The Raja Saab vs Jana Nayakudu: జన నాయకుడు వాయిదా... ప్రభాస్ 'ది రాజా సాబ్'కు లాభమే - 'దిల్' రాజు సేఫ్
Prabhas Vs Thalapathy Vijay: జనవరి 9న థియేటర్లలో ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్, తమిళ దళపతి విజయ్ మధ్య క్లాష్ తప్పింది. 'జన నాయకుడు' వాయిదా వల్ల 'ది రాజా సాబ్'కు లాభమే.

సంక్రాంతికి ఐదు తెలుగు సినిమాలు విడుదల అవుతున్నాయి. అయితే... మిగతా సినిమాలు అన్నిటి కంటే ముందుగా థియేటర్లలోకి వస్తున్న ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్, తమిళ దళపతి విజయ్ సినిమాలపై అందరికి చూపు పడింది. ఓ దశలో అగ్ర నిర్మాత, తెలంగాణలో బడా డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు మీద ఈ క్లాష్ ఇష్యూలో ప్రభాస్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే... ఇప్పుడు విజయ్ సినిమా వాయిదా వల్ల ప్రభాస్ సినిమాకు లాభం చేకూరుతోంది.
'జన నాయకుడు' విడుదల వాయిదా...
'ది రాజా సాబ్'కు తమిళనాట కూడా ప్లస్సే!
'జన నాయగన్' సినిమా తెలుగులో సూపర్ హిట్ అయిన గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ 'భగవంత్ కేసరి'కి రీమేక్. తెలుగు ప్రేక్షకులు చూసిన సినిమాను మళ్ళీ తెలుగులో 'జన నాయకుడు'గా రీమేక్ చేయడం ఏమిటి? అని ప్రేక్షకులు కొందరు విమర్శలు చేశారు.
తెలంగాణలో థియేటర్స్ అగ్రిమెంట్లు స్టార్ట్ చేయడం మొదలైనప్పుడు... న్యూస్ పేపర్లలో ఏయే థియేటర్లలో ఏ సినిమా ప్రదర్శిస్తారు? అనే ఇనీషియల్ లిస్ట్ ఇచ్చారు. అందులో 'జన నాయకుడు'కు ఎక్కువ థియేటర్లు ఉండటం చూసి 'దిల్' రాజు మీద ప్రభాస్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు ఆ సమస్య లేదు.
Also Read: Chiranjeevi: చిరంజీవి వాచ్ ఖరీదు తెలిస్తే గుండె గుభేల్ గ్యారెంటీ - ఆ బ్లేజర్ రేటు కూడా తక్కువేం కాదు
సెన్సార్ సమస్యల వల్ల 'జన నాయకుడు' విడుదల వాయిదా పడింది. దాంతో ఆ సినిమా కోసం కేటాయించిన థియేటర్లలో 'ది రాజా సాబ్' షోలు పడతాయి. ఈ శుక్రవారం (జనవరి 9న) ప్రభాస్ సినిమాకు మరొకటి పోటీగా లేదు. ఏపీ, తెలంగాణ వరకు మాత్రమే ఈ పరిస్థితి పరిమితం కాలేదు... తమిళనాడులోనూ 'ది రాజా సాబ్' సినిమాకు మరొకటి పోటీ లేదు. శివకార్తికేయన్ 'పరాశక్తి' సినిమా జనవరి 10న రిలీజ్ అవుతోంది. అందువల్ల, అక్కడ కూడా ప్రభాస్ సినిమాకు ఎక్కువ థియేటర్లు లభిస్తాయి. సో... 'ది రాజా సాబ్'కు బంపర్ ఓపెనింగ్ లభించడం గ్యారెంటీ. మొదటి రోజు వంద కోట్లకు పైగా ఓపెనింగ్ డే కలెక్షన్ వస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.
Also Read: Sreeleela: ఇది బీకాంలో ఫిజిక్స్ లెక్క... ఆర్ట్స్ కాలేజీలో డాక్టర్లు ఎందుకుంటారమ్మా?





















