Shubman Gill Vijay Hazare Trophy | దేశవాళీ టోర్నీలో గిల్ వైఫల్యం!
ఈ మధ్యకాలంలో ఫామ్ కోల్పోయి యంగ్ ప్లేయర్ శుబ్మన్ గిల్ ( Shubman Gill ) చాలా ఇబ్బందులు పడుతున్నాడు. టెస్ట్, వన్డే ఫార్మాట్ లో కాస్త పర్వాలేదని అనిపించినా టీ20 ఫార్మాట్ లో మాత్రం దారుణమైన ప్రదర్శనతో ఎన్నో విమర్శలు ఎదుర్కున్నాడు. ఫార్మ్ కోల్పోవడంతోనే టీ20 వరల్డ్ కప్ లో కూడా చోటు దక్కించుకోలేక పొయ్యాడు.
ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హాజరే ట్రోఫీతో తిరిగి ఫార్మ్ లోకి రావాలని ప్రాక్టీస్ మొదలు పెట్టాడు గిల్. కానీ అనుకున్నట్టు మాత్రం జరగలేదు. ఇక్కడ కూడా అదే పరిస్థితి. గిల్ మళ్ళి నిరాశపరిచాడు. కేవలం 11 పరుగులకే ఔటయ్యాడు. పంజాబ్ గోవా మధ్య జరిగిన మ్యాచ్ లో కెప్టెన్ గిల్ తక్కువ పరుగులకే వెనుదిరిగాడు.
న్యూజిలాండ్ సిరీస్‌కు ముందు ఎలాగైనా గిల్ ఫార్మ్ లోకి వస్తాడని అందరు ఆశించారు. కానీ ఆలా జరగకపోవడంతో ఫ్యాన్స్ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. విజయ్ హజారే ట్రోఫీతో మళ్ళి నిరాశ పరిచిన గిల్.. న్యూజీలాండ్ సిరీస్ లో ఎలా ప్రదర్శిస్తాడో చూడాలి.





















