బరువు సులభంగా తగ్గేందుకు ఆయుర్వేదంలో కొన్ని నియమాలు, చిట్కాలు సూచించారు.

కఫ లక్షణాలు కలిగిన ఆహారాన్ని దూరం పెట్టాలి. తాజాగా వేడిగా ఉండే, పొడి, తేలికైన త్వరగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి.

ఇంట్లో తయారు చేసిన ఆహారం ఎంచుకుంటే మంచిది.

శరీరం నుంచి టాక్సిన్లను బయటకు పంపేందుకు ఆయుర్వేదం వేడి నీటిని మించింది లేదని చెబుతుంది.

అల్లం ముక్కలు వేసిన వేడి నీటిని లేదా గ్రీన్ టీ వంటివి తాగితే మంచిది.

జీవక్రియలను వేగవంతం చేయడానికి ప్రతి రోజూ తప్పక వ్యాయామం చెయ్యలి.

సాయంత్రం 7 గంటల కల్లా భోజనం ముగించాలి. ఫలితంగా రాత్రంతా డీటాక్సిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతుంది.

డిన్నర్ లో సూప్ లు, సలాడ్ లు ఉంటే మరింత మంచిది.

తగినంత నిద్ర లేకపోతే బరువు పెరిగే ప్రమాదం ఉంది. ఆయుర్వేదం రాత్రి 10 నుంచి ఉదయం 6 వరకు నిద్ర పోవడం మంచిదని చెబుతుంది.

Image Source: Pexels and pixabay

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.