అన్వేషించండి

Overthinking : అతిగా ఆలోచించి సతమతమవుతున్నారా? ఓవర్‌థింకింగ్‌ను తగ్గించే 3 సులభమైన మార్గాలు ఇవే

Tips for Better Mental Health : మీరు చిన్న విషయాన్ని కూడా అతిగా ఆలోచిస్తున్నారా? ఓవర్ థింకింగ్ తగ్గించుకోవాలంటే సైక్రియాట్రిస్ట్ ఇస్తోన్న టాప్ 3 టిప్స్ ఇక్కడ ఉన్నాయి. మంచి ఫలితాల కోసం ఫాలో అయిపోండి.

Stop Overthinking in 3 Simple Steps : ఈ రోజుల్లో వేగవంతమైన జీవనశైలి కారణంగా చాలామంది ఓవర్‌థింకింగ్(Overthinking) సమస్యతో బాధపడుతున్నారు. చిన్న విషయాన్ని కూడా పదేపదే ఆలోచించడం, భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆందోళన చెందడం, జరిగిన సంఘటనలనే మళ్లీ మళ్లీ గుర్తు చేసుకోవడం వంటి అలవాట్లు మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. దీనివల్ల నిద్ర సమస్యలు, ఒత్తిడి, ఆందోళన, పనిపై ఏకాగ్రత తగ్గడం వంటి సమస్యలు తలెత్తుతాయి.

అయితే ఆలోచించడం పూర్తిగా ఆపేయడం లక్ష్యం కాదని.. అవసరం లేని, ఉపయోగం లేని ఆలోచనలు మనసుపై ఆధిపత్యం చెలాయించకుండా నియంత్రించడం ముఖ్యమని యశోద హాస్పిటల్స్, హైదరాబాద్‌కు చెందిన సీనియర్ కన్సల్టెంట్ సైక్రియాట్రిస్ట్ డాక్టర్ కె. నవీన్ కుమార్ సూచిస్తున్నారు. దీనిలో భాగంగా మూడు చిట్కాలతో ఓవర్‌థింకింగ్ సమస్యను ఓవర్​కామ్ చేయవచ్చని చెప్తున్నారు. అవేంటంటే..

Also Read : రోజూ యోగా చేస్తే శారీరక, మానసిక ఆరోగ్యానికి కలిగే లాభాలు ఇవే.. మగవారికి, ఆడవారికి ఈ ప్రయోజనాలు అందుతాయి

ఆలోచనలు గుర్తించడం..

ఓవర్‌థింకింగ్‌ను తగ్గించడంలో మొదటి అడుగు.. మీరు అతిగా ఆలోచిస్తున్నారని గుర్తించడమే. మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారో లేదో తెలుసుకునేందుకు కొన్ని ప్రశ్నలను మీకు మీరు వేసుకోవాలని సూచించారు.

  • నేను ఆలోచిస్తున్నది నిజంగా సమస్యకు పరిష్కారం చూపుతోందా?
  • అదే విషయాన్ని మళ్లీ మళ్లీ ఆలోచిస్తూ సమయం వృథా చేస్తున్నానా?
  • ఈ ఆలోచనలకు కారణం భయమా, ఒత్తిడా, అపరాధ భావనా, చేతకానీ తనమా?

అని ఆలోచించుకోవాలి. ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవడం ద్వారా సమస్యను ప్రశాంతంగా ఎదుర్కొనే అవకాశం ఉంటుందని డాక్టర్ నవీన్ కుమార్ తెలిపారు.

ప్రజెంట్​పై ఫోకస్ చేయండి

ఓవర్‌థింకింగ్ ఎక్కువగా మన చేతుల్లో లేని విషయాల గురించే ఉంటుంది. అలాంటి సమయంలో మనసును ప్రస్తుత క్షణంపైకి తీసుకురావాలి. దీనికోసం.. కొన్ని నిమిషాలు నెమ్మదిగా, గాఢంగా శ్వాస తీసుకోండి. కొద్దిసేపు నడవండి. సంగీతం వినండి. పుస్తకం చదవండి. వంట చేయండి. వ్యాయామం చేయండి. లేదా మీకు ఇష్టమైన హాబీలతో సమయం గడపండి.

Also Read : మంచి నిద్రతో పాటు మానసిక ఆరోగ్యం కూడా కావాలా? అయితే రాత్రుళ్లు చేయాల్సిన పనులు ఇవే

ప్రతిరోజూ కేవలం 5 నుంచి 10 నిమిషాల పాటు ధ్యానం (Meditation) లేదా మైండ్‌ఫుల్‌నెస్ సాధన చేయడం వల్ల మనసులో వచ్చే అనవసర ఆలోచనలు చాలావరకు తగ్గుతాయని డాక్టర్ నవీన్ తెలిపారు. అలాగే మీ చుట్టూ కనిపిస్తున్నవి, వినిపిస్తున్నవి, అనుభూతి చెందుతున్న వాటిపై దృష్టి పెట్టడం కూడా ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుందట.

