IPL 2026: చిన్నస్వామి స్టేడియంలో ఫ్యాన్స్ భద్రతకు AI టెక్నాలజీ, ఖర్చు భరించనున్న RCB
RCB AI cameras at Chinnaswamy Stadium | బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ప్రేక్షకుల భద్రత కోసం AI కెమెరాలు ఏర్పాటు చేస్తామని రాయల్ ఛాలెంజర్స్ స్పష్టం చేసింది.

AI cameras at chinnaswamy stadium: బెంగళూరులోని M చిన్నస్వామి స్టేడియంలో IPL 2026 మ్యాచ్‌లు జరుగుతాయా లేదా అనేది ఇంకా కన్ఫామ్ కాలేదు. మ్యాచుల నిర్వహణపై ఇంకా సందిగ్దత నెలకొంది. IPL 2025 టైటిల్‌ను RCB గెలుచుకుంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు సాధించిన తొలి ఐపీఎల్ టైటిల్ అది. తొలి టైటిల్ నెగ్గిన తర్వాత ఆర్సీబీ జట్టు విజయ యాత్ర (Victory Parade) నిర్వహించాల్సి ఉంది. కానీ చిన్నస్వామి స్టేడియం బయట జరిగిన తొక్కిసలాట ఘటనలో 11 మంది మరణించారు. ఆ తర్వాత చిన్నస్వామి స్టేడియంలో పెద్ద స్థాయి మ్యాచ్‌లు ఏవీ జరగలేదు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు భద్రతా వ్యవస్థను మెరుగుపరచడానికి కీలక నిర్ణయం తీసుకుంది. AI-ఎనేబుల్డ్ కెమెరాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది.
చిన్నస్వామి స్టేడియంలో ఏఐ కెమెరాలు..
కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (KSCA)కి రాసిన లేఖలో, RCB ఫ్రాంచైజీ చిన్నస్వామి స్టేడియంలో 300-350 AI-ఎనేబుల్డ్ కెమెరాలను ఏర్పాటు చేయాలని సూచించింది. ఇది ప్రజల కదలికలను పర్యవేక్షించడానికి, పెద్ద క్యూ లైన్లు, స్టేడియం ఎగ్జిట్ ప్రాంతాలను కూడా పర్యవేక్షించడానికి వీలు కల్పిస్తుంది. దీనివల్ల ముఖ్యంగా IPL మ్యాచులు, ఇతర పెద్ద ఈవెంట్‌లను సజావుగా నిర్వహించవచ్చని ఆర్సీబీ ఫ్రాంచైజీ తెలిపింది.
కొన్ని నివేదికల ప్రకారం IPL 2026లో RCB హోమ్ గ్రౌండ్‌లో నిర్వహించాల్సిన మ్యాచ్‌లు పూణేలో ఆడనున్నాయనే వార్తలు వస్తున్న సమయంలో RCB ఈ సూచన చేసింది. డిసెంబర్ నెల చివరి వారంలో బెంగళూరు, రాజస్థాన్ జట్లు MCA స్టేడియాన్ని సందర్శించాయని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ తెలిపింది.
𝗥𝗖𝗕 𝗖𝗔𝗥𝗘𝗦: Advanced AI video analytics technology for 𝗰𝗿𝗼𝘄𝗱 𝗺𝗮𝗻𝗮𝗴𝗲𝗺𝗲𝗻𝘁 at the 𝘊𝘩𝘪𝘯𝘯𝘢𝘴𝘸𝘢𝘮𝘺 𝘚𝘵𝘢𝘥𝘪𝘶𝘮.
— Royal Challengers Bengaluru (@RCBTweets) January 16, 2026
In a formal communication to the KSCA, RCB has proposed the installation of 300 to 350 AI-enabled cameras at the M. Chinnaswamy Stadium.… pic.twitter.com/LuJ3v4uNwa
ఖర్చులు భరించనున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో AI కెమెరాలను ఏర్పాటు చేసే ఖర్చును తామే భరిస్తామని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ (RCB) తెలిపింది. దీని మొత్తం వ్యయం దాదాపు 4.5 కోట్ల రూపాయలు కావచ్చని తెలుస్తోంది. RCB IPL 2026లో తమ హోమ్ మ్యాచ్‌లను ఎక్కడ ఆడుతుందో ఇంకా ఖరారు కాలేదు. అయితే చిన్నస్వామి స్టేడియంపై ముద్ర వేయని పరిస్థితిని బట్టి, బెంగళూరు ఫ్రాంచైజీ ఇతర నగరాల్లో తమ హోమ్ మ్యాచ్‌లు ఆడాల్సి వస్తుంది. కానీ బెంగళూరులో మ్యాచుల నిర్వహణను అటు కర్ణాటక క్రికెట్ అసోసియేషన్, ఇటు ఆర్సీబీ మేనేజ్‌మెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఒకవేళ బెంగళూరులోని ఈ స్టేడియం నుంచి మ్యాచులను వేరే ప్రాంతానికి తరలిస్తే కనుక ఆర్సీబీ టికెట్లు కొనుగోలు చేయడం తగ్గుతుందని భావిస్తున్నారు. స్థానిక ప్రేక్షకుల నుంచి ఆర్సీబీకి మద్దతు కరువు అవుతుందని లెక్కలు వేసుకుంటున్నారు.





















