అన్వేషించండి

Citroen Basalt లేదా Kia Syros .. ఇంజిన్, ఫీచర్ల పరంగా ఏ SUV బెటర్? వ్యత్యాసం ఏంటీ

Citroen Basalt Vs Kia Syros: సిట్రోయెన్ బసాల్ట్, కియా సిరోస్ రెండూ వాటి విభాగాలలో ఫేమస్ అవుతున్నాయి. ఈ రెండు SUV లలో మీకు ఏది మంచిదో ఫీచర్లు చూసి డిసైడ్ చేసుకోండి.

భారత ఆటోమొబైల్ మార్కెట్లో SUVలకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. Citroen Basalt కారు, Kia Syros కార్లు వాటి డిజైన్, ఫీచర్లు, ఇంజిన్ పనితీరుతో కస్టమర్ల ఆదరణ పొందుతున్నాయి. మీరు కొత్త SUV కొనాలని ఆలోచిస్తూ, ఈ రెండింటిలో ఒకటి ఎంచుకోవాలనుకుంటే, ఇంజిన్, ఫీచర్ల పరంగా ఏ SUV మెరుగ్గా ఉందో ఇక్కడ తెలుసుకోండి. 

ఫీచర్లలో ఏది పవర్‌ఫుల్

Citroen Basaltలో పలు ముఖ్యమైన, అవసరమైన ఫీచర్లు అందించారు. ఇందులో 10.25 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఇచ్చారు. ఇది ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లేను సపోర్ట్ చేస్తుంది. దీనితో పాటు 7 అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఇచ్చారు. సీట్లపై లెథరెట్ కవర్లు లభిస్తాయి. 470 లీటర్ల పెద్ద బూట్ స్పేస్ అందించారు. దీనివల్ల కుటుంబంతో సుదీర్ఘ ప్రయాణాలు సులభం అవుతాయి. ఇందులో LED ప్రొజెక్టర్ హెడ్ లాంప్స్, ఆటో క్లైమేట్ కంట్రోల్, రియర్ ఏసీ వెంట్స్ వంటి సదుపాయాలు ఉన్నాయి.

ఫీచర్ల పరంగా Kia Syros ఒక అడుగు ముందున్నట్లు కనిపిస్తుంది. ఇందులో 30 ఇంచెస్ పెద్ద ట్రినిటీ పనోరమిక్ డిస్‌ప్లే ప్యానెల్ ఇచ్చారు. ఇందులో నావిగేషన్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ లభిస్తాయి. ఇవే కాకుండా డ్యూయల్ పేన్ సన్‌రూఫ్, 64 రంగుల యాంబియంట్ లైటింగ్, రియర్ సీట్ రెక్లైన్, వెంటిలేటెడ్ సీట్ల వంటి ఫీచర్లు దీనిని మరింత ప్రీమియంగా మారుస్తాయి. ఫీచర్ల ఆధారంగా చూస్తే, Kia Syros మరింత మోడ్రన్, లగ్జరీ అనుభూతిని ఇస్తుంది.

ఇంజిన్, పర్ఫార్మెన్స్‌లో ఏది ముందుంది?

Citroen Basaltలో 1.2 లీటర్ల 3 సిలిండర్ల పెట్రోల్ ఇంజిన్ ఉంది. దీని మాన్యువల్ వెర్షన్‌లో 82 PS పవర్, 115 Nm టార్క్ లభిస్తుంది. ఇందులో 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఇచ్చారు. కంపెనీ ప్రకారం ఇది లీటరుకు 18 నుండి 18.7 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇస్తుంది. దీని ఆటోమేటిక్ వెర్షన్‌లో ఇదే ఇంజిన్ 110 PS పవర్, 205 Nm టార్క్‌ను అందిస్తుంది.

మరోవైపు Kia Syrosలో రెండు ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి. ఇందులో ఒక లీటరు టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది 120 PS పవర్, Nm టార్క్‌ను ఇస్తుంది. ఇది కాకుండా 1.5 లీటర్ల డీజిల్ ఇంజిన్ కూడా ఉంటుంది. దీని ద్వారా 116 PS పవర్, 250 Nm టార్క్ అందుతుంది. రెండు ఇంజిన్లలోనూ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. ఇంజిన్ ఆప్షన్లు, ఎనర్జీ విషయంలో Kia Syros మరింత బలంగా కనిపిస్తోంది.

