అన్వేషించండి

AP Job Calendar 2026 : ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!

Nara Lokesh Review Job Calendar: ఏపీలో 10,060 పోస్టుల భర్తీకి సెప్టెంబర్ 15 నుంచి నోటిఫికేషన్లు. హోంశాఖలో 2,225 ఉద్యోగాలు. ఆగస్టు 6న క్యాబినెట్లో ఆమోదం తీసుకోనున్నారు.

AP Govt Jobs Notification September:  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు కూటమి ప్రభుత్వం సంచలన తీపి కబురు అందించింది. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న మొత్తం 10,060 ఉద్యోగాల భర్తీ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేసేందుకు కసరత్తు పూర్తి చేసింది. ఈ మేరకు ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జాబ్ క్యాలెండర్‌-2026పై మంత్రుల బృందంతో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ వర్చువల్‌గా ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించి, అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు.                                  

ప్రభుత్వం రూపొందించిన ప్రణాళిక ప్రకారం ఈ 10,060 పోస్టుల భర్తీని నాలుగు విడివిడి దశల్లో చేపట్టనున్నారు. అందులో భాగంగా ఇప్పటికే మొదటి ఫేజ్‌ కింద వివిధ విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో ఖాళీగా ఉన్న 1,523 అధ్యాపక పోస్టుల భర్తీ ప్రక్రియకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల పూర్తయినట్లు మంత్రి తెలిపారు. ఇక రెండవ విడత కింద 3,168 పోస్టుల భర్తీకి సెప్టెంబర్ 15వ తేదీన అధికారికంగా నోటిఫికేషన్లు జారీ చేయాలని సమీక్షలో నిర్ణయించారు. సాంకేతిక కారణాలు ,  రాష్ట్రపతి ఉత్తర్వుల అమల్లో మార్పుల వల్లే ఆగస్టులో రావాల్సిన రెండో దశ ప్రక్రియ సెప్టెంబర్‌కు వాయిదా పడిందని లోకేశ్ తెలిపారు. 

మూడో దశ, నాలుగో దశలకు సంబంధించిన భర్తీ ప్రక్రియను కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఒకే విడతలో ముగించేలా చర్యలు చేపట్టారు. మూడో విడతలోని 2,388 పోస్టులు , నాలుగో విడతలోని 2,981 పోస్టులు.. మొత్తంగా 5,369 ఉద్యోగాల భర్తీ కోసం అక్టోబర్ 15న ఒకేసారి నోటిఫికేషన్లు విడుదల చేయాలని మంత్రి నారా లోకేశ్ అధికారులను ఆదేశించారు. నిరుద్యోగులు ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న ప్రకటనలు వరుసగా రానుండటంతో అభ్యర్థుల్లో   ఉత్సాహం నెలకొంది.                       

ముఖ్యంగా ఈ నియామకాల్లో నిరుద్యోగ అభ్యర్థులు ఎంతగానో ఎదురుచూస్తున్న హోంశాఖ విభాగ పోస్టులకు సింహభాగం ప్రాధాన్యత లభించింది. మొత్తం ఖాళీలలో మూడో దశ కింద భర్తీ చేసే పోస్టుల నుంచే ఏకంగా 2,225 ఉద్యోగాలు హోంశాఖకు సంబంధించిన పోలీస్, కానిస్టేబుల్, ఎస్సై తదితర వర్గాలుగా ప్రభుత్వం వర్గీకరించింది. అభ్యర్థులకు ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా, ఎంపిక విధానం అత్యంత పారదర్శకంగా ఉండేలా పక్కాగా రోడ్‌మ్యాప్ సిద్ధం చేశారు.              

అన్ని శాఖలకు చెందిన పోస్టుల సమగ్ర విభజన, ఖాళీల జాబితా, రోస్టర్ పాయింట్ల తుది వివరాలను ఆగస్టు 6న జరగనున్న రాష్ట్ర మంత్రిమండలి   సమావేశం ముందుకు తీసుకెళ్లి ఆమోదం తీసుకోనున్నారు. అంతేకాకుండా, గతంలో నిర్దేశించిన గ్రూప్-1 పోస్టుల సంఖ్యను మరింత పెంచాలని, అభ్యర్థులకు ఎక్కువ అవకాశాలు దక్కేలా ఖాళీల గణన పునఃసమీక్షించాలని మంత్రి అధికారులను కోరారు. ఈ నిర్ణయంతో ఏపీలోని నిరుద్యోగుల కల సాకారమయ్యే దిశగా కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది.

