకోట నుంచి ప్రధానమంత్రి ప్రసంగం వరకు.. ఎన్నో ఈవెంట్స్ నిర్వహిస్తారు.

భారతదేశ స్వాతంత్య్ర చరిత్ర

భారతదేశ స్వాతంత్య్ర ఉద్యమం.. ఒకేసారి కాకుండా అనేక విధాలుగా అభివృద్ధి చెందింది. దేశవ్యాప్తంగా బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా వివిధ రూపాల్లో ప్రతిఘటనలు చేశారు. 1885లో స్థాపించిన భారత జాతీయ కాంగ్రెస్, స్వయం పరిపాలన కోసం జరిగిన రాజకీయ ఉద్యమానికి ఒక ముఖ్యమైన వేదికగా మారింది. మహాత్మా గాంధీ నాయకత్వంలో.. సహాయ నిరాకరణ ఉద్యమం, శాసనోల్లంఘన ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమం వంటి పోరాటాల ద్వారా ప్రజల్లో స్వాతంత్ర్య ఉద్యమం ఊపందుకుంది. 

Also Read : స్వాతంత్య్ర దినోత్సవం స్పెషల్.. ఇండియాలో స్వతంత్య్ర పోరాటానికి సాక్ష్యంగా నిలిచిన చారిత్రక ప్రదేశాలివే

దశాబ్ధాల పోరాటం..

1942లో ప్రారంభమైన క్విట్ ఇండియా ఉద్యమం “డూ ఆర్ డై” అనే నినాదంతో.. స్వాతంత్య్ర కోసం ఒక కీలకమైన పిలుపుగా నిలిచింది. గాంధీ అహింసా ఉద్యమంతో పాటు.. విప్లవవాద బృందాలు, నాయకులు కూడా ముఖ్యమైన పాత్రలు పోషించారు. సుభాష్ చంద్రబోస్, భారత జాతీయ సైన్యం బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన ప్రతిఘటనకు ప్రముఖ చిహ్నాలుగా నిలిచారు. దీంతో రెండవ ప్రపంచ యుద్ధం తరువాత భారతదేశాన్ని పరిపాలించే బ్రిటన్ సామర్థ్యం బలహీనపడింది. భారత నాయకులు, బ్రిటిష్ ప్రభుత్వం మధ్య జరిగిన రాజకీయ చర్చలు చివరికి అధికారాన్ని బదిలీ చేయాలనే నిర్ణయానికి దారితీశాయి.

బ్రిటిష్ పార్లమెంట్ ఆమోదించిన 1947 భారత స్వాతంత్య్ర చట్టం.. భారతదేశం, పాకిస్తాన్ అనే స్వతంత్ర రాజ్యాలను సృష్టించింది. ఈ చట్టం 1947 ఆగస్టు 15న అమల్లోకి వచ్చింది. భారతదేశపు చివరి వైస్రాయ్ అయిన లార్డ్ లూయిస్ మౌంట్‌బాటన్ ఈ తేదీని ఎంపిక చేశారు. 1945లో మిత్రరాజ్యాలకు జపాన్ లొంగిపోయిన రెండవ వార్షికోత్సవం కావడంతో.. అంటే రెండవ ప్రపంచ యుద్ధం ముగింపుతో ముడిపడి ఉన్న సంఘటన కారణంగా.. మౌంట్‌బాటన్ ఆగస్టు 15వ తేదీని ఎంచుకున్నారని చెప్తారు. 

Also Read : స్వాతంత్య్ర దినోత్సవం 2025 శుభాకాంక్షలు.. ఇన్​స్టా, వాట్సాప్​, ఫేస్​బుక్​లలో విషెష్ ఇలా చెప్పేయండి

స్వాతంత్య్ర దినోత్సవ ప్రాముఖ్యత 

భారతదేశపు మొదటి స్వాతంత్య్ర దినోత్సవాన్ని న్యూఢిల్లీలో వివిధ వేడుకలతో జరిపారు. ఆ వేడుకల్లోనే జవహర్‌లాల్ నెహ్రూ దేశానికి మొదటి ప్రధానమంత్రి అయ్యారు. 1947 ఆగస్టు 15వ తేదీ తెల్లవారుజామున నెహ్రూ "ట్రైస్ట్ విత్ డెస్టినీ" ప్రసంగాన్ని అందించారు. అప్పటినుంచి ప్రధాన జాతీయ వేడుక న్యూఢిల్లీలోని ఎర్రకోటలోనే జరుగుతుంది. అక్కడ ప్రధానమంత్రి జాతీయ జెండాను ఆవిష్కరించి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ వేడుక అనంతరం దేశవ్యాప్తంగా సాంస్కృతిక కార్యక్రమాలు, సంబరాలు జరుగుతాయి.

Also Read : స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం మధ్య వ్యత్యాసాలివే.. జెండా నియమాల్లో ఈ తేడాలు గుర్తించారా?

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Independence Day 2026 : స్వాతంత్య్ర దినోత్సవం 2026 చరిత్ర, ప్రాముఖ్యత.. ఆగస్టు 15నే ఎందుకు జరుపుకుంటామంటే
స్వాతంత్య్ర దినోత్సవం 2026 చరిత్ర, ప్రాముఖ్యత.. ఆగస్టు 15నే ఎందుకు జరుపుకుంటామంటే
Korean Beauty Secrets : కొరియన్ గ్లాస్ స్కిన్ వెనుక సీక్రెట్ ఇదే.. రోజూ ఫాలో అవ్వగలిగే స్కిన్‌కేర్ టిప్స్ ఇవే
కొరియన్ గ్లాస్ స్కిన్ వెనుక సీక్రెట్ ఇదే.. రోజూ ఫాలో అవ్వగలిగే స్కిన్‌కేర్ టిప్స్ ఇవే
White Sneakers Cleaning Tips : తెల్లటి షూస్ మురికిగా మారాయా? ఇంట్లోనే శుభ్రం చేసేందుకు 9 ఈజీ చిట్కాలు
తెల్లటి షూస్ మురికిగా మారాయా? ఇంట్లోనే శుభ్రం చేసేందుకు 9 ఈజీ చిట్కాలు
Curry Leaves and Hair Oil : జుట్టు ఒత్తుగా, బలంగా కనిపించాలంటే.. కరివేపాకుతో ఈ 5 రకాల నూనెలను కలిపి ట్రై చేయండి
జుట్టు ఒత్తుగా, బలంగా కనిపించాలంటే.. కరివేపాకుతో ఈ 5 రకాల నూనెలను కలిపి ట్రై చేయండి
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
NTR Health Update : ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Embed widget