అన్వేషించండి

ప్రారంభమైన Nissan Gravite 7 సీటర్ కారు డెలివరీ.. ఫ్యామిలీ కోసం బెస్ట్ ఆప్షన్, ధర, ఫీచర్ల వివరాలు

నిస్సాన్ గ్రావిటే 7 సీటర్ కార్ డెలివరీ భారత్ వ్యాప్తంగా ప్రారంభించింది. ధర, ఫీచర్లు, ఇంజిన్, మైలేజ్ వివరాలు తెలుసుకున్నాకే కొనాలా వద్దా డిసైడ్ చేసుకోండి.

Nissan కంపెనీ తన కొత్త 7 సీటర్ కారు Gravite ని భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కారు డెలివరీ కూడా దేశవ్యాప్తంగా ప్రారంభమైంది. నిస్సాన్ గ్రావిటే కారు ప్రారంభ ధర రూ. 5.65 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా నిర్ణయించారు. ఈ కారు నాలుగు మీటర్ల కంటే తక్కువ పొడవున్న కాంపాక్ట్ MPV. ఇది Renault Triber ఫీచర్లు, డిజైన్ ఆధారంగా రూపొందించారు. అయితే ఇందులో Nissan  ప్రత్యేక గుర్తింపు కనిపిస్తుంది. తక్కువ బడ్జెట్ లో బిగ్ ఫ్యామిలీ జర్నీ కోసం ఈ కారు మంచి ఎంపిక కావచ్చు.

Nissan Gravite డిజైన్

Nissan Gravite లుక్ చాలా ఆకర్షణీయంగా, పవర్‌ఫుల్‌గా ఉంటుంది. కారు ముందు భాగంలో Nissan ప్రత్యేకమైన V-మోషన్ గ్రిల్ ఇచ్చారు. దీనితో పాటు సన్నని హెడ్‌లైట్‌లు, డే-టైమ్ రన్నింగ్ లైట్లు ఉన్నాయి. ఇవి దీనికి మోడ్రన్ లుక్ ఇస్తాయి. బోనెట్‌పై Gravite పేరు రాసి ఉంటుంది. ఇది బ్రాండ్ గుర్తింపును మరింత పటిష్టం చేస్తుంది. బంపర్‌లో సిల్వర్ రంగు డెకరేషన్, స్కిడ్ ప్లేట్ ఇచ్చారు. ఇది కొంచెం స్పోర్టీ, స్ట్రాంక్ లుక్ ఇస్తుంది. సైడ్ నుండి చూస్తే, ఇది 15-అంగుళాల కొత్త డిజైన్ అల్లాయ్ వీల్స్, రూఫ్ రైల్స్ కలిగి ఉంటుంది. వెనుక భాగంలో షార్ప్ టైల్‌లైట్స్ ఇచ్చారు. ఇవి క్రోమ్ స్ట్రిప్‌తో అనుసంధానమై ఉన్నాయి. మధ్యలో Nissan లోగో, Gravite బ్రాండింగ్ కూడా ఇచ్చారు. ఈ కారు 5 రంగులలో లభిస్తుంది. నిస్సాన్ గ్రావిటే ఫారెస్ట్ గ్రీన్, ఓనిక్స్ బ్లాక్, బ్లేడ్ సిల్వర్, మెటాలిక్ గ్రే, స్టోర్మ్ వైట్ రంగుల్లో కారు అందుబాటులోకి తెచ్చారు. 

Nissan Gravite క్యాబిన్, ఫీచర్లు

కారు లోపల ఏడుగురు సౌకర్యవంతంగా కూర్చునే సౌకర్యం ఉంది. దీని క్యాబిన్ బ్లాక్ అండ్ వైట్ రంగు థీమ్‌లో తయారు చేశారు. సీట్లపై ప్రత్యేక కుట్టు డిజైన్ మరియు మృదువైన మెటీరియల్ ఉపయోగించారు. ఇది లోపలి రూపాన్ని ప్రీమియంగా చేస్తుంది. ఇందులో కొత్త స్టీరింగ్ వీల్ ఇచ్చారు. ముందు భాగంలో 7-అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది. సెంటర్‌లో 8-అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఇచ్చారు. ఇందులో మొబైల్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ కారు కుటుంబం రోజువారీ ఉపయోగం కోసం సౌకర్యవంతంగా ఉండటంతో పాటు అద్భుతమైన ఫీచర్లతో వస్తుంది.

