విటమిన్ B12 లోపం ప్రమాదకరమైన లక్షణాలు ఇవే.. జాగ్రత్త

Published by: Geddam Vijaya Madhuri

చేతులు, కాళ్లలో జలదరింపు లేదా తిమ్మిరి అనుభూతి నిరంతరం ఉంటుంది.

తరచుగా తలతిరగడం, బలహీనత కూడా B12 లోపాన్ని సూచిస్తుంది.

చర్మం పసుపు రంగులోకి మారడం లేదా పాలిపోవడం కూడా ఒక సంకేతమే.

జ్ఞాపకశక్తి బలహీనపడటం, ఏకాగ్రతలో ఇబ్బంది కలగడం జరుగుతుంది.

నాలుకపై మంట ఎరుపుదనం, తరచుగా నొప్పి రావచ్చు.

నడుస్తున్నప్పుడు శరీర సమతుల్యతను కాపాడుకోవడంలో ఇబ్బంది పడాల్సి వస్తుంది.

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా గుండె దడ ఉంటుంది.

దీర్ఘకాలిక B12 లోపం నరాలకు నష్టం కలిగిస్తుంది.

లక్షణాలు కనిపించగానే డాక్టర్ సలహా తీసుకుని కచ్చితంగా చికిత్స చేయించుకోవాలి.