అన్వేషించండి

Kakinada Fireworks Explosion: వేట్లపాలెం ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.20 లక్షలు, పక్కా ఇళ్లు- నలుగురు అధికారులపై వేటు!

Vetlapalem Fireworks Explosion | కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలోని బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన పేలుడు ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు సీఎం చంద్రబాబు రూ.20 లక్షల పరిహారం ప్రకటించారు.

Kakinada Fireworks Explosion | సామర్లకోట: కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో జరిగిన బాణసంచా ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో 20 మంది చనిపోగా, బాధితులకు ఏపీ ప్రభుత్వం అండగా నిలిచింది. అదే సమయంలో ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్న సీఎం చంద్రబాబు, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు చేపట్టారు. ఈ మేరకు నలుగురు అధికారులు ఆర్డీఓ, డీఎస్పీ, డిస్టిక్ లేబర్ ఆఫీసర్, ఫైర్ ఆఫీసర్ ను సస్పెండ్ తక్షణమే సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా కఠినమైన నిబంధనలు అమలు చేయాలని యంత్రాంగాన్ని హెచ్చరించారు. కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించిన ఆయన, బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మృతుల్లో అత్యధికులు రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేద కూలీలు, మహిళలు ఉండటంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

మృతుల కుటుంబాలకు 20 లక్షల పరిహారం
బాధిత కుటుంబాలను ఆదుకునే విషయంలో కూటమి ప్రభుత్వం మానవతా దృక్పథాన్ని చాటుకుంది. బాణసంచా పేలుడు ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒక్కొక్కరికి రూ. 20 లక్షల భారీ ఆర్థిక సాయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఇది కేంద్ర ప్రభుత్వం అందించే రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియాకు అదనమని ఆయన స్పష్టం చేశారు. అంటే బాధితులకు మొత్తం రూ. 22 లక్షల ఆర్థిక సాయం అందనుంది. కేవలం నగదు సాయమే కాకుండా, ఈ ప్రమాదంలో సర్వం కోల్పోయిన వారికి, ఇళ్లు లేని పేద కుటుంబాలకు ప్రభుత్వం తరపున పక్కా గృహాలను నిర్మించి ఇస్తామని.. చదువుకునే పిల్లలకు రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఉచిత విద్యను అందిస్తామని హామీ ఇచ్చారు.


Kakinada Fireworks Explosion: వేట్లపాలెం ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.20 లక్షలు, పక్కా ఇళ్లు- నలుగురు అధికారులపై వేటు!

గాయపడిన వారికి అత్యుత్తమ వైద్య సదుపాయాలు అందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. బాధితులు కోలుకునే వరకు ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని, అవసరమైతే మెరుగైన చికిత్స కోసం ఇతర ప్రాంతాలకు తరలించాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా బాణసంచా తయారీ కేంద్రాలు నడిపేవారిపై ఉక్కుపాదం మోపాలని, ఇకపై రాష్ట్రంలో ఎక్కడా అనుమతులు లేని పేలుడు పదార్థాల తయారీ కేంద్రాలు ఉండకూడదని ఆయన స్పష్టమైన సంకేతాలు పంపారు.


Kakinada Fireworks Explosion: వేట్లపాలెం ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.20 లక్షలు, పక్కా ఇళ్లు- నలుగురు అధికారులపై వేటు!

నిర్వాహకుల ఆస్తులు జప్తు చేసి, బాధితుల కుటుంబాలకు పంచుతాం..
నిబంధనల ప్రకారం పర్మిషన్ తో వీటిని నడపాలని, నిర్వాహకుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడని అతడు ఎక్కడున్నా అరెస్ట్ చేసి తీసుకొస్తాం అన్నారు. నిర్వాహకుల ఆస్తులు జప్తు చేసి, ప్రభుత్వం వాటిని వేలం వేసి బాధితుల కుటుంబాలకు ఆర్థిక సహకారం అందేలా చేస్తామని చంద్రబాబు అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించి, చర్యలు తీసుకోవాలని సూచించారు.


Kakinada Fireworks Explosion: వేట్లపాలెం ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.20 లక్షలు, పక్కా ఇళ్లు- నలుగురు అధికారులపై వేటు!

పర్మిషన్ లేకుండా నిర్వహిస్తున్న ఫైర్ క్రాకర్ కేంద్రాలను తనిఖీలలో ఎందుకు గుర్తించలేకపోతున్నారు, అందుకు గల కారణాలపై పూర్తి స్థాయిలో విచారణ చేపడతామన్నారు. గతంలో ఓ ఘటన జరిగింది, దానిపై ఎంక్వైరీ వేశామన్నారు. పొట్టకూటి కోసం వచ్చిన నిరుపేదలు ఇలా వేరే వాళ్లు చేసిన తప్పులకు బలికావడం సరికాదని, వారికి ఉపాధి హామీ లాంటి పథకాలు వినియోగించుకోవాలని చంద్రబాబు సూచించారు.


Kakinada Fireworks Explosion: వేట్లపాలెం ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.20 లక్షలు, పక్కా ఇళ్లు- నలుగురు అధికారులపై వేటు!

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Road Accidents: పశ్చిమ గోదావరి జిల్లాలో కాల్వలోకి దూసుకెళ్లిన కారు- నలుగురు యువకులు గల్లంతు
Road Accidents: పశ్చిమ గోదావరి జిల్లాలో కాల్వలోకి దూసుకెళ్లిన కారు- నలుగురు యువకులు గల్లంతు
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Padikkal Permanent Slot: సాయి సుదర్శన్ వచ్చినా పడిక్కల్ కే నంబర్ 3 ప్లేస్.. అతనిలో అద్భుత నైపుణ్యముంది.. మాజీ క్రికెట‌ర్ ప్రశంసలు!
సాయి సుదర్శన్ వచ్చినా పడిక్కల్ కే నంబర్ 3 ప్లేస్.. అతనిలో అద్భుత నైపుణ్యముంది.. మాజీ క్రికెట‌ర్ ప్రశంసలు!
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
సింగిల్‌ ఛార్జ్‌తో హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్లొచ్చు - Avore EX2 ధర, బ్యాటరీ, ఫీచర్లపై పూర్తి వివరాలు!
సింగిల్‌ ఛార్జ్‌తో ఏకంగా 255km ప్రయాణం.. Avore EX2 కొనే ముందు ఈ 5 విషయాలు తెలుసుకోండి!
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
Embed widget