సూర్య నమస్కారాలు సాధన చేయడం ద్వారా మనసు, శరీరం శక్తిని సంతరించుకుంటాయి. క్రమం తప్పకుండా సాధన చేస్తే శరీరం ఫ్లెక్సిబుల్ గా తయారవుతుంది. శరీర భంగిమలు కూడా సరిగ్గా ఉంటాయి. సూర్యనమస్కారాలలోని కదలికల వల్ల ఒత్తిడి దూరం అవుతుంది. లయబద్ధమైన కదలికలు మనసును శాంత పరుస్తాయి. సూర్యనమస్కారాల సాధన గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. రక్తప్రసరణ మెరుగై.. చర్మానికి మంచి ప్రయోజనాలు అందుతాయి. బాడీ కోర్ ఎనర్జీ మెరుగుపడుతుంది. ఆలోచనల్లో ఒక స్థిరత్వం వస్తుంది. శరీర బరువు అదుపులో ఉంటుంది. ఎక్కువ బరువు ఉన్నవాళ్లు బరువు తగ్గుతారు. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.