భుజంగాసనం vs నౌకాసనం.. ఏ ఆసనంతో త్వరగా బరువు తగ్గుతారు? బరువు తగ్గేందుకు యోగాలో భుజంగాసనం, నౌకాసనం మంచి ఫలితాలను ఇస్తాయి. దేనితో ఎక్కువ లాభం ఉంటుందో చూద్దాం. భుజంగాసనంతో వెన్నెముక శక్తివంతం అవుతుంది. జీర్ణక్రియకు తోడ్పడుతుంది. పిరుదుల కండరాలు బలంగా అవుతాయి. శరీరంలో ఫ్లెక్సిబిలిటి పెరుగుతుంది. ముఖ్యంగా నడుము నొప్పి తగ్గిస్తుంది. నౌకాసనంలో కూడా కండరాలు బలోపేతం అవుతాయి. శరీరంలో సంతులన శక్తి పెరుగుతుంది. పొట్టదగ్గర కొవ్వు కరిగేందుకు సహకరిస్తుంది. నౌకాసనం కూడా జీర్ణక్రియకు తోడ్పడుతుంది. ఆత్మవిశ్వాసం పెంచుతుంది. రెండు ఆసనాలతోనూ జీవక్రియలు మెరుగవుతాయి. కండరాల పటుత్వం పెరుగుతుంది. భుజంగాసన వెన్నెముక మీద ఎక్కువ దృష్టిసారిస్తుంది. నౌకాసనం పొట్ట కండరాల మీద దృష్టి నిలుపుతుంది. సమతుల ఆహారం తీసుకుంటూ రెండు ఆసనాలను క్రమం తప్పకుండా సాధన చేసినపుడు తప్పకుండా గణనీయంగా బరువు తగ్గుతారు. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.