టాప్ హెడ్ లైన్స్

AP Urban Local Body Elections: 92 పట్టణ స్థానిక సంస్థలకు ఆదివారం పోలింగ్.. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలు
92 పట్టణ స్థానిక సంస్థలకు ఆదివారం పోలింగ్.. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలు: AP SEC
Telangana MLC Elections: గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై కాంగ్రెస్ కసరత్తు.. రేసులో ఉన్నది వీరే!
గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై కాంగ్రెస్ కసరత్తు.. రేసులో ఉన్నది వీరే!
Andhra Pradesh Rains: ఏపీలో 3 రోజులు వర్షాలు.. బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం- ఆదివారం తుపానుగా మారే అవకాశం
ఏపీలో 3 రోజులు వర్షాలు.. బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం- ఆదివారం తుపానుగా మారే అవకాశం
Iam Game Movie OTT : ఓటీటీలోకి వచ్చేస్తోన్న దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి వచ్చేస్తోన్న దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్... ఎందులో చూడొచ్చంటే?

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Urban Local Body Elections: 92 పట్టణ స్థానిక సంస్థలకు ఆదివారం పోలింగ్.. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలు
92 పట్టణ స్థానిక సంస్థలకు ఆదివారం పోలింగ్.. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలు: AP SEC
Telangana MLC Elections: గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై కాంగ్రెస్ కసరత్తు.. రేసులో ఉన్నది వీరే!
గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై కాంగ్రెస్ కసరత్తు.. రేసులో ఉన్నది వీరే!
Andhra Pradesh Rains: ఏపీలో 3 రోజులు వర్షాలు.. బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం- ఆదివారం తుపానుగా మారే అవకాశం
ఏపీలో 3 రోజులు వర్షాలు.. బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం- ఆదివారం తుపానుగా మారే అవకాశం
Iam Game Movie OTT : ఓటీటీలోకి వచ్చేస్తోన్న దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి వచ్చేస్తోన్న దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్... ఎందులో చూడొచ్చంటే?
iPhone 17 Pro Offer: ఆపిల్ దీపావళి ధమాకా.. రూ. 55 వేలకే ఐఫోన్ 17 Pro మీ సొంతం
ఆపిల్ దీపావళి ధమాకా.. రూ. 55 వేలకే ఐఫోన్ 17 Pro మీ సొంతం
CM Chandrababu: వాడికి సమాజంలో చోటు లేదు.. కన్నెత్తి చూడాలంటే భయపడాలి: రాప్తాడు ఘటనపై చంద్రబాబు, లోకేష్ ఫైర్
వాడికి సమాజంలో చోటు లేదు.. కన్నెత్తి చూడాలంటే భయపడాలి: రాప్తాడు ఘటనపై చంద్రబాబు, లోకేష్ ఫైర్
YS Sharmila Daughter Marriage: ఆస్తుల పంపకాల్లో యలహంక ప్రాపర్టీ నాకు వచ్చింది: షర్మిల సంచలన పోస్ట్
ఆస్తుల పంపకాల్లో యలహంక ప్రాపర్టీ నాకు వచ్చింది: షర్మిల సంచలన పోస్ట్
Hero Destini 110 Classique ఎడిషన్ లాంచ్‌.. కొత్త కలర్ ఆప్షన్లు, డ్యూయల్ టోన్ స్టైలింగ్‌తో రోడ్డుపై రచ్చే!
హీరో డెస్టినీ 110 కొనేవాళ్లకు మరో స్టైలిష్‌ ఆప్షన్‌.. రూ.76,400 ధరతో క్లాసిక్ ఎడిషన్ లాంచ్
Embed widget