అన్వేషించండి

TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్

వైఎస్ జగన్‌పై ఉన్న 31 కేసుల విచారణ 13 ఏళ్లుగా సాగుతోందని తెదేపా ఎంపీ విజయ్ రాజ్యసభలో పేర్కొన్నారు. సీబీఐ కోర్టుల జాప్యం చట్టంపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • టీడీపీ ఎంపీ చింతకాయల విజయ్ జగన్ 31 కేసుల జాప్యంపై ప్రస్తావించారు.
  • డిశ్చార్జ్ పిటిషన్లు, జడ్జీల బదిలీల వల్ల విచారణ ఆలస్యమవుతోందన్నారు.
  • పదమూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న కేసులపై కేంద్రం దృష్టి సారించాలని కోరారు.

Andhra Pradesh News | న్యూఢిల్లీ:  సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచే సవరణ బిల్లుపై జరిగిన చర్చలో భాగంగా టీడీపీ ఎంపీ చింతకాయల విజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై నమోదైన 31 క్రిమినల్ కేసులలో, 13 ఏళ్లు గడిచినా విచారణ ఇంకా కొనసాగుతూనే ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యసభలో చర్చలో ఆయన మాట్లాడుతూ కేసుల పెండింగ్ విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించారు.

డిశ్చార్జ్ పిటిషన్లకే అన్నేళ్లు పడితే.. అసలు విచారణకు ఎన్నేళ్లు..
మాజీ సీఎం జగన్‌తో పాటు ఈ కేసుల్లో ఉన్న ఇతర నిందితులు పదే పదే డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తుండటం, ఈ విచారణలు చేపడుతున్న వేర్వేరు న్యాయమూర్తులు తుది తీర్పు ఇవ్వకముందే బదిలీ కావడంతో ప్రక్రియ తీవ్రంగా జాప్యమవుతోందని ఎంపీ చింతకాయల విజయ్ పేర్కొన్నారు. జడ్జీల కొరత ఉండటంతో పాటు మరోవైపు వరుస బదిలీల కారణంగా కేసుల విచారణ ముందుకు సాగడం లేదన్నారు. కేవలం డిశ్చార్జ్ పిటిషన్లకే 13 ఏళ్లు పడితే ఇక ప్రధాన విచారణ ఎప్పుడు మొదలవుతుందని, తుది తీర్పు ఎప్పటికి వస్తుందని ఎంపీ విజయ్ ప్రశ్నించారు.

కేసుల పరిష్కారంపై కేంద్రం ఫోకస్ చేయాలి

ఈ కేసు విచారణల జాప్యం అనేది కేవలం ఒక్క వ్యక్తికి సంబంధించిన సమస్య మాత్రమే కాదని, దేశంలో చట్టపరిపాలనపై ప్రజలకు ఉన్న విశ్వాసానికి సంబంధించిన అంశమన్నారు. కనుక ప్రత్యేక సీబీఐ కోర్టుల పనితీరు, కేసుల పరిష్కారంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని ఈ సందర్భంగా కోరారు. కాగా, రాజ్యసభలో న్యాయమూర్తుల పెంపు సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా ఎంపీ విజయ్ జగన్ కేసులను ప్రస్తావించడంపై వైసీపీ ఎంపీలు తీవ్ర నిరసన తెలిపారు. అయితే తాను సమస్యను మాత్రమే ప్రస్తావించానని, ఎవరినీ టార్గెట్ చేయలేదని ఎంపీ పేర్కొన్నారు.న

Also Read: YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!

Frequently Asked Questions

వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఎన్ని క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి?

వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై 31 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. 13 సంవత్సరాలు గడిచినా, ఈ కేసుల విచారణ ఇంకా కొనసాగుతోంది.

జగన్ కేసుల విచారణ ఆలస్యం కావడానికి ప్రధాన కారణాలు ఏమిటి?

పదే పదే డిశ్చార్జ్ పిటిషన్లు వేయడం, న్యాయమూర్తుల బదిలీలు, జడ్జీల కొరత కారణంగా విచారణ ప్రక్రియ తీవ్రంగా జాప్యమవుతోంది.

కేసుల పరిష్కారంపై ఎంపీ చింతకాయల విజయ్ కేంద్రానికి ఏమని సూచించారు?

ప్రత్యేక సీబీఐ కోర్టుల పనితీరు, కేసుల పరిష్కారంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన కోరారు. ఇది చట్టపాలనపై ప్రజల విశ్వాసానికి సంబంధించిన అంశం అన్నారు.

ఎంపీ చింతకాయల విజయ్ జగన్ కేసులను ఏ చర్చలో ప్రస్తావించారు?

సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచే సవరణ బిల్లుపై రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన ఈ కేసులను ప్రస్తావించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News: హిమాచల్ ప్రదేశ్‌ ఘోర ప్రమాదం- లోయలో పడ్డ బస్‌, ఏడుగురు మృతి
హిమాచల్ ప్రదేశ్‌ ఘోర ప్రమాదం- లోయలో పడ్డ బస్‌, ఏడుగురు మృతి
Polavaram Banakacherla Project : పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు తిరస్కరణ - రేవంత్ విజయమా? చంద్రబాబు వైఫల్యమా?
పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు తిరస్కరణ - రేవంత్ విజయమా? చంద్రబాబు వైఫల్యమా?
Ambati Rambabu Padayatra Postponed : వైసీపీలో అంబటి పాదయాత్ర రద్దు కలకలం - నేతల వ్యక్తిగత మైలేజ్ రాజకీయాలను జగన్ అంగీకరించరా?
వైసీపీలో అంబటి పాదయాత్ర రద్దు కలకలం - నేతల వ్యక్తిగత మైలేజ్ రాజకీయాలను జగన్ అంగీకరించరా?
TDP vs JSP Social Media War: టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Cheyutha Pensions: తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
Amaravati Latest News: అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
Rishabh Pant Tweet: అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
Kavitha BC Vote Bank: బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
లక్ష రూపాయలకే E3 Trion ఎలక్ట్రిక్ స్కూటర్.. 82km స్పీడ్‌, 165km రేంజ్‌, AI ఫీచర్లు
ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ భలే ఉందే! రేటు లక్ష రూపాయలే.. ఏకంగా 165km రేంజ్‌!
Embed widget