అన్వేషించండి

Telangana News: హిస్టరీ క్రియేట్ చేసిన తెలంగాణ లేడీ కానిస్టేబుల్! తొలిసారి తెలుగు భాషలో ఛార్జిషీట్‌

మాతృభాషలో చార్జ్‌షీట్ రాయడం సాధారణంగా ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువగా జరుగుతుంది. కానీ మొదటిసారి తెలుగులో చార్జీషీట్ రూపొంచి, కేసు వేగంగా దర్యాప్తు పూర్తి చేశారు దుండిగల్‌కు చెందిన లేడి కానిస్టేబుల్

Telangana News: తెలుగు రాష్ట్రాల్లో సాధారణంగా ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగే అధికార ప్రత్యుత్తరాలు అన్నీ ఇంగ్లీష్‌లో జరగడం సర్వసాధారణం. అటు గ్రామాల్లో ఇటు నగరంలో ఆంగ్ల భాష మీద పట్టులేని వాళ్లు ఇప్పటికీ అధిక సంఖ్యలో ఉన్నారు. అటువంటి వారు ప్రస్తుతం అందుబాటులో ఫోన్ ఉండటం వల్ల ఇంగ్లీషులో ఉన్న సమాచార కాపీని ఫోటో లేదా స్కాన్ చేసి వారికి వచ్చిన భాషలోకి అనువదించుకుని చదువుకుని అర్థం చేసుకోవాల్సిన పరిస్దితి ఏర్పడింది. ఇది దశాబ్దాలుగా కొనసాగుతోంది. కానీ దుండిగల్ పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న ఓ మహిళా హెడ్ కానిస్టేబుల్ స్వరూప, మాతృభాష తెలుగులో తన దర్యాప్తును కొనసాగించి, తెలుగు భాషలోనే ఛార్జీషీట్ దాఖలు చేయడం ద్వారా తెలంగాణ పోలీస్ శాఖలోనే కాదు , దక్షిణాది రాష్ట్రాల్లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశారు.

మాతృభాషలో కార్యాలయ విధులు సాధారణంగా ఉత్తర భారతదేశంలో జరగడం మనం చూస్తుంటాం. కానీ దుండిగల్ హెడ్ కానిస్టేబుల్ స్వరూప ఉన్నతాధికారుల ప్రోత్సాహంతో 2025 సంవత్సరంలో తనకు కేటాయించిన ఓ రెండు కేసుల్లో పూర్తిగా తెలుగులో అభియోగపత్రం కోర్టుకు దాఖలు చేశారు. అందులో మొదటిది బౌరంపేట్‌కు చెందిన వెంకటేష్ అనే వ్యక్తి తన కిరాణా డబ్బాలో అక్రమంగా మద్యం నిల్వలు కలిగి,అమ్మకాలు చేస్తున్న కేసు. ఈ క్రమంలో దుండిగల్ పోలీసులు అతనిని అదుపులోకి తీసుకుని మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. కేసును ఎక్సైజ్ చట్టం ప్రకారం దర్యాప్తు పూర్తి చేసి చివరగా దాఖలు చేసే అభియోగ పత్రాలు పూర్తిగా తెలుగులో మేడ్చల్ మొదటి తరగతి మేజిస్ట్రేట్ కు సమర్పించారు.


Telangana News: హిస్టరీ క్రియేట్ చేసిన తెలంగాణ లేడీ కానిస్టేబుల్! తొలిసారి తెలుగు భాషలో ఛార్జిషీట్‌

మరో కేసులో ఓ మహిళా కూలీ, తన నాలుగేళ్ల కుమార్తెతోపాటు అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా ఎవరికీ కనిపించకుండా ఇంటి నుంచి వెళ్లిపోయింది. భార్య ,కూతరి కోసం భర్త ఎంత వెతికినా ప్రయోజనం లేకపోవడంతో దుండిగల్ పోలీసులను ఆశ్రయించాడు. తన భార్య, కూతురి ఆచూకీ కోసం తన భర్త ద్వారా అందిన ఫిర్యాదులో వేగంగా స్పందించి కేసును ఛేదించి మహిళను, పాపను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు హెడ్ కానిస్టేబుల్ స్వరూపం. ఈ క్రమంలో తన దర్యాప్తు తుది నివేదికను తెలుగులో పూర్తి చేసి ఏసీపీ మేడ్చల్ శంకర్ రెడ్డికి సమర్పించారు. ఈ విధంగా ప్రజలకు సులువుగా అర్థమయ్యే విధంగా తెలంగాణ రాష్ట్ర అధికార భాష తెలుగులో దర్యాప్తును పూర్తి చేయడం ద్వారా మహిళా హెడ్ కానిస్టేబుల్ స్వరూప ఉన్నతాధికారుల ప్రశంసలు పొందడమే గాకుండా, ఇటీవల తెలంగాణ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, బంజారా హిల్స్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర డీజీపీ బి. శివధర్ రెడ్డి చేతులమీదుగా ప్రశంసా పత్రం అందుకున్నారు.


