అన్వేషించండి

Kakinada Firecracker Blast: వేట్లపాలెం బాణసంచా పేలుడులో ఇద్దరు నిందితుల అరెస్ట్‌, 28కి చేరిన మరణాలు

Kakinada Firecracker Blast: వేట్లపాలెం బాణసంచా పేలుడు ఘటనలో ఇద్దరు నిందితుల అరెస్ట్‌ అయ్యారు. మరోవైపు ఈ ప్రమాదం మృతుల సంఖ్య 28కి చేరుకుందని అధికారులు తెలిపారు.

సామర్లకోట: కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో గత నెల 28న జరిగిన ఘోర బాణసంచా పేలుళ్ల ఘటనపై పోలీసులు చర్యలు వేగవంతం చేశారు. ఈ కేసులో ఇద్దరు ప్రధాన నిందితులను అరెస్టు చేసినట్లు కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్ వెల్లడించారు. సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ యూనిట్ నిర్వాహకులైన అడబాల అర్జున్, అతని సోదరుడు నానిలతో పాటు, ఈ ప్రమాదంలో చనిపోయిన వారి తండ్రి శ్రీనివాసరావుపై కూడా కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. నిందితుల్లో ఒకరైన అడబాల అర్జున్‌కు 15 కేజీల మందుగుండు సామగ్రితో బాణసంచా తయారు చేయడానికి ‘ఎల్ఈ1’ లైసెన్స్ ఉందని, అది 2024లో రెన్యువల్ అయ్యిందని ఎస్పీ వివరించారు. అలాగే, అతని సోదరుడు వీరబాబు (నాని)కి బాణసంచా విక్రయించుకోవడానికి ‘ఎల్ఈ5’ లైసెన్స్ ఉందని, అర్జున్ లైసెన్స్ గడువు ఈ ఏడాది మార్చి నెలాఖరుతో ముగియాల్సి ఉందని పేర్కొన్నారు.

ప్రమాదానికి కారణం.. మరణాల వివరాలు
జగ్గంపేట మండలం మల్లిశాల చింతాలమ్మ జాతర కోసం భారీగా ఆర్డర్ రావడంతో, నిందితులు అనుమతించిన పరిమితికి మించి నిల్వ చేసి బాణసంచా తయారు చేసినట్లు విచారణలో తేలింది. తయారీ సమయంలో అనుకోకుండా నిప్పురవ్వ రాజేసుకోవడంతో మధ్యాహ్నం 2:15 గంటల సమయంలో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 20 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో 8 మంది మృతి చెందారు. ప్రస్తుతం మరో ఇద్దరు ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు.

జిల్లావ్యాప్తంగా కఠిన చర్యలు:
ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన పోలీసులు జిల్లావ్యాప్తంగా తనిఖీలు చేపట్టారు. కాకినాడ జిల్లాలో ఉన్న 20 బాణసంచా తయారీ కేంద్రాలను, 8 మందుగుండు సామగ్రి సరఫరా కేంద్రాలను తక్షణమే సీజ్ చేసినట్లు ఎస్పీ బిందుమాధవ్ తెలిపారు. లైసెన్స్ నిబంధనలు అతిక్రమించినా లేదా భద్రతా ప్రమాణాలు పాటించకపోయినా ఎంతటి వారైనా సరే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించిన ప్రభుత్వం..

