Gut Friendly Foods : జీర్ణ సమస్యలను దూరం చేసే 9 హెల్తీ ఫుడ్స్.. కడుపు ఉబ్బరం నుంచి మలబద్ధకం వరకు
Monsoon Diet Tips : గట్ హెల్తీగా ఉండాలనుకుంటే కొన్ని ఫుడ్స్ రోజూ తినాల్సి ఉంటుంది. వాటిని తింటే జీర్ణ సమస్యలు దూరమవడంతో పాటు హెల్తీగా ఉంటారని చెప్తున్నారు. ఇంతకీ ఆ ఫుడ్స్ ఏంటో చూసేద్దాం.

Healthy Eating in Monsoon : వర్షాకాలంలో జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వాతావరంతో పాటు శరీరం కూడా నీరసపడినట్టు అనిపిస్తుంది. ఈ సమయంలో కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి. అందుకేవాటిని దూరం చేసుకోవడానికి కొన్ని ఫుడ్స్ రెగ్యులర్‌గా తింటూ ఉండాలి. ఇంతకీ ఆ ఫుడ్స్ ఏంటి? వాటివల్ల ఆరోగ్యానికి కలిగే ఇబ్బందులు ఏంటి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పెరుగు
పెరుగులో ప్రొబయోటిక్ లక్షణాలు ఉంటాయి. ఇవి కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలను దూరం చేస్తాయి. ముఖ్యంగా యోగర్ట్‌ని ఎలాంటి యాడ్ ఆన్ ఫ్లేవర్స్ లేకుండా తీసుకుంటే జీర్ణ సమస్యలు తగ్గడంతో పాటు శరీరానికి ప్రోటీన్‌ని కూడా అందిస్తుంది.
యాపిల్స్
యాపిల్స్‌లో పెక్టిన్ అనే ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. గట్ బ్యాక్టీరియాను మెరుగుపరిచి జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. ముఖ్యంగా మలబద్ధకం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు దూరమవుతాయి. కేవలం యాపిల్ మాత్రమే కాదు.. ఫైబర్ నిండుగా ఉండే పండ్లు అన్ని మంచి ఫలితాలు ఇస్తాయి.
చియా సీడ్స్
చియా సీడ్స్‌లో ఫైబర్ ఉంటుంది. వీటిని నానబెట్టి తీసుకుంటే జెల్గా మారి కడుపులోని జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. అలాగే మలబద్ధకం సమస్యలను దూరం చేస్తుంది. ఉదయాన్నే మలబద్ధకంతో ఇబ్బంది పడేవారు వీటిని రెగ్యులర్‌గా తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.
బొప్పాయి
బొప్పాయిలో కూడా జీర్ణక్రియను మెరుగుపరిచే పాపైన్ వంటి ఎంజైమ్స్ ఉంటాయి. ఇవి జీర్ణ సమస్యలను దూరం చేస్తాయి. ఐబిఎస్తో బాధపడేవారికి ఇది మంచి ఫలితాలు ఇస్తుంది. కడుపు ఉబ్బరం తగ్గించడంతో పాటు మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. స్కిన్ హెల్త్‌కి కూడా మంచిది.
తృణధాన్యాలు
ఓట్స్, క్వినోవా, గోధుమలు వంటి తృణధాన్యాల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మొత్తం జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. ముఖ్యంగా మలబద్ధకాన్ని తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి. కాబట్టి వీటిని కూడా డైట్లో చేర్చుకోండి.
బీట్రూట్
ఎనెమియాతో ఇబ్బంది పడేవారు, జీర్ణ సమస్యలతో బాధపడేవారు బీట్రూట్ను తమ రొటీన్లో తీసుకోవాలి. ఇవి గట్ హెల్తీగా ఉంచడంలో హెల్ప్ చేస్తాయి. గట్ హెల్త్‌ని ప్రమోట్ చేసి.. మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తాయి.
అల్లం
అల్లాన్ని ఆయుర్వేదంలో ప్రధానంగా ఉపయోగిస్తారు. జీర్ణ సమస్యలను దూరం చేయడంలో ఇది ముఖ్యపాత్ర పోషిస్తుంది. కడుపు తిప్పడం వంటి సమస్యలను తగ్గిస్తుంది. కడుపు ఉబ్బరం, అసౌక్రయం, హీట్ బర్న్ వంటి సమస్యలను దూరం చేయడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది.
ఆకుకూరలు
బ్రకోలి, పాలకూర వంటి ఆకు కూరల్లో ఫైబర్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణ సమస్యలను దూరం చేయడంలో హెల్ప్ చేస్తాయి. మెగ్నీషియం జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. కండర సమస్యలను తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి. గ్యాస్ సమస్యలతో ఇబ్బంది పడేవారు రెగ్యులర్‌గా వీటిని తీసుకుంటే మంచిది.
పుదీనా
పుదీనా ఆయిల్ లేదా పుదీనా కండరాల నొప్పులను దూరం చేస్తాయి. అంతేకాకుండా జీర్ణ సమస్యలను తగ్గిస్తాయి. మలబద్ధకం, కడుపు ఉబ్బరంతో ఇబ్బంది పడేవారు వీటిని రెగ్యులర్‌గా తమ డైట్లో తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు.
ఈ ఫుడ్స్‌ని డైట్లో తీసుకుంటూ వ్యాయామం చేస్తూ.. తొమ్మిది గంటలు నిద్రపోతే మంచి ఫలితాలు చూస్తారు. అంతేకాకుండా జీర్ణ సమస్యలను తగ్గించడంలో నీరు ముఖ్యపాత్ర పోషిస్తుంది. కాబట్టి రోజుకు 1 నుంచి 8 గ్లాసుల నీటిని కచ్చితంగా తీసుకోండి. దీర్ఘకాలికంగా జీర్ణ సమస్యలతో ఇబ్బంది పడుతుంటే కచ్చితంగా వైద్యుల సహాయం తీసుకోవాలి.






















