దేశంలో శ్రీరామ నవమి వేడుకలు అట్టహాసంగా జరిగే ఆలయాలు ఇవే!

1.అయోధ్య, ఉత్తరప్రదేశ్: శ్రీరామ జన్మస్థలం అయోధ్యలో శ్రీరామ నవమి వేడుకలు వైభవంగా జరుగుతాయి.

2.భద్రాచలం, తెలంగాణ: దక్షిణ అయోధ్యగా పిలిచే భద్రాచలంలో 'సీతారామ కళ్యాణం' ఘనంగా జరుగుతుంది.

3.ఒంటిమిట్ట, ఆంధ్రప్రదేశ్: 450 ఏండ్లనాటి శ్రీకొండండరామ స్వామి ఆలయంలో నవమి వేడుకలు ఘనంగా జరుగుతాయి.

4.రామేశ్వరం, తమిళనాడు: శ్రీ కోదండరామ స్వామి దేవాలయం శ్రీరామనవమి వేడుకలు అట్టహాసంగా జరుగుతాయి.

5.షిరిడీ, మహారాష్ట్ర: సాయిబాబ ఆలయంలో 3 రోజుల పాటు నవమి వేడుకలు ఉత్సాహం జరుపుతారు.

6.సీతామర్హి, బీహార్‌: సీతాదేవి జన్మస్థలంగా నమ్మే జానకీ మందిరంలో నవమి వేడుకలు ఘనంగా జరుగుతాయి.

All Photos Credit: X