సమ్మర్లో స్పృహ తప్పి పడిపోతే.. ఇవి ఫాలో అవ్వండి వేసవికాలంలో వేడి తట్టుకోలేక, వడదెబ్బతో చాలామంది స్పృహ తప్పి పడిపోతూ ఉంటారు. ఆ సమయంలో పక్కనున్నవారికి కూడా కాస్త కంగారుగానే ఉంటుంది. అయితే అలా ఎవరైనా స్పృహ తప్పి పడిపోతే ప్రథమ చికిత్సగా కొన్ని పనులు చేయాలి. స్పృహ కోల్పోయిన వారిని వెల్లకిలా పడుకోబెట్టి.. మెడను పక్కకి తిప్పాలి. దుస్తులను కాస్త వదులు చేసి.. రిలాక్స్‌గా ఉండేలా చేయాలి. స్పృహ నుంచి తేరుకున్నాక మాటలో మార్పు, కాలు, చేతిలో మార్పులు గమనించాలి. గుండె సమస్యలు, శరీరంలో మార్పులు చూస్తే వెంటనే వైద్యుని దగ్గరకు తీసుకెళ్లాలి. నాడి ఎలా ఉందో చూసి.. వేగంగా కొట్టుకుంటే గుండె సమస్యగా గుర్తించాలి. ఇవి అవగాహన కోసమే. నిపుణుల సలహాలు తీసుకుంటే మంచిది. (Images Source : Unsplash)