మీ ఆలోచనలకు తగ్గట్లు పనిచేయండి

మీరు ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం ఉంటే.. ఈ రోజే మీరు దానికోసం చేయగలిగే ఒక చిన్న పనిని కాగితంపై రాసుకుని దానిని పూర్తి చేయడానికి ప్రయత్నించండి. ఇలా చేయడం వల్ల ఒకే విషయాన్ని పదేపదే ఆలోచించడం, ఆందోళన తగ్గుతుంది. ఒకవేళ ఆ సమస్య మీ నియంత్రణలో లేకపోతే.. ప్రతి ఫలితాన్ని ముందే ఊహించే ప్రయత్నం చేయకుండా పరిస్థితిని అంగీకరించడం నేర్చుకోవాలి.

వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలంటే..

ఓవర్‌థింకింగ్ ఎక్కువ వారాలు కొనసాగినా.. నిద్రపై ప్రభావం చూపినా, ఉద్యోగం లేదా చదువులో ఇబ్బందులు కలిగించినా, కుటుంబ, వ్యక్తిగత సంబంధాలపై ప్రభావం చూపించినా, తీవ్రమైన ఆందోళన, పానిక్ అటాక్స్ లేదా నిరంతరం నిరాశగా అనిపించినా.. వెంటనే సైకియాట్రిస్ట్ లేదా మానసిక ఆరోగ్య నిపుణులను సంప్రదించడం మంచిది. ప్రారంభ దశలోనే కౌన్సెలింగ్ లేదా థెరపీ తీసుకోవడం వల్ల సమస్య తీవ్రం కాకుండా నివారించవచ్చు.

Also Read : ఉదయాన్నే 30 సెకన్లు వెనక్కి నడిస్తే చాలు.. శారీరక, మానసిక ప్రయోజనాలు పొందడం ఖాయం

మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే రోజువారీ అలవాట్లు

ఓవర్‌థింకింగ్ అనేది మార్చుకోగలిగే అలవాటే. ఈ చిన్న అలవాట్లు పాటిస్తే మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రతిరోజూ డీప్ బ్రీతింగ్ ప్రాక్టీస్ట్ చేయండి. అలాగే శారీరక వ్యాయామం ఉండేలా చూసుకోండి. తగినంత నిద్రపోండి. పడుకునే ముందు మొబైల్, ల్యాప్‌టాప్ వంటి స్క్రీన్‌ల వినియోగాన్ని తగ్గించండి. కుటుంబ సభ్యులు, స్నేహితులతో మాట్లాడేందుకు సమయం కేటాయించాలని సూచిస్తున్నారు నిపుణులు. 

ఓవర్‌థింకింగ్ అనేది చాలా మందిలో కనిపించే సాధారణ సమస్యే. కానీ అది రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసే స్థాయికి చేరుకుంటే నిర్లక్ష్యం చేయకూడదు. మీ ఆలోచనలను గుర్తించడం, ప్రస్తుత క్షణంపై దృష్టి పెట్టడం, సమస్యకు చిన్నచిన్న చర్యలతో పరిష్కారం వెతకడం వంటి అలవాట్లు ఓవర్‌థింకింగ్‌ను నియంత్రించడంలో సహాయపడతాయి. ఒకవేళ సమస్య ఎక్కువ కాలం కొనసాగితే మానసిక ఆరోగ్య నిపుణుల సహాయం తీసుకోవడం మంచిది.

Also Read : గట్ హెల్త్, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఫుడ్స్.. మొక్కల ఆధారిత ఫుడ్స్​తో ఎన్ని లాభాలో

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Monsoon Mold : ఇంట్లో పెరిగే బూజుతో జాగ్రత్త, ముఖ్యంగా వర్షాకాలంలో.. ఊపిరితిత్తులపై ప్రభావం చూపొచ్చంటున్న వైద్యులు
ఇంట్లో పెరిగే బూజుతో జాగ్రత్త, ముఖ్యంగా వర్షాకాలంలో.. ఊపిరితిత్తులపై ప్రభావం చూపొచ్చంటున్న వైద్యులు
Fenugreek Growing Tips : ఇంట్లోనే మెంతి కూర చాలా ఈజీగా పెంచుకోవచ్చు తెలుసా? చిన్న కుండీలో పెంచగలిగే టిప్స్ ఇవే
ఇంట్లోనే మెంతి కూర చాలా ఈజీగా పెంచుకోవచ్చు తెలుసా? చిన్న కుండీలో పెంచగలిగే టిప్స్ ఇవే
Tips To Control Diabetes : మధుమేహాన్ని డైట్​తోనే కాదు.. ఈ 3 మార్పులతో బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయండి
మధుమేహాన్ని డైట్​తోనే కాదు.. ఈ 3 మార్పులతో బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయండి
Castor Oil for Hair : ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి
ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
రూ.18 లక్షల నుంచే కొత్త 7 సీటర్‌ EV!.. MG Hector Tomahawk‌పై భారీ అంచనాలు!
కవరింగ్‌ లేకుండానే కనిపించిన MG కొత్త EV.. 530km రేంజ్‌తో వస్తున్న Hector Tomahawk!
Kidney Health : కిడ్నీలను దెబ్బతీసే ఫుడ్స్ ఇవే.. మూత్రపిండాల సరిగ్గా పనిచేయాలంటే వీటిని తినడం తగ్గించండి
కిడ్నీలను దెబ్బతీసే ఫుడ్స్ ఇవే.. మూత్రపిండాల సరిగ్గా పనిచేయాలంటే వీటిని తినడం తగ్గించండి
Embed widget