Cheekatilo OTT Release Date: ఓటీటీలోకి అక్కినేని కోడలు శోభిత సినిమా... ప్రైమ్ వీడియోలో క్రైమ్ & సస్పెన్స్ డ్రామా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Cheekatilo Digital Streaming Date: శోభిత ధూళిపాల ప్రధాన పాత్రలో నటించిన ప్రైమ్ వీడియో ఒరిజినల్ సినిమా 'చీకటిలో'. స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేశారు.

Sobhita Dhulipala OTT Movie Cheekatilo Release Date: యంగ్ & సెన్సేషనల్ హీరోయిన్, అక్కినేని కోడలు, నాగచైతన్య భార్య శోభితా ధూళిపాళ నటించిన కొత్త సినిమా 'చీకటిలో'. అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం రూపొందిన ఒరిజినల్ ఫిల్మ్ ఇది. చంద్ర పెమ్మరాజు రచనా సహకారంతో శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించగా... సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి. సురేష్ బాబు నిర్మించారు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... సినిమా స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేశారు.
జనవరి 23వ తేదీ నుంచి 'చీకటిలో'
Cheekatilo Streaming Platform And Release Date: అమెజాన్ ప్రైమ్ వీడియో ఒరిజినల్ సినిమా 'చీకటిలో'. ఈ నెల (జనవరి) 23వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు అమెజాన్ ప్రైమ్ వీడియో తెలిపింది. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో సినిమా స్ట్రీమింగ్ కానుంది.
Also Read: ఎవరీ గీతూ మోహన్‌దాస్? 'టాక్సిక్' టీజర్‌తో హాట్ టాపిక్... డైరెక్టరే కాదు, నటిగా అవార్డు విన్నర్
'చీకటిలో' కథేమిటి? జానర్ ఏమిటి?హైదరాబాద్ సిటీ నేపథ్యంలో క్రైమ్ సస్పెన్స్ డ్రామాగా 'చీకటిలో'ని తెరకెక్కించారు. ఇందులో ఓ ట్రూ క్రైమ్ పాడ్కాస్టర్ సంధ్య పాత్రలో శోభిత ధూళిపాళ నటించారు. సిటీలో జరిగే కొన్ని దారుణమైన చీకటి రహస్యాలను ఆమె వెలికి తీస్తుంది. తన వద్ద శిక్షణ పొందుతున్న ఓ వ్యక్తి అనుమానాస్పద మృతి చెందుతాడు. అతని మరణానికి న్యాయం చేయాలని అలుపెరగని ప్రయత్నం చేస్తుంది సంధ్య. ఆ క్రమంలో కొన్ని నేరాలు తెలుస్తాయి. అవి ఏమిటి? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
View this post on Instagram
శోభితతో పాటు విశ్వ దేవ్ రాచకొండ, వెంట చైతన్య విశాలక్ష్మి, ఈషా చావ్లా, ఝాన్సీ, ఆమని, వడ్లమాని శ్రీనివాస్ ఇతరులు 'చీకటిలో' కీలక పాత్రలు పోషించారు. 'చీకటిలో' నిర్మాత డి. సురేష్ బాబు మాట్లాడుతూ... ''ఇదొక క్రైమ్ & సస్పెన్స్ డ్రామా, థ్రిల్లర్. మానవ భావోద్వేగాలు సైతం ఉన్నాయి. జనవరి 23న ప్రైమ్ వీడియో ఓటీటీలో ప్రీమియర్ అవుతుంది'' అని అన్నారు.
Before You Go
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















