అన్వేషించండి

Breastfeeding Diet : తల్లిపాలు ఇచ్చే సమయంలో అతిగా తినకూడదా? డైట్‌లో చేర్చుకోవాల్సిన, తీసేయాల్సిన ఫుడ్స్ ఇవే

Breastfeeding : తల్లిపాలు ఇచ్చే సమయంలో తను తీసుకునే ఆహారం బిడ్డకు ఎఫెక్ట్ చేస్తుందేమోనని తెగ ఆలోచిస్తుంది. మరి ఈ సమయంలో ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలో.. వేటికి దూరంగా ఉండాలో చూసేద్దాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • పాలిచ్చే తల్లులు సమతుల్య ఆహారం తీసుకోవడం ముఖ్యం, అతిగా కాదు.
  • ప్రోటీన్లు, ఆకుకూరలు, పండ్లు, తృణధాన్యాలు, నీరు డైట్‌లో ఉండాలి.
  • చక్కెర, కొవ్వులు, కెఫిన్ ఉన్నవి తగ్గించడం బిడ్డకు మేలు.
  • బిడ్డకు అలర్జీ ఉంటేనే ఆహారాలు మానేసి, వైద్యుడిని సంప్రదించండి.

Foods to Eat For Breastfeeding Diet : బిడ్డకు తల్లిపాలు ఇస్తున్న సమయంలో తల్లి తీసుకునే ఆహారం చాలా ముఖ్యమని చెప్తున్నారు వైద్యులు. ఈ సమయంలో శరీరానికి అదనపు శక్తి, ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు అవసరమవుతాయి. అయితే ఇద్దరికీ సరిపడా తినాలి అనే మాట పట్టుకుని ఎక్కువగా తినాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. తల్లి ఆరోగ్యానికి, పాలిచ్చే ప్రక్రియకు అవసరమైన పోషకాలు అందేలా సమతుల్య ఆహారం తీసుకోవడం ముఖ్యమంటూ ఫుడ్ విషయంలో పలు సూచనలు ఇస్తున్నారు. 

తల్లిపాలు ఇచ్చే సమయంలో బిడ్డకు కూడా సరిపోవాలని పోషకాలు ఎలా తీసుకుంటారో.. అలాగే కొన్ని ఫుడ్స్ మీ డైట్ నుంచి దూరం చేయాలి. అలా అని డైట్‌ నుంచి కొన్ని పూర్తిగా తొలగించడం కూడా సరైన పద్ధతి కాదని చెప్తున్నారు. ఇంతకీ బిడ్డకి పాలు ఇచ్చే తల్లి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో.. ఏ ఫుడ్స్ దూరంగా ఉంచడం మంచిదో ఇప్పుడు తెలసుకుందాం. 

Also Read : బిడ్డకు తల్లిపాలు ఎందుకు ముఖ్యం? పుట్టిన గంటలోపే ఎందుకు ఇవ్వాలి? లాభాలు, పోషకాలు ఇవే

పాలు ఇచ్చే తల్లులు డైట్‌లో చేర్చుకోవాల్సిన ఫుడ్స్

తల్లిపాలు ఇస్తోన్న సమయంలో పప్పులు, కందులు, శనగలు, రాజ్మా, గుడ్లు, చేపలు, చికెన్, పెరుగు, పాలు వంటి ప్రోటీన్ ఫుడ్స్ సమతుల్య ఆహారంలో చేర్చుకోవాలి. వీటి ద్వారా వచ్చే ప్రోటీన్ శరీర కణజాలాల మరమ్మతు, కండరాల ఆరోగ్యానికి తోడ్పడుతుంది. అలాగే పాలకూర, మెంతికూర వంటి ఆకుకూరలతో పాటు క్యారెట్, బీట్‌రూట్, సొరకాయ, బీరకాయ, క్యాప్సికం వంటి వివిధ రకాల కూరగాయలను ఆహారంలో చేర్చుకోవాలి. ఇవి విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ అందిస్తాయి.

ఆపిల్, అరటి, నారింజ, బొప్పాయి, జామ, దానిమ్మ వంటి పండ్లను రోజువారీ ఆహారంలో చేర్చుకోవచ్చు. పండ్ల ద్వారా ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు తల్లికి.. అమ్మ నుంచి పిల్లలకు పాలు ద్వారా లభిస్తాయి. బ్రౌన్ రైస్, ఓట్స్, రాగి, జొన్నలు, సజ్జలు, గోధుమ వంటివి శక్తిని అందించడంతో పాటు ఫైబర్‌ను కూడా అందిస్తాయి. నట్స్, విత్తనాలు, అవకాడో, చేపలు వంటి ఆహారాల్లో ఉండే హెల్తీ ఫ్యాట్స్ కూడా మేలు చేస్తాయి. తగినంత నీరు, సూప్‌లు, మజ్జిగ వంటి డ్రింక్స్ కూడా తీసుకోవచ్చు.

Also Read : వర్షాకాలంలో పిల్లల ఇమ్యూనిటీని పెంచే ఆహారాలు ఇవే.. ఆరోగ్యంగా ఉండాలంటే తప్పకుండా కిడ్స్ డైట్‌లో చేర్చండి

ఏ ఆహారాలను తగ్గిస్తే మంచిదంటే.. 

