Fifa World Cup Free Tickets | లాటరీ తీయాలన్నా 50కోట్ల అప్లికేషన్ల డేటా ఎలా ఎక్కించాలయ్యా | ABP Desam
ప్రపంచంలో అత్యధిక క్రేజ్ ఉన్న ఆట అంటే నిస్సందేహంగా ఫుట్ బాల్ అని చెప్పుకోవచ్చు. అందులోనూ ఫిఫా వరల్డ్ కప్ కి ఉండే క్రేజే వేరు. అనేక దేశాలకు చెందిన సూపర్ స్టార్లు పాల్గొన్నే ఈ వరల్డ్ కప్ లో ఒక్క మ్యాచైనా రియల్ గా చూడాలని ఆ యుఫోరియా ఎంజాయ్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటారు. కానీ టిక్కెట్స్ దొరకటమే చాలా కష్టం. అందుకే ఫ్యాన్స్ కోసం ఫిఫా ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది. అదే లాటరీ టిక్కెట్స్. మీకు నచ్చిన మ్యాచ్ లో టిక్కెట్ కోసం అప్లి కేషన్ పెట్టుకోండి. లాటరీ తీస్తాం..మీ పేరు వస్తే మీకే టిక్కెట్ పంపిస్తామని ఆఫర్ ఇచ్చింది. నిన్నటితో ఆ గడువు తేదీ ముగిసింది. సరే ఎన్ని వచ్చాయో చూద్దామని ఓపెన్ చేసి ఫిఫా అధికారులకు కళ్లు బయర్లు కమ్మాయంట. ఎందుకంటే 211 దేశాల నుంచి ఏకంగా 50కోట్ల అప్లికేషన్లు వచ్చి పడ్డాయంట తమ డేటా బేస్ కి. ఇప్పుడు లాటరీ తీయాలంటే ఈ 50 కోట్ల అప్లికేషన్లు ఓ చోటకు రీ డైరెక్ట్ చేయాలన్నా హ్యూమన్లీ ఇంపాజిబుల్ అని తలలు పట్టుకుంది ఫిఫా. అందుకే అభిమానులకు సారీ చెబుతూ అధికారులు ఓ ప్రకటన చేశారు. ర్యాండమ్ గా తామే సెలెక్ట్ చేసి కొన్ని టిక్కెట్లు కానీ ఇంతటి స్పందన చూపించనందుకు చాలా చాలా కృతజ్ఞతలు అంటూ ఫిఫా అధ్యక్షుడు జియానీ ఇన్ఫాంటినో వెల్లడించారు. చూశారు కదా అది ఫుట్ బాల్ కి ఉండే క్రేజ్.






















