విశాఖలోని ఆరిలోవ ప్రాంతంలో
PV Sindhu Sports Academy Visakhapatnam: విశాఖలో పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీకి రెండోసారి శంకుస్థాపన జరిగిందా?
PV Sindhu Sports Academy:విశాఖలో పీవీ సింధు సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్స్‌లెన్స్ నిర్మాణానికి భూమి పూజ జరిగింది. అయితే గతంలో చేసిన భూమిపూజ కేవలం ఒక క్రీడకు సంబంధించింది. ఇప్పుడు 9 క్రీడలకు చెందింది.

- విశాఖలో పీవీ సింధు స్పోర్ట్స్ సెంటర్ నిర్మాణ శంకుస్థాపన జరిగింది.
- సీఎం సూచనతో అకాడమీ తొమ్మిది క్రీడలకు విస్తరించబడింది.
- అత్యాధునిక బ్యాడ్మింటన్, షూటింగ్, స్విమ్మింగ్ పూల్ సౌకర్యాలు ఏర్పాటు.
- భవిష్యత్ క్రీడాకారులకు సింధు అనుభవంతో ప్రపంచస్థాయి శిక్షణ.
PV Sindhu Sports Academy Visakhapatnam: ఆంధ్రప్రదేశ్‌లోని ఆర్థిక రాజధానిగా పేరున్న విశాఖలో పీవీ సింధు సెంట్ ఫర్ స్పోర్ట్స్ ఎక్స్‌లెన్స్ నిర్మాణం ప్రారంభమైంది.దీనికి మంత్రి నారా లోకేష్, డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ పీవీ సింధు అంకురార్పణ చేశారు. విశాఖలోని ఆరిలోవ ప్రాంతంలో ఉన్న తోటగరువు వద్ద ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్టు కేవలం ఆంధ్రప్రదేశ్‌కే కాకుండా యావత్ భారత్ క్రీడా రంగానికి ఒక మైలురాయిగా నిలవబోతోంది. ఈ సందర్బంగా క్రీడాకారిణి పీవీ సింధు మాట్లాడుతూ, తన క్రీడా ప్రయాణంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని రాబోయే తరాల క్రీడాకారులకు ప్రపంచ స్థాయి శిక్షణ అందించడమే తన లక్ష్యమని ఉద్ఘాటించారు. రెండోసారి భూమిపూజ చేశారనే ఆరోపణలకు ఇన్‌డైరెక్ట్‌గా సమాధానం చెప్పారు. అది ఒక క్రీడకు సంబంధించింది అయితే ఇది 9 క్రీడలకు సంబంధించిన అకాడమి.

పీవీ సింధు ఫౌండేషన్ ద్వారా నిర్మితవుతున్న ఈ అకాడమీ కేవలం బ్యాడ్మింటరన్‌కు మాత్రమే పరిమితం కాకుండా, ఒక సమగ్ర క్రీడా వ్యవస్థగా రూపుదిద్దుకుంటోందని చెబుతున్నారు. మొదట ఒకే క్రీడావిభాగానికి ప్రణాళికలు సిద్ధం చేసినప్పటికీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనలతో దీనిని 9 క్రీడా విభాలకు విస్తరించారు.
ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన బ్యాడ్మింటన్ హాల్స్, వీటిలో అథ్లెట్ల సౌకర్యార్థం ప్రత్యేకమైన ఎయిర్ సర్క్యులేషన్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఇటలీకి చెందిన ప్రముఖ సంస్థ మీర్తా సహకారంతో ఒలింపిక్ ప్రాణాలతో కూడిన 25 మీటర్ల స్విమ్మింగ్ పూల్‌ను ఇక్కడ నిర్మిస్తున్నారు. పారిస్ 2024 ఒలింపిక్స్‌లో ఉపయోగించిన అదే తరహా పూల్‌ను విశాఖలో అందుబాటులోకి తీసుకురానున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మొట్టమొదటి ఇండోర్ 25 మీటర్ల షూటింగ్ రేంజ్ ఈ అకాడమీలో భాగంగా ఏర్పాటు చేస్తున్నారు. క్రీడాకారుల ఫిట్‌నెస్ కోసం స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ సెంటర్, ఫిజియోథెరపీ యూనిట్లు, న్యూట్రిషన్, రికవరీ సపోర్ట్ వంటి అత్యాధునిక వసతులు కల్పిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ఎలైట్ అథ్లెట్ల కోసం పక్కగా రూపొందించిన ప్లేయర్ అకామడేషన్ సెంటర్ కూడా అందుబాటులో ఉండనుంది.
విశాఖ ఎందుకు?