బాణసంచా పేలుడు మృతుల కుటుంబాలను కూటమి ప్రభుత్వం ఆదుకునేందుకు చర్యలు చేపట్టింది. మరణించిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ. 20 లక్షల భారీ ఆర్థిక సాయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. కేంద్రం ఇచ్చే రూ. 2 లక్షలతో కలిపి మొత్తం రూ. 22 లక్షలు అందుతాయి. నగదుతో పాటు, నివాసం కోల్పోయిన పేదలకు పక్కా ఇళ్లు నిర్మిస్తామని, బాధితుల పిల్లలకు రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఉచిత విద్య అందిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. బాధితులకు అన్ని విధాలా అండగా ఉంటామని సీఎం భరోసా ఇచ్చారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Petrol & Diesel Price: ఇరాన్‌తో శాంతి ఒప్పంద రద్దు చేసుకున్న ట్రంప్‌! భారత్‌పై ఎఫెక్ట్‌! పెట్రోల్, గ్యాస్ మోత తప్పదా? 
ఇరాన్‌తో శాంతి ఒప్పంద రద్దు చేసుకున్న ట్రంప్‌! భారత్‌పై ఎఫెక్ట్‌! పెట్రోల్, గ్యాస్ మోత తప్పదా? 
Hyderabad Fake Liquor Gang: యూట్యూబ్ చూసి ఇంట్లోనే మద్యం తయారీ -హైదరాబాద్‌లో ఖరీదైన బ్రాండ్ల పేరిట దందా.. ముఠా గుట్టురట్టు!
యూట్యూబ్ చూసి ఇంట్లోనే మద్యం తయారీ -హైదరాబాద్‌లో ఖరీదైన బ్రాండ్ల పేరిట దందా.. ముఠా గుట్టురట్టు!
Vizag Gold Chain Theft Case: చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!
చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!
Anantapur Crime News: జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Petrol & Diesel Price: ఇరాన్‌తో శాంతి ఒప్పంద రద్దు చేసుకున్న ట్రంప్‌! భారత్‌పై ఎఫెక్ట్‌! పెట్రోల్, గ్యాస్ మోత తప్పదా? 
ఇరాన్‌తో శాంతి ఒప్పంద రద్దు చేసుకున్న ట్రంప్‌! భారత్‌పై ఎఫెక్ట్‌! పెట్రోల్, గ్యాస్ మోత తప్పదా? 
Hyderabad Fake Liquor Gang: యూట్యూబ్ చూసి ఇంట్లోనే మద్యం తయారీ -హైదరాబాద్‌లో ఖరీదైన బ్రాండ్ల పేరిట దందా.. ముఠా గుట్టురట్టు!
యూట్యూబ్ చూసి ఇంట్లోనే మద్యం తయారీ -హైదరాబాద్‌లో ఖరీదైన బ్రాండ్ల పేరిట దందా.. ముఠా గుట్టురట్టు!
Vizag Gold Chain Theft Case: చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!
చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!
Anantapur Crime News: జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
 ICC Rankings Boost: టాప్ లోనే ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ .. ఇటీవల విఫలమైనా తగ్గని ర్యాంకింగ్స్
టాప్ లోనే ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ .. ఇటీవల విఫలమైనా నిలబెట్టుకున్న ర్యాంకులు
Avinash Narne Wife Murder: అమెరికాలో తెలుగు టెక్కీ సైకో బుద్ధి! భార్యను చంపి.. బాత్‌రూమ్‌లో బాడీ పెట్టి.. సీక్రెట్ లవర్ చాటింగ్‌తో దొరికిపోయాడు!
అమెరికాలో తెలుగు టెక్కీ సైకో బుద్ధి! భార్యను చంపి.. బాత్‌రూమ్‌లో బాడీ పెట్టి.. సీక్రెట్ లవర్ చాటింగ్‌తో దొరికిపోయాడు!
Renault Duster on EMI: 2 లక్షల రూపాయల డౌన్ పేమెంట్‌తో రెనాల్ట్ డస్టర్ కొనుగోలు చేస్తే నెలవారీ EMI ఎంత?
2 లక్షల రూపాయల డౌన్ పేమెంట్‌తో రెనాల్ట్ డస్టర్ కొనుగోలు చేస్తే నెలవారీ EMI ఎంత?
Vizag Fishermen Missing Case: విశాఖ తీరంలో గల్లంతైన ఆరుగురు గంగపుత్రులు మృతి చెందినట్టు ప్రకటన ! బాధితులకు పరిహారం అందజేసిన మంత్రి!
విశాఖ తీరంలో గల్లంతైన ఆరుగురు గంగపుత్రులు మృతి చెందినట్టు ప్రకటన ! బాధితులకు పరిహారం అందజేసిన మంత్రి!
Embed widget