కేకులు, స్వీట్లు, కుకీలు, చాక్లెట్లు, చక్కెర ఎక్కువగా ఉండే డ్రింక్స్ ఎక్కువగా తీసుకోకుండా పరిమితం చేయడం మంచిది. ఇవి ఎక్కువ క్యాలరీలు అందించినా వాటిలో అవసరమైన పోషకాలు తక్కువగా ఉంటాయి. చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, ప్యాకెట్ స్నాక్స్, ఫాస్ట్ ఫుడ్ వంటి వాటిలో ఉప్పు, చక్కెర, అనారోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాఫీ, టీ, ఎనర్జీ డ్రింక్స్, కొన్ని శీతల పానీయాల్లో కెఫీన్ ఉంటుంది. అధికంగా బిడ్డకు చిరాకుగా ఉండి.. నిద్రకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. 

డైట్ నుంచి పూర్తిగా మానేయాల్సిన ఫుడ్స్..

తల్లిపాలు ఇస్తున్న సమయంలో కొన్ని ఆహారాలు బిడ్డకు గ్యాస్ లేదా అలర్జీ కలిగిస్తాయని భావించి చాలామంది తల్లులు పాలు, పెరుగు, పప్పులు, కూరగాయలు వంటి అనేక ఆహారాలను స్వయంగా మానేస్తారు. అలా చేయడం వల్ల తల్లికి అవసరమైన పోషకాలు తగ్గే అవకాశం ఉంది. కాబట్టి తల్లి ఏ ఆహారాన్ని అయినా తగిన మోతాదులో తీసుకోవచ్చు. బేబికి దద్దుర్లు, వాంతులు, విరేచనాలు, రక్తంతో కూడిన మలం, తీవ్రమైన చిరాకు వంటి లక్షణాలు కనిపిస్తే మాత్రం పిల్లల వైద్యుడిని సంప్రదించాలి.

Also Read : పిల్లల్లో ఆస్తమాకు కారణాలు, లక్షణాలు ఇవే.. ఇన్​హేలర్ ఉపయోగిస్తే మంచిదా? కాదా? వైద్యుల సూచనలివే

అతిగా తినడం మాత్రం వద్దు..

తల్లిపాలు ఇవ్వడానికి అదనపు శక్తి అవసరమైనప్పటికీ.. దాని అర్థం అవసరానికి మించి తినాలని కాదని సూచిస్తున్నారు నిపుణులు. ఎక్కువ క్యాలరీలు తీసుకోవడం వల్ల ప్రసవం తర్వాత బరువు తగ్గడం కష్టమవుతుందని అంటున్నారు. బదులుగా రోజులో మూడు మీల్స్ చేస్తూ.. పోషకాలతో కూడిన హెల్తీ స్నాక్స్ తీసుకోవడం మంచిదని చెప్తున్నారు. 

పిల్లల ఆరోగ్యం, హెల్త్ టిప్స్ గురించిన ఇంట్రెస్టింగ్ వార్తల కోసం దీనిని క్లిక్ చేయండి.

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breastfeeding Diet : తల్లిపాలు ఇచ్చే సమయంలో అతిగా తినకూడదా? డైట్‌లో చేర్చుకోవాల్సిన, తీసేయాల్సిన ఫుడ్స్ ఇవే
తల్లిపాలు ఇచ్చే సమయంలో అతిగా తినకూడదా? డైట్‌లో చేర్చుకోవాల్సిన, తీసేయాల్సిన ఫుడ్స్ ఇవే
Wearing Slippers at Home : ఇంట్లో చెప్పులు వేసుకుని నడవాలా? లేక చెప్పులు లేకుండా నడవాలా? ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా?
ఇంట్లో చెప్పులు వేసుకుని నడవాలా? లేక చెప్పులు లేకుండా నడవాలా? ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా?
High Uric Acid : యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణాలివే.. సమస్యను తగ్గించుకోవాలంటే ఈ ఫుడ్స్ తింటూ ఈ పనులు చేయాలట
యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణాలివే.. సమస్యను తగ్గించుకోవాలంటే ఈ ఫుడ్స్ తింటూ ఈ పనులు చేయాలట
Cheating in Relationships : చీటింగ్ చేయడంలో మగవారు, ఆడవారికి మధ్య తేడాలు ఉంటాయా? వివాహేతర సంబంధాలకి కారణాలు ఇవే
చీటింగ్ చేయడంలో మగవారు, ఆడవారికి మధ్య తేడాలు ఉంటాయా? వివాహేతర సంబంధాలకి కారణాలు ఇవే
Advertisement

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Khanapur MLA Wedma Bojju: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
AP High Court Rejects CBI Probe on Mega DSC: మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
Harish Rao Black Magic Row: క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
Crop Insurance Scheme: రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
Udhayanidhi Stalin Bail: త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
Utnoor Gond Fort: ఎకో టూరిజం కేంద్రంగా గోండు రాజుల చారిత్రాత్మక కోట అభివృద్ధి
ఎకో టూరిజం కేంద్రంగా గోండు రాజుల చారిత్రాత్మక కోట అభివృద్ధి
ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi
ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi
Loan Trap: చదువుకు 4 లక్షలు, పెళ్లికి 10 లక్షలు.. అప్పుల ఊబితో తప్పని చిక్కులు- పరిష్కార మార్గాలివే
చదువుకు 4 లక్షలు, పెళ్లికి 10 లక్షలు.. Loan Trapతో తప్పని చిక్కులు- పరిష్కార మార్గాలివే
Embed widget