సమ్మర్ అంటేనే మామిడి కాయల సీజన్, కానీ చాలామంది పండు మామిడి కాయనే ఇష్టపడతారు
కానీ ఈ సమ్మర్‌లో పండు మామిడి కంటే పచ్చి మామిడి కాయతోనే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తెలుసా?
పచ్చి మామిడి పుల్లగా ఉండటం వల్ల 'విటమిన్ సి' పుష్కలంగా ఉంటుంది. ఇది సమ్మర్‌లో మీ చర్మ, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందట
పచ్చి మామిడిలో ఉండే పాచకరసాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం, అజీర్తీచ గ్యాస్ వంటి జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది
ఇందులో ఉండే ఐరన్ రక్తహీనతను నివారిస్తుంది. ఇది రక్తంలో ఎర్ర రక్త కణాల సంఖ్యను పెంచడంలో కూడా సహాయపడుతుంది
పచ్చి మామిడిలో ఉండే 'విటమిన్ సి' రోగనిరోధక శక్తిని పెంచడమే కాదు జలుబు, దగ్గు, ఫ్లూ వంటి వ్యాధులను దరి చేరనివ్వదు
పచ్చి మామిడిలో 'విటమిన్ ఎ' కూడా ఉంటుందట. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాదు, చర్మం సాగతీత, ముడతలను తగ్గిస్తుంది.
పచ్చి మామిడిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించడంలో సహాయపడతాయి
పచ్చి మామిడిలో కేలరీలు తక్కువగా ఉండి, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఇది బరువు తగ్గడంలో బాగా సహాయపడుతుంది.
ఇందులో ఉండే పొటాషియం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరస్తుంది. రక్తపోటు నియంత్రించి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది
ఇది మధుమేహాన్ని నియంత్రించడంలోనూ కీ రోల్ పోషిస్తుందట. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించి డయాబెటిస్‌కి చెక్ పెడుతుందట