అన్వేషించండి

Poor Sleep and Stress : ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి

Stress and Sleep Habits in Urban Life : నగరాల్లో నివసించే వారిలో ఒత్తిడి వల్ల నిద్రపై తీవ్రమైన ప్రభావం పడుతుందని చెప్తున్నారు నిపుణులు. దీనికి కారణాలు ఏంటో.. వాటిని ఎలా తగ్గించుకోవాలో చూసేద్దాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • నగర జీవనశైలితో యువతలో ఒత్తిడి, నిద్రలేమి సమస్యలు పెరుగుతున్నాయి.
  • నిద్ర సరిపోకపోతే ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది.
  • స్క్రీన్‌కు దూరం, వ్యాయామం, ధ్యానంతో మంచి నిద్ర పొందవచ్చు.
  • నిరంతర నిద్రలేమి, గురక ఉంటే వైద్య సహాయం తప్పక అవసరం.

Urban Stress and Poor Sleep : నగర జీవనశైలి వేగంగా మారుతున్న కొద్దీ యువతలో ఒత్తిడి, నిద్రలేమి సమస్యలు కూడా పెరుగుతున్నాయి. ఎక్కువసేపు పని చేయడం, ట్రాఫిక్‌లో గంటల తరబడి గడపడం, భోజన సమయాలు లేకపోవడం, మొబైల్, ల్యాప్‌టాప్ వంటి స్క్రీన్‌లను ఎక్కువసేపు ఉపయోగించడం, ఎప్పుడూ అందుబాటులో ఉండాలనే ఒత్తిడి వంటి కారణాల వల్ల చాలామందికి సరైన విశ్రాంతి దొరకడం లేదు. 

ఇవన్నీ శారీరక, మానసిక ఆరోగ్యంపై ఒత్తిడిని కలిగిస్తాయని యశోద హాస్పిటల్స్, హైదరాబాద్‌కు చెందిన కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ భరత్ కుమార్ సూరిశెట్టి తెలిపారు. నిద్ర ఎందుకు ముఖ్యమో.. నిద్ర సరిపోకపోతే ఎలాంటి సమస్యలు వస్తాయో.. ఒత్తిడిని తగ్గించుకుని నిద్రకోసం ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో పలు సూచనలు ఇచ్చారు.  

Also Read : డయాబెటిస్ మందులతో మాత్రమే కాదు.. ఈ అలవాట్లు కూడా పాటిస్తేనే షుగర్ అదుపులో ఉంటుందట, డాక్టర్ల సూచనలు ఇవే

నిద్ర ఎందుకు ముఖ్యమంటే..

నిద్ర అనేది కేవలం విశ్రాంతి తీసుకునే సమయం మాత్రమే కాదు. ఈ సమయంలోనే మెదడు, శరీరం రోజంతా జరిగిన అలసట నుంచి కోలుకుంటాయి. ఓ రకంగా నిద్ర అనేది బాడీకి రీసెట్ బటన్. అందుకే ప్రతి రోజూ 7 నుంచి 9 గంటల నాణ్యమైన నిద్ర అవసరం.

నిద్ర సరిపోకపోతే..

నిద్ర సరిపోకపోతే లేదా ఎక్కువకాలం నిద్ర లేకుండా ఉండడం వల్ల ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు, ఆందోళన, డిప్రెషన్, రోగనిరోధక శక్తి తగ్గడం వంటి సమస్యల ప్రమాదం పెరిగే అవకాశం ఉందని డాక్టర్ భరత్ కుమార్ సూరిశెట్టి చెబుతున్నారు.

ఒత్తిడి వల్ల నిద్ర దెబ్బతింటోందని చెప్పే సంకేతాలు ఇవే

కొన్ని లక్షణాలు కనిపిస్తే మీ శరీరంపై ఒత్తిడి ఉందని.. అది నిద్రపై ప్రభావం చూపుతున్నట్లు అర్థమని అంటున్నారు. అవేంటంటే.. నిద్ర పట్టడానికి ఎక్కువ సమయం పట్టడం, రాత్రిపూట పలుమార్లు మెలకువ రావడం, తగినంత నిద్రపోయినా అలసటగా అనిపించడం, ఉదయం లేవగానే తలనొప్పి రావడం, ఏకాగ్రత, జ్ఞాపకశక్తి తగ్గడం, చిరాకు, మూడ్ మారడం, పనిలో ఉత్పాదకత తగ్గడం వంటివి జరుగుతాయి.

Also Read : PCOS ఉంటే ఐరన్ తగ్గిపోతుందా? రెండింటి మధ్య సంబంధం ఏంటి? గైనకాలజిస్ట్ సూచనలివే

ఒత్తిడి తగ్గి మంచి నిద్ర రావాలంటే..

జీవనశైలిలో చిన్నచిన్న మార్పులు చేస్తే ఒత్తిడిని తగ్గించుకోవడంతో పాటు నిద్ర నాణ్యతను కూడా మెరుగుపరుచుకోవచ్చని డాక్టర్ భరత్ కుమార్ పలు టిప్స్ సూచించారు. వారాంతాల్లో కూడా వీలైనంత వరకు ఒకే సమయానికి నిద్రపోవడం, లేవడం వల్ల శరీరంలోని బయోలాజికల్ క్లాక్ సక్రమంగా పనిచేస్తుందని తెలిపారు. పడుకునే ముందు కాఫీ, టీ, సిగరెట్, భారీ భోజనం తీసుకోవద్దని అవి నిద్రకు ఆటంకం కలిగిస్తాయని అంటున్నారు. 

