అన్వేషించండి

తక్కువ డౌన్ పేమెంట్‌తో TVS Ronin కొనేయండి.. మీరు EMI ఎంత చెల్లించాలంటే

TVS రోనిన్ దాని విభాగంలో పవర్‌ఫుల్ బైక్. ఇది రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350, హోండా CB350 RS లతో పోటీపడుతుంది. ఫైనాన్స్‌పై కొనుగోలు చేస్తే నెలకు EMI ఎంత కట్టాలో ఇక్కడ తెలుసుకోండి.

TVS రోనిన్ భారత మార్కెట్లో కస్టమర్ల ఆదరణ పొందుతున్న బైకులలో ఒకటి. టీవీఎస్ కంపెనీ దీనిని 2022 సంవత్సరంలో లాంచ్ చేసింది. ఈ బైక్2తో కంపెనీ ప్రీమియం లైఫ్ స్టైల్ సెగ్మెంట్‌లో అడుగు పెట్టింది. మోడ్రన్, రెట్రో లుక్ టీవీఎస్ రోనిన్‌ను మిగతా బైక్స్ కంటే ప్రత్యేకంగా చేస్తుంది. అందుకే ఈ బైక్ రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ (Royal Enfield Hunter) కి గట్టి పోటీనిస్తోంది. ఇప్పుడు మీరు ఈ బైక్ కొనాలని ప్లాన్ చేస్తుంటే మంచి అవకాశం వచ్చింది. సుమారు 5 వేల EMI తో కూడా ఇంటికి తీసుకెళ్లవచ్చు. డౌన్ పేమెంట్ ఎంత కట్టాలి అనేది మీరు ఏ రాష్ట్రంలో, ఏ సిటీలో తీసుకుంటున్నారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. షోరూమ్‌ లో వివరాలు కనుక్కున్నాకే కొనుగోలు చేయండి.

TVS రోనిన్ ధర మరియు EMI ప్లాన్

TVS రోనిన్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.26 లక్షలకు ప్రారంభమై రూ. 1.60 లక్షల వరకు ఉంటుంది. EMI లెక్కింపు దీని టాప్ వేరియంట్ ధర రూ. 1,60,140 ఆధారంగా డిసైడ్ చేస్తారు. మీరు మొత్తం ఎక్స్-షోరూమ్ ధరపై లోన్ తీసుకుంటే, వడ్డీ రేటు 9.5 శాతంగా ఉందనుకుందాం. 12 నెలల కాలపరిమితితో లోన్ తీసుకుంటే ప్రతి నెలా సుమారు రూ. 14,042 EMI చెల్లించాల్సి ఉంటుంది. 24 నెలల గడువు ఎంచుకుంటే EMI సుమారు రూ. 7,353 అవుతుంది. మీరు 36 నెలలు అంటే 3 సంవత్సరాల కాలపరిమితిని ఎంచుకుంటే ప్రతి నెలా సుమారు రూ. 5,130 EMI చెల్లించాలి. ఈ విధంగా ఎక్కువ కాలపరిమితిని ఎంచుకోవడం ద్వారా మీరు తక్కువ EMI తో ఏ ఇబ్బంది లేకుండా ఈ బైక్‌ను కొనుగోలు చేయవచ్చు.

ఇంజిన్, పనితీరు 

TVS రోనిన్‌లో 225.9 సీసీ ఇంజిన్ అందించారు. ఇది సిటీతో పాటు హైవే రెండింటిలోనూ మంచి పనితీరును చూపుతోంది. ఈ ఇంజిన్ స్మూత్ రైడింగ్ అనుభవాన్ని ఇస్తుంది. రోజువారీ వినియోగానికి కూడా చాలా ఉత్తమమైనది. బైక్ పవర్ డెలివరీ బ్యాలెన్స్‌డ్‌గా ఉంటుంది. దీనివల్ల కొత్త, పాత రైడర్లు ఎవరైనా దీనిని సులభంగా డ్రైవ్ చేయవచ్చు. 

ఆధునిక ఫీచర్లతో వచ్చిన బైక్

టీవీఎస్ రోనిన్ బైక్‌లో పూర్తి స్థాయి LED లైటింగ్ సిస్టమ్ అందించారు. దీనివల్ల రాత్రి వేళల్లో నడిపేందుకు మంచి లైటింగ్ వస్తుంది. ఇందులో పక్కనే అమర్చిన LCD ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. ఇది TVS SmartXonnect బ్లూటూత్ కనెక్టివిటీతో వస్తుంది. దీని ద్వారా మీరు కాల్స్, మెసేజ్ వివరాలను స్క్రీన్‌పైనే చూడవచ్చు. 

సేఫ్టీ విషయానికి వస్తే ఇందులో రెయిన్, 'రోడ్' అనే రెండు ABS మోడ్‌లు ఉన్నాయి. దీనితో పాటు గ్లైడ్ త్రూ టెక్నాలజీ (Glide Through Technology) లభిస్తుంది. ఇది ట్రాఫిక్‌లో బైక్ నెమ్మదిగా ముందుకు సాగడానికి హెల్ప్ అవుతుంది. ముందు భాగంలో USD ఫోర్క్స్, వెనుక వైపు మోనోషాక్ సస్పెన్షన్ అందించారు. బ్రేకింగ్ కోసం ముందు, వెనుక రెండు వైపులా డిస్క్ బ్రేక్‌లు ఇచ్చారు. ABS అనేది మీకు స్టాండర్డ్ ఫీచర్‌గా వస్తుంది.

Also Read: ప్రారంభమైన Nissan Gravite 7 సీటర్ కారు డెలివరీ.. ఫ్యామిలీ కోసం బెస్ట్ ఆప్షన్, ధర, ఫీచర్ల వివరాలు

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Tamil Nadu Politics Vijay: వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
Donald Trump: అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
ABP Desam Top 10, 18 August 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
ABP Desam Top 10, 18 August 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
Hyderabad Traffic Diversion: నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Uppal Balu Navdeep: ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
Ram Charan Irumudi: రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
Donald Trump: అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
Embed widget