Keslapur Nagoba Mesram Padayatra | హస్తలమడుగులో గంగమ్మకు మెస్రం వంశీయుల పూజలు | ABP Desam
ఆదివాసీల కుంభమేళా అని పిలుచుకునే నాగోబా జాతర లో కీలక ఘట్టం దిగ్విజయంగా పూర్తైంది. కేస్లాపూర్ నాగోబా జాతరలో ప్రధాన ఘట్టమైన గంగాజలం సేకరణ పూర్తయింది. గత నెల 30న పాదయాత్రగా బయలుదేరిన మెస్రం వంశీయులు కనీసం పాదరక్షలు కూడా లేకుండా కిలోమీటర్ల పాటు పాదయాత్ర చేసుకుంటూ జనవరి 7న హస్తలమడుగు వద్దకు చేరుకున్నారు. అక్కడే గంగమ్మకు పూజలు నిర్వహించి గంగాజలాన్ని అత్యంత పవిత్రంగా సేకరించారు. గంగాజలం సేకరించిన తర్వాత ఆ పవిత్రమైన గంగాజలంతో కాలినడకన తిరిగి కేస్లాపూర్ కు బయలుదేరారు మెస్రం వంశీయులు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని గోదావరినదిలో గల హస్తలమడుగు వద్ద మెస్రం వంశీయుల పూజలు ఏ విధంగా చేస్తారు. అత్యంత పవిత్ర గంగాజలం సేకరణ దేని కోసం చేస్తారు..ఆదివాసీలు వంశపారంపర్యంగా ఆచరిస్తూ వస్తున్న ఆ కట్టుబాట్లు ఆ విశేషాలేంటో ABP Desam స్పెషల్ స్టోరీలో చూసేద్దాం. ఈ నెల 18వ తారీఖు నుంచి నాగోబా జాతర అత్యంత బ్రహ్మాండంగా ప్రారంభం కానుంది.





