మొబైల్, టీవీ, ల్యాప్‌టాప్‌ల నుంచి వచ్చే బ్లూ లైట్ వల్ల నిద్రకు అవసరమైన మెలటోనిన్ హార్మోన్ విడుదల ఆలస్యమవుతుంది. అందుకే నిద్రకు కనీసం గంట ముందు స్క్రీన్ వినియోగాన్ని ఆపేయడం మంచిది. నడక, యోగా, సైక్లింగ్ వంటి వ్యాయామాలు ఒత్తిడిని తగ్గిస్తాయి. అయితే పడుకునే సమయానికి దగ్గరగా తీవ్రమైన వ్యాయామాలు చేయకుండా ఉండటం మంచిది. డీప్ బ్రీతింగ్, ధ్యానం, యోగా కూడా ఒత్తిడిని తగ్గించి నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తాయి. గదిని కూడా ప్రశాంతంగా, చీకటిగా, చల్లగా ఉండేలా చూసుకోవాలి. శబ్దం, ఎక్కువ వెలుతురు లేకుండా ఉండటం వల్ల నిద్రకు అంతరాయం ఉండదని చెప్తున్నారు. 

వైద్య సహాయం ఎప్పుడు తీసుకోవాలంటే.. 

మీకు కొన్ని వారాలుగా నిద్రలేక పోయినా.. గట్టిగా గురక పెట్టడం, నిద్రలో శ్వాస ఆగిపోవడం, పగటి సమయంలో ఎక్కువగా నిద్ర రావడం, తీవ్రమైన ఆందోళన లేదా డిప్రెషన్ లక్షణాలు కనిపించడం గుర్తిస్తే కచ్చితంగా వైద్య సహాయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వారు అవసరమైన టెస్ట్లు చేసి, కారణాన్ని గుర్తించి తగిన చికిత్స తీసుకోవడం మంచిదంటున్నారు.

Also Read : మంచి నిద్ర కావాలంటే నైట్ రొటీన్ ఇలా సెట్ చేసుకోండి.. వైద్యులు సూచించే సింపుల్ అలవాట్లు ఇవే

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breastfeeding Diet : తల్లిపాలు ఇచ్చే సమయంలో అతిగా తినకూడదా? డైట్‌లో చేర్చుకోవాల్సిన, తీసేయాల్సిన ఫుడ్స్ ఇవే
తల్లిపాలు ఇచ్చే సమయంలో అతిగా తినకూడదా? డైట్‌లో చేర్చుకోవాల్సిన, తీసేయాల్సిన ఫుడ్స్ ఇవే
Wearing Slippers at Home : ఇంట్లో చెప్పులు వేసుకుని నడవాలా? లేక చెప్పులు లేకుండా నడవాలా? ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా?
ఇంట్లో చెప్పులు వేసుకుని నడవాలా? లేక చెప్పులు లేకుండా నడవాలా? ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా?
High Uric Acid : యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణాలివే.. సమస్యను తగ్గించుకోవాలంటే ఈ ఫుడ్స్ తింటూ ఈ పనులు చేయాలట
యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణాలివే.. సమస్యను తగ్గించుకోవాలంటే ఈ ఫుడ్స్ తింటూ ఈ పనులు చేయాలట
Cheating in Relationships : చీటింగ్ చేయడంలో మగవారు, ఆడవారికి మధ్య తేడాలు ఉంటాయా? వివాహేతర సంబంధాలకి కారణాలు ఇవే
చీటింగ్ చేయడంలో మగవారు, ఆడవారికి మధ్య తేడాలు ఉంటాయా? వివాహేతర సంబంధాలకి కారణాలు ఇవే
Advertisement

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Cabinet Expansion 2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
The Story of Vizag Old Airport : విశాఖ నుంచి చివరి కమర్శియల్ ఫ్లైట్ -
విశాఖ నుంచి చివరి కమర్శియల్ ఫ్లైట్ - "INS డేగ" ఇక జ్ఞాపకమేనా !!
Supreme Court On Vehicle Insurance:బీమా లేని వాహనాలకు పెట్రోల్‌ బంకుల్లో నో పెట్రోల్‌, భారీ జరిమానాలు! కేంద్రానికి సుప్రీంకోర్టు సంచలన ప్రతిపాదన!
బీమా లేని వాహనాలకు పెట్రోల్‌ బంకుల్లో నో పెట్రోల్‌, భారీ జరిమానాలు! కేంద్రానికి సుప్రీంకోర్టు సంచలన ప్రతిపాదన!
Udhayanidhi Stalin: నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
Telangana Police Vehicle Rapido: పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
మయామి 'లాంజెవిటీ' పెంట్‌హౌస్: ఆయుష్షును పెంచుతుందా? వాస్తు ఏం చెబుతోంది?
మయామి 'లాంజెవిటీ' పెంట్‌హౌస్: ఆయుష్షును పెంచుతుందా? వాస్తు ఏం చెబుతోంది?
Khanapur MLA Wedma Bojju: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
AP High Court Rejects CBI Probe on Mega DSC: మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
Embed widget