Telangana DGP Shivadhar reddy | తెలంగాణలో మావోయిజం ఊసులేదన్న డీజీపీ | ABP Desam
తెలంగాణలో మావో ఉద్యమం ఇక ముగిసిపోయినట్లేనని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ప్రకటించారు. మావోయిస్టు అగ్రనేతలైన దేవ్ జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, మల్లా రాజిరెడ్డి, నూనె నర్సింహారెడ్డి, బడే చొక్కారావులు లొంగిపోయారు. ఈ సందర్భంగా మాట్లాడిన డీజీపీ శివధర్ రెడ్డి..అగ్రనేతలైన మావోయిస్టుల లొంగుబాటులో తెలంగాణలో ఉద్యమశకం ముగిసిపోయిందని ప్రకటించారు. ఇక అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు అగ్రనేత ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతిని కూడా లొంగిపోవాలని కోరుతున్నామన్న డీజీపీ శివధర్ రెడ్డి...పోరు వద్దు ఊరు ముందు అంటూ తెలంగాణ పోలీసులు నిర్వహిస్తున్న క్యాంపెయిన్ గురించి మాట్లాడారు. పోరు వద్దు..ఊరు ముద్దు అనే నినాదం తో గడచిన రెండేళ్ల కాలం లో పోలీసులకు లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసం ఏర్పాటు చేయడంతో సగర్వంగా జీవిస్తున్నారు. మిగిలినవారు కూడా ఇదే బాటలో జనంలోకి రావాలని మరోసారి పిలుపునిస్తోంది పోలీసు శాఖ. వారికి ప్రభుత్వం తరుపున కావాల్సిన సాయం అందిస్తామని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు























