మల్టీవిటమన్స్ ఎక్కువగా తీసుకుంటే ఏమౌతుందో తెలుసా? మనలో చాలా మంది మల్టీవిటమిన్స్ క్రమం తప్పకుండా వాడుతుంటారు. మల్టీవిటమిన్స్ అధికంగా తీసుకుంటే జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. కిడ్నీల్లో రాళ్లు ఏర్పడటానికి మల్టీవిటమిన్స్ కూడా ఒక కారణమని వైద్యులు అంటున్నారు. హైపర్విటమినోసిస్ లేదా మీ శరీరంలో ఒక విటమిన్ అధిక మోతాదు తీసుకుంటే ఇతర సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మందులతో కాకుండా నేచురల్ ఫుడ్స్ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. మల్టీవిటమిన్స్ లో విటమిన్ B6 అధికంగా తీసుకుంటే నరాలకు నష్టం వాటిల్లుతుంది. మల్టీవిటమిన్లు మన ఆరోగ్యానికి మంచివే కానీ. మోతాదుకు మించి తీసుకుంటే ఇతర దుష్ప్రబావాలను ఎదుర్కొవల్సి ఉంటుంది.