'ఐలవ్యూ' కి బదులు ఈ మాటలు చెప్పారంటే మీ ప్రేమను చక్కగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అవతలి వారికీ లోతు అర్థమవుతుంది. నువ్వు నా జీవితంలో ఉండటం అదృష్టంగా భావిస్తున్నాను .. ప్రేమ కంటే గ్రాటిట్యూడ్ లోతైన ఎమోషన్ ను కలిగిస్తుంది. వారు మీతో ఉండటాన్ని మీరు గొప్పగా గౌరవిస్తున్నారని తెలిసిందంటే మీ ప్రేమ నేరుగా వారి గుండెను తాకుతుంది నా జీవితంలో నువ్వు చాలా ముఖ్యమైన వ్యక్తివి అని మనస్ఫూర్తిగా చెప్తే అవతలి వారు మీ ప్రేమలో మునిగిపోతారు మనిద్దరం కలిసి గడిపే క్షణాలు నాకు చాలా స్పెషల్ అని చెప్తే వారికి మీరిచ్చే విలువ అర్థమవుతుంది నా కోసం, మన కోసం.. నువ్వు చేస్తున్న పనులు నాకెంతో ఇష్టం రిలేషన్షిప్ లో వారి ఎఫర్ట్స్ ని గుర్తించి, మీరెంత గౌరవిస్తున్నారో తెలియజేస్తే బంధం బలపడుతుంది. నా లైఫ్ లో జరిగిన బెస్ట్ విషయం ఏదైనా ఉందంటే అది నువ్వే అని చెప్పండి ..మీ ప్రేమ వారి కళ్లల్లో చూడొచ్చు నీతో ఉన్నంత క్లోజ్ గా మరెవరితోనూ ఉండలేను అనటం వారి దగ్గర మీరు సెక్యూర్డ్ గా ఉంటారని తెలియజేసినట్టు. కాస్త డ్రమాటిక్ గా అనిపించినా, నువ్వే నా ప్రపంచం అని చెప్పాలనిపించినపుడు చెప్పేయటం బాగుంటుంది నీ మీదున్న ప్రేమ మాటల్లో చెప్పాలంటే చాలా చాలా కష్టం అనేయండి..ఏమీ చెప్పకుండానే, అంతా చెప్పిన వారవుతారు :)