బరువు తగ్గాలని చూస్తున్నారా? అయితే మీరు ఈ వెజ్​ సలాడ్​ని మీ డైట్​లో చేర్చుకోవచ్చు.

వెజ్ సలాడ్ చేసేందుకు శెనగలు, చెర్రీటోమాటో, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర తీసుకోవాలి.

శెనగలను ఉడికించుకున్నా పర్లేదు లేదా వాటిని స్ప్రౌట్స్​లా చేసుకోవచ్చు.

నిమ్మరసం, ఆలివ్ నూనె, కారం, చాట్ మసాలాను కూడా సిద్ధం చేసుకోవాలి.

ముందుగా నిమ్మరసం, ఆలివ్ నూనె, కారం, చాట్​ మసాలను మిక్స్ చేసుకోవాలి.

మిక్సింగ్ బౌల్​లో కూరగాయాలు, శెనగలు వేసి.. నిమ్మరసం మిశ్రమం వేసి మిక్స్ వేసి కలపాలి.

చివర్లో కొత్తమీర వేసుకుని గార్నిష్ చేసుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ వెజ్ సలాడ్ రెడీ.

ఇది శరీరానికి కావాల్సిన ప్రోటీన్ అందిస్తూ.. బరువు తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది.

ఇవి కేవలం అవగాహన కోసమే. వైద్యుల సలహా తీసుకుని పాటిస్తే మంచిది. (Images Source : Envato)