పళ్లు తళ తళ మెరవాలని చాలామందికి ఉంటుంది. అయితే కొన్ని సింపుల్ టిప్స్​తో వాటిని మెరిసేలా చేయొచ్చు.

అంతేకాకుండా ఈ టిప్స్ పళ్లను వైట్​గా మార్చడమే కాకుండా బలంగా మారుస్తాయి.

సరైన పోషకాలు తీసుకోకపోవడం.. అనారోగ్యకరమైన జీవనశైలి దంతాలను బలహీనం చేస్తాయి.

కాఫీలు, టీలలోని చక్కెర దంతాల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది.

రోజుకి రెండుసార్లు పళ్లు తోముకోవడంతో పాటు.. పళ్ల మధ్య సన్నని దారంతో శుభ్రం చేసుకోవాలి.

ఫ్లోరైడ్​తో కూడిన టూత్​పేస్ట్​తో పళ్లు తోముకోవాలి. ఇది దంతక్షయాన్ని దూరం చేస్తుంది.

తీపి పానీయాలు ఎక్కువగా తీసుకోకుడూదు. ఎప్పుడూ ఏదోకటి నమలటం మానేయాలి.

బ్యాక్టీరియా వృద్ధి చెందకుండా.. ఏదైనా తిన్నవెంటనే నోటిని పుక్కిలించడం అలవాటు చేసుకోవాలి.

ఇవి అవగాహన కోసమే. వైద్యులను సంప్రదించి మీరు సలహాలు తీసుకుంటే మంచిది. (Images Source : Unsplash)