గుండె బలహీనంగా ఉన్న వారు తినే ఆహారం విషయంలో తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలి.

గ్వాకామోల్ అనే అవకాడో డిప్ తో కూరగాయ ముక్కలు స్నాక్ గా తీసుకుంటే చాలా ఆరోగ్యకరం.

బెర్రీలను పెరుగుతో కలిపి తీసుకుంటే ప్రొటీన్, కాల్షియంతో పాటు యాంటీఆక్సిడెంట్లు కూడా అందుతాయి.

ఆపిల్ పండు ముక్కలను బాదాం లేదా పీనట్ బట్టర్ తో తీసుకుంటే ఆపిల్ లో ఉండే ఫైబర్ వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గుతుంది.

పుట్నాలుగా పిలుచుకునే బట్టీల్లో వేయించిన శనగల్లో ప్రొటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. వీటిలో క్యాలరీలు కూడా తక్కువ.

ఇంట్లో తయారు చేసిన ట్రయల్ మిక్స్ కూడా మంచిదే. అందులో డ్రైఫ్రూట్స్, గింజలు, తప్పక చేర్చి, చక్కెర తక్కువ వాడితే మేలు.

బాగా ఉడికిన గుడ్డులో ప్రొటీన్ తగినంత ఉంటుంది. ఇందులోని కోలిన్ మెదడు ఆరోగ్యానికి మంచిది.

ఈ సమాచారం కేవలం అవగాహన కోసమే



Thanks for Reading. UP NEXT

మల్టీవిటమన్స్ ఎక్కువగా తీసుకుంటే ఏమౌతుందో తెలుసా?

View next story