విశాఖకు ఉన్న అంతర్జాతీయ కనెక్టివిటీ, వాతావరణం, క్రీడా ప్రాధాన్యత దృష్టిలో పెట్టుకొని పీవీ సింధు ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. భారత్‌లో ప్రతిభకు కొద లేదని, కాని సరైన వేదికలు లేకపోవడం వల్లే అంతర్జాతీయ పోటీల్లో వెనుకబడుతున్నామని పీవీ సింధు అభిప్రాయపడ్డారు. విశాఖకు అంతర్జాతీయ క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దడం ద్వారా తరతరాల క్రీడాకారులను తయారు చేయవచ్చని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
ఎప్పుడు ప్రారంభమవుతుంది?
బుధవారం భూమి పూజ కార్యక్రమం పూర్తి కావడంతో, నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన ప్రారంభంకానున్నాయి. వందేళ్ల భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ ప్రాజెక్టును డిజైన్ చేశారు. పీవీ సింధు ఫౌండేషన్, రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో ఈ ప్రాజెక్టు వీలైనంత త్వరగా పూర్తి చేసి క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు.
ఎలా రూపుదిద్దుకుంది?
ఈ ప్రాజెక్టు వెనుక సింధు తన కోచ్‌లు, మెంటార్ల నుంచి పొందిన స్ఫూర్తి దాగి ఉందని చెప్పారు. తన సొంత అకాడమీ ద్వారా యువ క్రీడాకారులను గుర్తించడం, వారిని తీర్చిదిద్దడం, వారికి మద్ధతుగా నిలవడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ క్రమంలో మంత్రి నారా లోకేష్ అందించిన సహకారం పట్ల సింధు కృతజ్ఞత తెలిపారు. తాను అడగ్గానే లోకేష్ భరోసా ఇచ్చారని, ఆయన ప్రోత్సాహం వల్లే ఈ ప్రాజెక్టు వేగంగా ముందుకు సాగిందని పేర్కొన్నారు.
స్థలంపై వివాదం
ఈ ప్రాజెక్టుకు సంబంధించిన స్థలం కేటాయింపు విషయంలో కొంత రాజకీయ చర్చ నడుస్తోంది. వైఎస్‌ఆర్‌సీపీ హయాంలో 2021లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 3 ఎకరాల కేటాయించారని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనలతో ఈ అకాడమీ పరిధిని ఒకే క్రీడ నుంచి 9 క్రీడా విభాగాలకు విస్తరిస్తూ మార్పులు చేశారు.
గతంలో పీవీ సింధు తన తల్లిదండ్రులతో కలిసి ఈ స్థలంలో ఒకసారి భూమిపూజ నిర్వహించినప్పటికీ, ప్రస్తుతం ప్రభుత్వ భాగస్వామ్యంతో పెంచిన సౌకర్యాలతో మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో మరోసారి అధికారికంగా శంకుస్థాపన నిర్వహించారు. ఇది విశాఖ అభివృద్ధిలో, క్రీడా మౌలిక సదుపాయాల కల్పనలో కీలక అడుగు అని ప్రభుత్వ భావిస్తోంది.
Frequently Asked Questions
విశాఖలో పీవీ సింధు ప్రారంభించిన కొత్త ప్రాజెక్ట్ పేరు ఏమిటి?
ఈ స్పోర్ట్స్ ఎక్స్‌లెన్స్ సెంటర్ ప్రధాన లక్ష్యం ఏమిటి?
ఈ కేంద్రం ద్వారా రాబోయే తరాల క్రీడాకారులకు ప్రపంచ స్థాయి శిక్షణ అందించడం ప్రధాన లక్ష్యం. ఇది భారత క్రీడా రంగానికి ఒక మైలురాయిగా నిలవాలని సింధు ఆకాంక్షిస్తున్నారు.
పీవీ సింధు స్పోర్ట్స్ ఎక్స్‌లెన్స్‌లో ఎలాంటి ముఖ్యమైన సౌకర్యాలు ఉంటాయి?
ఇందులో ప్రపంచ స్థాయి బ్యాడ్మింటన్ హాల్స్, ఒలింపిక్ ప్రమాణాలతో కూడిన స్విమ్మింగ్ పూల్, ఏపీలో మొదటి ఇండోర్ షూటింగ్ రేంజ్, ఫిట్‌నెస్ సెంటర్ వంటి అత్యాధునిక సౌకర్యాలు ఉంటాయి.
ఈ అకాడమీ మొదట ఎన్ని క్రీడా విభాగాల కోసం ప్రణాళిక చేయబడింది, ప్రస్తుతం ఎన్ని విభాగాలకు విస్తరించబడింది?
మొదట బ్యాడ్మింటన్‌కు మాత్రమే ప్రణాళిక చేసినప్పటికీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు దీనిని 9 క్రీడా విభాగాలకు విస్తరించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















