వేసవిలో చెమట సమస్యకు ఇలా గుడ్‌బై చెప్పండి

వేసవిలో శరీరం ఎక్కువగా నీటిని నష్టపోతుంది. కనుక రోజంతా తగినన్ని నీళ్లు తాగుతూ ఉండాలి.

వేసవిలో చన్నీటి స్నానం చేస్తే తాజా ఫీల్ ఉండడం మాత్రమే కాదు.. శరీరంలో వేడి తగ్గుతుంది. ఫలితంగా చెమట తగ్గుతుంది.

వేసవిలో ఎక్కువ మసాలా ఫుడ్స్ తినొద్దు. అవి శరీరంలో వేడి పెంచుతాయి. చెమట ఎక్కువ వస్తుంది.

వీలైనంత వరకు చల్లగా ఉండే ప్రాంతాల్లోనే ఉండాలి. బయటకు వెళ్తే నీడలో ఉండాలి.

వీలైనంత వరకు వదులుగా ఉండే నూలు వస్త్రాలు ధరించాలి.

యాంటీ పెర్స్పిరెంట్ డియోడరెంట్ల వంటివి వాడితే కొంత చెమట బెడద తగ్గిపోతుంది.

టాల్కమ్ పౌడర్ తో చెమట తగ్గుతుంది. ఎక్కువ చెమట వచ్చే భాగాల్లో టాల్కమ్ పౌడర్ వాడడం వల్ల పొడిగా ఉండి దుర్వాసన రాదు.



పాదాలకు బూట్లకంటే చెప్పులు ధరించడం మంచిది. పాదాల్లో చెమట రాకుండా ఉంటుంది.

ఈ సమాచారం కేవలం అవగాకోసం మాత్రమే