Nissan Gravite ఇంజిన్,  మైలేజ్

Nissan Gravite కారులో 1.0 లీటర్ 3 సిలిండర్ల పెట్రోల్ ఇంజిన్ ఇచ్చారు. ఈ ఇంజిన్ 71 హార్స్‌పవర్ శక్తిని, 96 NM టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్, AMT గేర్‌బాక్స్ ఎంపిక ఉంది. మాన్యువల్ వేరియంట్ మైలేజ్ లీటరుకు 19.3 కిమీ, AMT 19.6 కిమీ. భవిష్యత్తులో దీని CNG వెర్షన్ కూడా తీసుకురానున్నట్లు కంపెనీ తెలిపింది. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Most Selling Bikes: ప్రతినెలా అత్యధికంగా అమ్ముడవుతున్న బైక్స్.. గరిష్టంగా 70 కి.మీ మైలేజ్, వాటి ధరలిలా
ప్రతినెలా అత్యధికంగా అమ్ముడవుతున్న బైక్స్.. గరిష్టంగా 70 కి.మీ మైలేజ్, వాటి ధరలిలా
Rohit Sharma's Luxurious Car Collection: హిట్ మ్యాన్ రోహిత్ శర్మ గ్యారేజ్ లో లగ్జరీ కార్ల సందడి.. కోట్లు విలువ చేసే ఆ సూపర్ కార్ల విశేషాలివే!
హిట్ మ్యాన్ రోహిత్ శర్మ గ్యారేజ్ లో లగ్జరీ కార్ల సందడి.. కోట్లు విలువ చేసే ఆ సూపర్ కార్ల విశేషాలివే!
Best Torque Converter Automatic SUVs: ట్రాఫిక్ టెన్షన్ లేని ప్రయాణం.. రూ. 15 లక్షల లోపు బెస్ట్ ఆటోమేటిక్ ఎస్‌యూవీలు ఇవే! లాంగ్ లైఫ్, స్మూత్ డ్రైవింగ్ పక్కా!
ట్రాఫిక్ టెన్షన్ లేని ప్రయాణం.. రూ. 15 లక్షల లోపు బెస్ట్ ఆటోమేటిక్ ఎస్‌యూవీలు ఇవే! లాంగ్ లైఫ్, స్మూత్ డ్రైవింగ్ పక్కా!
600 కి.మీ రేంజ్‌తో Electric Cars.. ఆకట్టుకునే ఫీచర్లతో మార్కెట్‌లోకి రానున్న టాప్ 5 కార్లు
ఆకట్టుకునే ఫీచర్లతో పాటు 600 కి.మీ వరకు రేంజ్.. భారత మార్కెట్‌లోకి ఈ Electric Cars
Advertisement

వీడియోలు

Vaibhav Suryavanshi Angry vs KKR IPL 2026 | వైరల్ అవుతున్న వైభవ్ ఔట్
KKR vs RR IPL 2026 Highlights | వరుస ఓటములకు చెక్ పెట్టిన కేకేఆర్
LSG vs PBKS IPL 2026 Highlights | చరిత్ర సృష్టించిన పంజాబ్ కింగ్స్
IPL 2026 GT vs KKR Highlights | గుజ‌రాత్ హ్యాట్రిక్ విజ‌యం
IPL 2026 KKR vs Gujarat Titans Cameron Green Supet Six | కామెరూన్ దెబ్బకు కారుకు డెంట్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2026 MI Huge Victory VS GT: ముంబై బంప‌ర్ విక్ట‌రీ.. గుజ‌రాత్ ను ఘోరంగా చిత్తు చేసిన ఎంఐ.. తిల‌క్ సెంచ‌రీ, రాణించిన అశ్వ‌నీ కుమార్
ముంబై బంప‌ర్ విక్ట‌రీ.. గుజ‌రాత్ ను ఘోరంగా చిత్తు చేసిన ఎంఐ.. తిల‌క్ సెంచ‌రీ, రాణించిన అశ్వ‌నీ కుమార్
KCR: మొదటి సంతకంతోనే హైడ్రాను ఎత్తిపడేస్తా - వచ్చేది బీఆర్ఎస్సే - జగిత్యాల సభలో కేసీఆర్ వ్యాఖ్యలు
మొదటి సంతకంతోనే హైడ్రాను ఎత్తిపడేస్తా - వచ్చేది బీఆర్ఎస్సే - జగిత్యాల సభలో కేసీఆర్ వ్యాఖ్యలు
Chandrababu Tamil Nadu Tour: ఎన్డీఏ సీఎం ప్రమాణస్వీకారానికి వస్తా - తమిళనాడులో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ఎన్డీఏ సీఎం ప్రమాణస్వీకారానికి వస్తా - తమిళనాడులో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
AP Weather Updates: ఏపీలో వింత వాతావరణం - ఓవైపు వడగాలులు, మరోవైపు వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
ఏపీలో వింత వాతావరణం - ఓవైపు ఎండలు, మరోవైపు వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
Vijay Deverakonda: వారణాసి, రాక టైపులో... హాలీవుడ్ స్థాయిలో... విజయ్ దేవరకొండ సినిమా, జానర్ ఏమిటంటే?
వారణాసి, రాక టైపులో... హాలీవుడ్ స్థాయిలో... విజయ్ దేవరకొండ సినిమా, జానర్ ఏమిటంటే?
Venkatrami Reddy dismissed: ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి డిస్మిస్ - ప్రభుత్వ సంచలన నిర్ణయం
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి డిస్మిస్ - ప్రభుత్వ సంచలన నిర్ణయం
Om Shanthi Disco Shanthi: ఆల్రెడీ కాషన్ కియా... కొత్త సినిమాకు బోయపాటి వైరల్ డైలాగ్ వాడిన మహి వి రాఘవ్!
ఆల్రెడీ కాషన్ కియా... కొత్త సినిమాకు బోయపాటి వైరల్ డైలాగ్ వాడిన మహి వి రాఘవ్!
Iran US War: బుధవారంతో కాల్పుల విరమణ ఒప్పందం ముగింపు - చర్చలకు ఇరాన్ నో - తర్వాత ఏం జరగబోతోంది?
బుధవారంతో కాల్పుల విరమణ ఒప్పందం ముగింపు - చర్చలకు ఇరాన్ నో - తర్వాత ఏం జరగబోతోంది?
Embed widget