అన్వేషించండి

Plant-Based Foods : గట్ హెల్త్, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఫుడ్స్.. మొక్కల ఆధారిత ఫుడ్స్​తో ఎన్ని లాభాలో

Plant Based Diet : సహజమైన ఆహారం శరీరానికి, మనసుకు బలాన్నిస్తుంది. ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం.

Benefits of Plant-Based Foods : మొక్కల ఆధారిత ఆహారం (Plant Based Food) మొత్తం శ్రేయస్సును కాపాడుకోవడానికి హెల్ప్ చేస్తుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అత్యంత సహజమైన, ప్రభావవంతమైన మార్గాలలో ప్లాంట్ బేస్డ్ ఫుడ్ కూడా ఒకటి. ప్రకృతి మనకు నేరుగా అందించే ఆహారాలు అంటే  ధాన్యాలు, పండ్లు, కూరగాయలు, గింజలు, విత్తనాలతో కూడినవి. వీటితో కూడిన ఆహారం శరీరానికి ముఖ్యమైన పోషకాలను అందిస్తుంది. బాగా ప్రాసెస్ చేసిన ఆహారాలకు భిన్నంగా.. మొక్కల ఆధారిత ఆహారం స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన పోషణను అందిస్తుంది. ఇది శరీరానికి, మనసుకు కూడా హెల్ప్ చేస్తుందని పోషకాహార నిపుణులు శ్రీమతి ఆల్మా చోప్రా తెలిపారు.

ఆరోగ్యంతో పాటు.. మానసిక ఆరోగ్యానికి కూడా 

మొక్కల ఆధారిత ఆహారాల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఆరోగ్యకరమైన పేగు మంచి జీర్ణక్రియకు మద్దతు ఇస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మీ శరీరం పోషకాలను సమర్థవంతంగా గ్రహించేలా చేస్తుంది. జీర్ణ ఆరోగ్యానికి మద్దతు ఇచ్చి మానసిక స్పష్టతను పెంచుతుంది. ఎమోషనల్​గా బ్యాలెన్స్​గా ఉండేలా చేస్తుంది.

మొక్కల ఆధారిత ఆహారం ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆందోళన, ఒత్తిడి స్థాయిలు తగ్గుతాయని... ప్రశాంతత లభిస్తుందని పరిశోధనలు చెప్తున్నాయి. పేగు సరిగ్గా పనిచేసినప్పుడు అది మెదడుకు సానుకూల సంకేతాలను పంపుతుంది. దీనివల్ల మానసిక స్థితి మెరుగై.. మూడ్ డిస్టర్బ్ కాకుండా ఉంటుంది.  అభిజ్ఞా పనితీరుకు హెల్ప్ చేస్తుంది. మెదడు ఆరోగ్యానికి కూడా మంచిది కాబట్టే.. పిల్లలకు కూడా ఈ తరహా ఫుడ్ అలవాటు చేయాలంటున్నారు.

బ్యాలెన్స్డ్ డైట్

ఈ మధ్యకాలంలో ఆరోగ్యంపై శ్రద్దతో చాలామంది నాన్​వెజ్​కి దూరంగా ఉంటూ శాఖాహారులుగా మారుతున్నారు. లేదా మొక్కల ఆధారిత జీవనశైలిని స్వీకరిస్తున్నారు. అలా ఫాలో అయ్యేవారిలో శక్తి స్థాయిలు, మానసిక స్థితి, మొత్తం ఆరోగ్యంలో స్పష్టమైన మార్పులు, మెరుగుదలను చూస్తున్నారు. కాబట్టి మీరు కూడా మీ డైట్​లో ప్లాంట్ బేస్డ్ ఫుడ్ ఉండేలా చూసుకునేందుకు ట్రై చేయాలని చెప్తున్నారు పోషకాహార నిపుణులు. భోజనాన్ని కేవలం ఆహారంగానే చూడకుండా.. అది మీ మనస్సు, శరీరానికి పోషణనిచ్చే ఫుడ్​గా చూడాలంటున్నారు.  ఆకుకూరలు, ధాన్యాలు మీ భోజనంలో ఉండేలా చూసుకోండి. ప్లేట్ ఎప్పుడూ బ్యాలెన్స్డ్​గా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే శరీరానికి కావాల్సిన పోషకాలు లోపలి నుంచి అందుతాయి. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
రూ.19.45 లక్షల నుంచి మహీంద్రా BE 6 Sporteq.. మీ అవసరానికి సరిపోయే వేరియంట్‌ ఇదే!
మహీంద్రా BE 6 Sporteqలో ఏ వేరియంట్‌ బెస్ట్? ధర, బ్యాటరీ, ఫీచర్ల పూర్తి వివరాలు!
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
RRB JE Posts 2026: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
RRB JE Posts: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
Embed widget