ధరలో ఏది బెస్ట్

Citroen Basalt ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర రూ. 8.15 లక్షలు, దీని టాప్ వేరియంట్ ధర రూ. 13.11 లక్షల వరకు ఉంటుంది. అదే సమయంలో Kia Syros ప్రారంభ ధర రూ. 8.67 లక్షలు కాగా, టాప్ వేరియంట్ రూ. 15.94 లక్షల వరకు లభిస్తుంది. అంటే Basalt ధర పరంగా కొంచెం చౌకగా ఉంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

భారత్‌లో JSW నుంచి బిగ్ సర్ ప్రైజ్.. 450 కిమీ వరకు రేంజ్ ఇవ్వనున్న iCaur V23
భారత్‌లో JSW నుంచి బిగ్ సర్ ప్రైజ్.. 450 కిమీ వరకు రేంజ్ ఇవ్వనున్న iCaur V23
రూ.10 లక్షల లోపు ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌.. బలెనో, i20లో మీకు ఏది సరిపోతుందంటే?
బలెనో vs i20.. టాప్‌ వేరియంట్లలో ఏ కారు ఎక్కువ ఫీచర్లు ఇస్తుందో తెలుసా?
రూ.9 వేల కంటే తక్కువ EMIతోనే టాటా ఆల్ట్రోజ్‌ను మీ సొంతం చేసుకోవచ్చు! ఇదిగో ఈజీ ప్లాన్‌
5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ ఉన్న టాటా ఆల్ట్రోజ్‌ కొనడానికి లోన్‌ ఇస్తారా? డౌన్‌పేమెంట్‌ ఎంత కట్టాలి?
Kawasaki Z900 బైక్‌పై అదిరిపోయే డీల్‌.. వడ్డీ మినహాయింపుతో పాటు ఉచిత యాక్సెసరీస్‌!
Kawasaki Z900 కొనండి.. రూ. 1.25 లక్షల విలువైన డీల్‌ సొంతం చేసుకోండి!

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayasai Reddy: ఆ 2 కుటుంబాలతో సీమకు ప్రయోజనం లేదు.. రాయలసీమ ఒరిజనల్ రెడ్ల పౌరుషం చూపిస్తాం: విజయసాయిరెడ్డి
ఆ 2 కుటుంబాలతో సీమకు ప్రయోజనం లేదు.. రాయలసీమ ఒరిజనల్ రెడ్ల పౌరుషం చూపిస్తాం: విజయసాయిరెడ్డి
Human Trafficking Case: బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్‌కు మానవ అక్రమ రవాణా.. 9 మందికి NIA కోర్టు జీవిత ఖైదు
బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్‌కు మానవ అక్రమ రవాణా.. 9 మందికి NIA కోర్టు జీవిత ఖైదు
AP Congress : ఏపీ కాంగ్రెస్ ఆపరేషన్ రీ-ఎంట్రీ - రఘువీరారెడ్డి సారథ్యంలో హైపవర్ కమిటీ! స్థానిక పోరులో మార్పు సాధ్యమేనా?
ఏపీ కాంగ్రెస్ ఆపరేషన్ రీ-ఎంట్రీ - రఘువీరారెడ్డి సారథ్యంలో హైపవర్ కమిటీ! స్థానిక పోరులో మార్పు సాధ్యమేనా?
భారత్‌లో iPhone 18 సేల్స్ ప్రారంభం.. అర్ధరాత్రి నుంచే యాపిల్ సెంటర్ల వద్ద భారీ క్యూ లైన్లు
భారత్‌లో iPhone 18 సేల్స్ ప్రారంభం.. అర్ధరాత్రి నుంచే యాపిల్ సెంటర్ల వద్ద భారీ క్యూ లైన్లు
Irumudi OTT : థియేటర్లలో ఉండగానే ఓటీటీలోకి ఇరుముడి - 250 కోట్ల కలెక్షన్స్... ఎందుకు ఈ మూవీ చూడాలంటే?
థియేటర్లలో ఉండగానే ఓటీటీలోకి ఇరుముడి - 250 కోట్ల కలెక్షన్స్... ఎందుకు ఈ మూవీ చూడాలంటే?
Hyderabad Crime News: వనస్థలిపురంలో దారుణం.. కత్తితో నరికి పాల వ్యాపారిని హత్య చేసిన దుండగులు
వనస్థలిపురంలో దారుణం.. కత్తితో నరికి పాల వ్యాపారిని హత్య చేసిన దుండగులు
యువతకు నచ్చేలా అపాచీ, రోనిన్‌లో కొత్త టెక్నాలజీ ఫీచర్లు.. ధరలు ఎంతంటే?
యూత్‌ఫుల్‌ Apache, Ronin బైకుల్లో కొత్త వేరియంట్లు, కొత్త టెక్నాలజీ
Laptop Keyboard Cleaning : ల్యాప్‌టాప్ కీబోర్డ్ క్లీన్ చేయాలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి
ల్యాప్‌టాప్ కీబోర్డ్ క్లీన్ చేయాలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి
Embed widget