Telangana News: హిస్టరీ క్రియేట్ చేసిన తెలంగాణ లేడీ కానిస్టేబుల్! తొలిసారి తెలుగు భాషలో ఛార్జిషీట్‌

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Crime News: హైదరాబాద్‌లో మరో నేపాలీ గ్యాంగ్ అరాచకం.. ఓ ఇంట్లో 75 తులాల బంగారం, 20 కిలోల వెండి చోరీ
హైదరాబాద్‌లో మరో నేపాలీ గ్యాంగ్ అరాచకం.. ఓ ఇంట్లో 75 తులాల బంగారం, 20 కిలోల వెండి చోరీ
RGV On Bandi Bhagiratha: బండి భగీరథపై ఆర్జీవీ కామెంట్స్... సద్దాం హుస్సేన్ కొడుకుతో పోలుస్తూ ట్వీట్ - వైరల్
బండి భగీరథపై ఆర్జీవీ కామెంట్స్... సద్దాం హుస్సేన్ కొడుకుతో పోలుస్తూ ట్వీట్ - వైరల్
Bandi Bhagirath POCSO Case: బండి భగీరథ్ కేసులో కీలక పరిణామం.. తప్పు చేస్తే సహించేది లేదన్న బండి సంజయ్
బండి భగీరథ్ కేసులో కీలక పరిణామం.. తప్పు చేస్తే సహించేది లేదన్న బండి సంజయ్
Feel The Jail: నేరం చేయకుండా జైలుకెళ్లాలని ఉందా? ఖైదీగా మారాలనుందా? - డబ్బులు కట్టి ఉండొచ్చు..ఇవిగో డీటైల్స్
నేరం చేయకుండా జైలుకెళ్లాలని ఉందా? ఖైదీగా మారాలనుందా? - డబ్బులు కట్టి ఉండొచ్చు..ఇవిగో డీటైల్స్

వీడియోలు

“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CBSE 12th Result 2026: సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలను విడుదల.. 85.20 శాతం మంది ఉత్తీర్ణత.. రిజల్ట్స్ లింక్
సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలను విడుదల.. 85.20 శాతం మంది ఉత్తీర్ణత.. రిజల్ట్స్ లింక్
PM Modi Convoy Size: ప్రధాని మోదీ కాన్వాయ్ వాహనాలు తగ్గింపు.. వాటికి ఎంత ఫ్యూయల్ వాడేవారు, ఎంత ఆదా అవుతుంది
ప్రధాని మోదీ కాన్వాయ్ వాహనాలు తగ్గింపు.. వాటికి ఎంత ఫ్యూయల్ వాడేవారు, ఎంత ఆదా అవుతుంది
Hyderabad Crime News: హైదరాబాద్‌లో మరో నేపాలీ గ్యాంగ్ అరాచకం.. ఓ ఇంట్లో 75 తులాల బంగారం, 20 కిలోల వెండి చోరీ
హైదరాబాద్‌లో మరో నేపాలీ గ్యాంగ్ అరాచకం.. ఓ ఇంట్లో 75 తులాల బంగారం, 20 కిలోల వెండి చోరీ
Vijay Trisha: సూర్య కోసమా? త్రిష కోసమా? సీఎం విజయ్ బంపరాఫర్ బాగుందమ్మా
సూర్య కోసమా? త్రిష కోసమా? సీఎం విజయ్ బంపరాఫర్ బాగుందమ్మా
Gold Import Duty: బంగారం, వెండిపై దిగుమతి సుంకం రెట్టింపు.. ప్రధాని మోదీ మాటలకు అర్థం ఇదే!
బంగారం, వెండిపై దిగుమతి సుంకం రెట్టింపు.. ప్రధాని మోదీ మాటలకు అర్థం ఇదే!
Heat Wave Alert : రోజు రోజుకి పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. వేడి వల్ల శరీరానికి, మనసుకు పొంచి ఉన్న ప్రమాదాలు ఇవే
రోజు రోజుకి పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. వేడి వల్ల శరీరానికి, మనసుకు పొంచి ఉన్న ప్రమాదాలు ఇవే
Peddi Tickets Rate: తెలంగాణలో 'పెద్ది'కి పెద్ద దెబ్బ... మైత్రి వర్సెస్ ఎగ్జిబిటర్స్ ఇష్యూలో చరణ్ సినిమాకు భారీ లాస్
తెలంగాణలో 'పెద్ది'కి పెద్ద దెబ్బ... మైత్రి వర్సెస్ ఎగ్జిబిటర్స్ ఇష్యూలో చరణ్ సినిమాకు భారీ లాస్
AP Local Body Elections: మూడు నెలల్లో ఏపీ స్థానిక ఎన్నికల నగారా? కూటమిలో సీట్ల పంచాయతీ.. బాబు ముందున్న సవాల్ ఇదే!
మూడు నెలల్లో ఏపీ స్థానిక ఎన్నికల నగారా? కూటమిలో సీట్ల పంచాయతీ.. బాబు ముందున్న సవాల్ ఇదే!
Embed widget